ముగ్గురు యు వతులను
అదుపులోకి
కర్నూలు-ప్రకాశం జిల్లా స రిహద్దు ప్రాంతంలోని శ్రీశైలం అడవు ల్లో
నక్సల్స్ కోసం కూబింగ్ చేస్తున్న గ్రేహౌండ్స్ పోలీసులు ముగ్గురు యు వతులను
అదుపులోకి తీసుకున్నట్లు స మాచారం. పాలుట్ల అ టవీ ప్రాంతంలో
కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్ పోలీసులకు వీరు తారసడ్డారని
తెలుస్తోంది. గ్రేహౌండ్స్ పార్టీతోపాటు స్థానిక ట్రైనింగ్ ఎస్ఐ వి
జయబాస్కర్ కూడా వారితో వున్నట్లు సమాచారం. ఇంతకూ గ్రేహౌండ్స్ పో లీసులు ఆ
ముగ్గురు యువతులను విడిచిపెట్టారా? లేక స్థానిక పోలీసుల కు అప్పగించారా?
అనే విషయం తేలలేదు. ఈ విషయంపై స్థానిక టూ టౌ న్ పోలీస్ స్టేషన్ ట్రైనింగ్
ఎస్ఐ విజయభాస్కర్‌ను వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ... పాలుట్ల ప్రాంతం నుంచి
సున్నిపెంట గ్రామానికి వస్తున్న ముగ్గురు విద్యార్థినులను అనుమానం తో
అదుపులోకి తీసుకున్నామని, వారు శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని ప్రతిభ పా ఠశాల
విద్యార్థినులని చెప్పారు. అయి తే ప్రతిభ పాఠశాల వారిని
వదిలేశామని ప్రిన్సిపాల్ ఎంబీ ఇస్మాయిల్, ఐటీడీఏ అధికారి కె.రమేష్‌లను
ఆన్‌లైన్ వివరణ కోరగా.. పోలీసులు చెప్తున్నట్లు ఆ విద్యార్థినులు తమ
పరిధిలోని పాఠశాల విద్యార్థులు కారని, వారు ఎవరో తమకు తెలియదని చెప్పారు.
ఇంతకూ సున్నిపెంట టూటౌన్ పోలీసులు ఎవరిని అదుపులోకి తీసుకున్నదీ తేలాల్సి
ఉన్నది. ఆ ముగ్గురు మావోయిస్టులా? లేక నక్సల్స్ సానుభూతి పరులా? లేక
విద్యార్థులా? అనే విషయం వెలుగులోకి రావాల్సి ఉంది
No comments:
Post a Comment