Wednesday, 14 December 2011

పుట్టపర్తిని చూసి నేర్చుకుందాం...టీటీడీ ఈవో

పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి సేవాదళ్ నిర్వహణను అధ్యయనం చేసి తిరుమల శ్రీవారి సేవ విభాగాన్ని పటిష్టంగా అమలు చేయడానికి టీటీడీ నిర్ణయించిం ది. ఇందుకోసం తిరుమల జేఈవో శ్రీని వాసరాజు నేతృత్వంలో 25 మంది అధికారుల బృందం అక్కడికి బయల్దేరింది. పుట్టపర్తి కంటే 20 రెట్లు ఎక్కువగా భక్తులు తిరుమలకు వస్తున్నందు వల్ల ఆ సూత్రం ఇక్కడికెలా వర్తిస్తుందని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు.
పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా దర్శ నం కోసం వచ్చే భక్తులతో పాటు అక్కడి అన్నదానం, వివిధ అనుబంధ సంస్థల్లో స్వచ్చంద సేవలందించే లక్ష్యంతో 1965 ఆగస్టులో శ్రీ సత్యసాయి సేవాదళ్ ఆవి ర్భవించింది. దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక అధ్యక్షుడు ఆ రాష్ట్రానికి చెందిన సత్యసాయి సేవా బృందాలను సమన్వయ పరుస్తారు. ఒక్కో బృందం పుట్టపర్తిలో 15 రోజుల పాటు ఉండి ప్రశాంతి నిల యం, అన్నదానం సముదాయం, సూప ర్ స్పెషాలిటీ ఆస్పత్రి, విద్యాసంస్థల్లో స్వచ్ఛంద సేవలందిస్తారు. ఈ విభాగా న్ని నిర్వహించే విధానం, సమన్వయ పరచే తీరును అధ్యయనం చేసి టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి సేవలో అమలు చేయాలని దశాబ్ద కాలం నుంచి టీటీడీ యోచిస్తోంది. గతంలో టీటీడీ బృందాన్ని పుట్టపర్తికి అధ్యయనం కోసం పంపే ప్రయత్నం చేసింది. స్వామి జన్మదినోత్సవాలను మినహాయిస్తే, రోజుకు 15 వేల నుంచి 20 వేల మంది భక్తులు వచ్చే పుట్టపర్తికి, 50 నుంచి 60 వేల మంది వచ్చే తిరుమలకు పోలికేంటని అప్పట్లో ఉద్యో గ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో ఆ ప్రతిపాదన మరుగున పడింది. ప్రస్తుత ఈవో ఎల్‌వీ.సుబ్రమణ్యానికి పుట్టపర్తితో అనుబంధం ఉండటంతోపాటు అక్కడ సాయిసేవాదళ్ సేవలను ప్రత్యక్షంగా చూసిన అనుభవం ఉంది. ఈ కారణంగానే టీటీడీ నుంచి అధికారుల బృందాన్ని అక్కడికి పంపి స్వచ్ఛంద సేవ తీరుపై అధ్యయనం చేయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే . వీరు రెండు రోజుల పాటు అక్కడే ఉండి సాయిసేవాదళ్ నిర్వహణ తీరును పరిశీలిస్తారు. ఈ అనుభవంతో తిరుమలలో అమలవుతున్న శ్రీవారి సేవ విభాగంలో మార్పులు, చేర్పులు చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రపంచంలోని అనేక ప్రసిద్ధి చెందిన ఆలయాలు తిరుమలకు వచ్చి ఇక్కడి క్యూ, తలనీలాల సమర్పణ, అన్నదానం, పారిశుద్ధ్యం, వసతి లాంటి అంశాలను పరిశీలించి వెళుతుంటే టీటీడీ పుట్టపర్తి బాట పట్టడం ఏమిటనే వాదనలు ఇక్కడి ఉద్యోగుల్లో వినిపిస్తున్నాయి. అయితే మంచిని చూసి అన్వయించుకోవడంలో తప్పేముందని అధికారులు చెబుతున్నారు.

No comments:

Post a Comment