Wednesday, 14 December 2011

త్వరలో ఐదు సీబీఐ కోర్టులను ఏర్పాటు

రాష్ట్ర రాజ ధాని హైదరాబాద్‌లో 3, విశాఖపట్టణంలో 2 వంతున త్వరలో ఐదు సీబీఐ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వెల్లడించారు. మంగళవారం రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పం కజ్ ద్వివేదీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మౌలిక సౌకర్యాల కల్పనపై సీఎస్‌తో చర్చించామన్నారు. దీంతోపాటు మరికొన్ని ఇతర అంశాలను ఆయన దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా సీబీఐ విచారణ కోసం సచివాలయంలోని వివిధ శాఖల నుంచి సమాచారం తెప్పించుకునేందుకు వీలుగా ఒక సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. దీనివల్ల తమ విచారణ సులువవుతుందని పేర్కొన్నారు.

No comments:

Post a Comment