Tuesday, 15 November 2011

పోటెత్తిన మహానంది

కార్తీకమాసం సోమవారం నేపథ్యంలో మహానంది పుణ్యక్షేత్రం భక్తులతో పోటెత్తింది. సుమారు 20 వేల మందికి పైగా భక్తులు ఆలయానికి రావడంతో ఆలయ పరిసరాలన్ని కిక్కిరిసిపోయాయి. వేకువ జాము నుండే ప్రారంభమైన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి వారి దర్శన సౌకర్యం రాత్రి 9గంటల వరకు నిర్వీరామంగా కొనసాగింది. భక్తుల తాకిడితో క్యూలైన్లన్ని కిటకిటలాడిపోయాయి. అభిషేక ప్రియుడైన శ్రీ మహానందీశ్వర స్వామి వారి అభిషేకాలతో తడిసి ముద్దయ్యారు. ఒకే రోజు 160కి పైగా సామూహిక అభిషేకాలు జరగడంతో స్వామి వారు నిజంగానే అభిషేక ప్రియుడయ్యారు. ఈఓ సాగర్‌బాబు ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, జ్వాలా చక్రవర్తి, శాంతరాంభట్ అభిషేక పూజాధికాలను నిర్వహించారు. సాధారణ దర్శనంలో 15వేల మంది భక్తులు, ప్రత్యేక దర్శనంలో 5వేల మంది, ఉచిత దర్శన సమయంలో మరి కొంత మంది భక్తులతో మహానంది క్షేత్రం పోటెత్తింది.
శ్రీశైలం క్షేత్రం తరహాలో మహానందిలో ప్రవేశపెట్టిన సామూహిక అభిషేకాలు విజయవంతమైనట్లు కర్నూలు జిల్లా దేవాదాయశాఖా డీసీ, మహానంది ఈఓ సాగర్‌బాబు తెలిపారు. కార్తీకమాసం మొదటిసోమవారం సుమారు 14వేలు, రెండవ వారం 16వే లు, పౌర్ణమిరోజు 16800 లడ్లను విక్రయించామని, ఈ నెల 23న మహానందీశ్వరస్వామివారికి లక్షబిల్వార్చన పూజలు, 24న శ్రీకామేశ్వరీదేవి అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

No comments:

Post a Comment