Tuesday, 15 November 2011

ఉద్యమం చేస్తే ఊరుకోం : టీజీ వెంకటేష్


తెలంగాణపై ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మళ్లీ ఉద్యమం చేస్తామంటే ప్రభుత్వం

 చూస్తూ  ఊరుకోదని, కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ హెచ్చరించారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ కాలిపోతాడు తప్పితే ప్రజలకు ఒరగబెట్టేదేంలేదని అన్నారు.
కేసీఆర్ ను నమ్ముకున్న వారు,  టీఆర్‌ఎస్ పార్టీని నమ్మి వెళ్లిన వారు నట్టేట మునుగుతారే తప్ప ఎంతోకాలం కేసీఆర్‌తో కలిసి ఉండలేరని అన్నారు. తన మాటల చాతుర్యంతో ఆయన ప్రజలను రెచ్చగొడుతున్నారని, కేసీఆర్ ఎవరితోనూ కలవరు, ఎవరినీ కలుపుకోలేరని విమర్శించారు.

No comments:

Post a Comment