Wednesday, 30 November 2011

ప్రొద్దుటూరు కోర్టుకు నిర్మాత సింగనమల రమేష్‌

పలు క్రిమినల్, చెక్‌బౌన్స్ కేసులకు సంబంధించి తెలుగు చలనచిత్ర నిర్మాత సింగనమల రమేష్‌  కడప జిల్లా ప్రొద్దుటూరు కోర్టుకు హజరయ్యారు. హైదరాబాదు నుంచి బందోబస్తుతో ప్రొద్దుటూరు వచ్చి ఒకటో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. రమేష్‌కు వడ్డీకి డబ్బులిచ్చామని, ఆ డబ్బులు ఇవ్వాలని కోరినపుడు బెదిరించాడని ప్రొద్దుటూరుకు చెందిన కొంత మంది ఫిర్యాదు చేశారు. తనకు భాను, మద్దెలచెర్వు సూరి తెలుసునని, బాకీ ఇవ్వాలని అడిగితే వారి చేత చంపిస్తానని బెదిరించాడంటూ రుణదాతలు ప్రొద్దుటూరు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సింగనమల రమేష్‌పై ఫిర్యాదు చేశారు.ఈ మేరకు అతనిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. క్రైం నెంబర్ 146/11, 147/11, 148/11, 151/11లకు సంబంధించి, అలాగే పలు చెక్‌బౌన్స్ కేసుల్లో విచారణ పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపర్చిన తర్వాత తిరిగి హైదరాబాద్ తీసుకెళ్లిపోయారు

No comments:

Post a Comment