Friday, 11 November 2011

నందమూరి తారక రామారావు గారి పేరు నిలబెడతా: బాలకృష్ణ


శ్రీరామ రాజ్యం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి, తనను ఆశీర్వదిస్తే...మరిన్ని పౌరాణిక సినిమాలు తీసి నాన్న నందమూరి తారక రామారావు గారి పేరు నిలబెడతానని బాలకృష్ణ అన్నారు. శ్రీరామ రాజ్యం సినిమా ప్రమోషన్లో భాగంగా శుక్రవారం రేడియో మిర్చి98.3 లో వ్యాఖ్యాత అవతారం ఎత్తిన బాలకృష్ణ శ్రోతలను అలరించారు. శ్రీరాముడి పరిపాలన విలవలు, ఆనాటి కుటుంబ బాంధవ్యాలు నేటి తరానికి గుర్తు చేయడానికే శ్రీరామరాజ్యం సినిమాను చేసినట్లు తెలిపారు. దర్శకులు బాపు చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. తెలుగు వినాలంటే రమణ, తెలుగు చూడాలంటే బాపు...శ్రీరామరాజ్యం రచయిత, దర్శకులను తనదైన శౌలిలో పొగడ్తలతో ముంచెత్తారు. తన తండ్రి నటించిన శ్రీకృష్ణ పాండవీయం, నర్తనశాల, సీతారామ కల్యాణం సినిమాలను రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నామని తెలిపారు. నర్తనశాల సినిమాను రీమేక్ చేసేందుకు పలువురు నిర్మాతలు ముందుకు వచ్చారని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు

No comments:

Post a Comment