Tuesday, 1 November 2011

బాలయ్య కొన్ని విమర్శలు

నందమూరి హీరో బాలయ్య నటించిన ‘శ్రీరామ రాజ్యం’ ఆడియో అభినందన సభ సోమవారం రాత్రి జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో బాలయ్య కొన్ని విమర్శలు సంధించారు. "చరిత్ర తెలియని వారు తెలుగు సినిమాల గురించి చాలా చిన్నతనంగా మాట్లాడారు. ఒకాయన మాట్లాడుతూ.. తెలుగులో ఏమున్నాయండి.. సరైన సినిమాలు.. సరైన డైరెక్టర్లే లేరు... అంటూ ఏదోదే వాగాడు. నేను వెంటనే... చరిత్ర తెలియకుండా మాట్లాడకు. మాట్లాడేముందు నోరు కంట్రోల్‌ చేసుకో! మీకు తెలుగు దర్శకుల గురించి మాట్లాడే హక్కులేదు. ఆదిత్య 369, భైరవద్వీపం వంటి సినిమాలు తీసింది తెలుగువారు కాదా?" అని అన్నారు
                            .

ఈ వాఖ్యలు మెగా వాసరుడు రామ్ చరణ్ ను ఉద్దేశించి అన్నవే అనే వాదన వినిపిస్తోంది ఫిల్మ్ నగర్లో..., సూర్య, మురుగదాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'సెవెన్త్‌ సెన్స్‌' సినిమా ప్రమోషన్‌లో మురుగదాస్‌ను, సూర్యను పొగడ్తల్తో ముంచెత్తాడు రామ్ చరణ్. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌లు కూడా ఇటువంటి పాత్రలు చేయడం సూర్యకే సాధ్యం. మాకు సాధ్యం కాదంటూనే... మురుగదాస్‌ వంటి గొప్ప దర్శకుడు తెలుగులో లేరు అని వ్యాఖ్యానించారు. దీంతో అప్పుడు బాలయ్య రామ్ చరణ్, అల్లు అర్జున్ కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. తాజాగా నిన్న రాత్రి బాలయ్య ఇదే విషయాన్ని లేవనెత్తడంతో.....సర్వత్రా 
చర్చనీయాంశమైంది

No comments:

Post a Comment