Tuesday, 1 November 2011

శ్రీరామరాజ్యం సినిమా కార్తీక పౌర్ణమి ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు

వెండితెరపై రాముడంటే ఎన్టీవోడే. మరి, బాలయ్య ఎలా ఉంటాడు? ఇప్పటికే కృష్ణుడిగా మెప్పించిన బాలకృష్ణ శ్రీరాముడి గెటప్‌లో వెలిగిపోతున్నాడు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీరామరాజ్యం ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు దూసుకొస్తోంది. వెండితెర అందగాడు బాలకృష్ణ రాముడి వేషమిది. శ్రీరామరాజ్యం స్టిల్స్‌ని చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఫస్ట్‌లుక్‌లో బాలయ్య కేక పెట్టిస్తున్నాడు. రామాయణ ఘట్టాల్ని తెరకెక్కించడంలో తనదైన స్టైల్‌ని కనబరిచే అగ్రశ్రేణి దర్శకుడు బాపు నిర్దేశకత్వంలో బాలయ్య అలరిస్తున్నాడు    
                                 
ఆహార్యంలో..., వేషధారణలో... నఖశిఖ పర్యంతం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తోంది. రొటీన్‌ సినిమాల నుంచి భిన్నంగా శ్రీరామరాజ్యం నిలుస్తుందని చిత్ర యూనిట్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. నవ్యతకు కొదవలేని సృజనాత్మక సాంకేతిక నిపుణులు మన దగ్గరా ఉన్నారని, గతాన్ని ఓసారి పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని బాలయ్య అన్నారు. బాలయ్యతో పాటు లక్ష్మణుడిగా శ్రీకాంత్, సీతగా నయనతార పాత్రల్ని ఛాలెంజింగ్‌గా తీసుకుని నటించారని చిత్ర యూనిట్‌ చెప్తోంది. శ్రీరామరాజ్యం సినిమా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది

No comments:

Post a Comment