ప్రకృతి చేతిలో కాదు... ప్రభుత్వ వైఖరి వల్లే రాయలసీమ ప్రాంతం ఆది నుంచి అన్యాయానికి గురైందని రాయలసీమ విమోచన సమితి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రా యలసీమ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో పట్ట ణంలోని పద్మశాలీయ కల్యాణ మండపంలో మంగళవారం రాయలసీమ భవిష్యత్తు ఏమి టి? అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి 22 శాతం ఆదాయం లభిస్తున్నా ప్రభుత్వం ఇందులో ఒకటిన్నర, రెండు శాతానికి మించి సీమ అభివృద్ధికి ఖర్చు చేయడం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ రాయలసీమ వెనుకబాటు తనాన్ని బట్టబయలు చేసిందన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మన రాష్ట్రానికి 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించగా, ఈ నీటి పంపకంలో కూడా మనకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణాను ప్రకటిస్తే మిగిలిన రాష్ట్రంలో రాయలసీమకు మళ్లీ అన్యాయం జరుగుతుందన్నారు.
తెలంగాణ వారు ప్రత్యేక రాష్ట్రం కావాలంటుంటే, తాము సమైక్యాంధ్రలో ఉంటామని ప్రాధేయడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదన్నారు. సిగ్గువిడిచిన మన పాలకులు విడిపోతే బతకలేమనే హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయాలని వస్తున్న డిమాండ్‌ను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్నారు.ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందనడంలో అర్థం లేదన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సీమ అభివృద్ధికి అంతో ఇంతో కృషి చేశారంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను వైఎస్‌ఆర్ విస్తరింప చేశారన్నారు. రాయలసీమ విద్యార్థి వేదిక సెంట్రల్ కమిటీ సభ్యుడు ఎం.భాస్కర్ మాట్లాడుతూ మన ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాయలసీమ అభివృద్ధిపై ఓ ప్రణాళిక అంటూ లేదన్నారు

No comments:
Post a Comment