Wednesday, 26 October 2011

తిరుమలకు బాణాసంచా తీసుకురావద్దు

హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటైన దీపావళీని ప్రతి హిందువు ఎంతో సంతోషంగా పిల్లాపాపలతో జరుపుకుంటారు. దీపావళీ అంటేనే బాణాసంచా కాల్చడం అన్నది భారతదేశంలోని ఎవ్వరిని అడిగినా ఇట్టే చెపుతారు. అయితే అలాంటి ముఖ్యమైన దీపావళీ పండుగ రోజు తిరుమలకు బాణాసంచా తీసుకువెళ్లకూడదంటూ టిటిడి అధికారులు హుకుంజారీ చేశారు. ఒక వెళా తీసుకువెళ్లినా పేలుడు బాణాసంచా తిరుమలకు తీసుకురాకూడదంటూ నిబందనలు విదించారు. చిన్నపిల్లలకు కాల్చే బూచక్రాలు, కాకర వత్తులు శబ్ధరహిత బాణాసంచా మాత్రమే తీసుకువెళ్లాలని ఆంక్షలు విదించారు. దీంతో స్దానికులు తీవ్ర ఆవేదనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా వుండగా ఈ వ్యవహారంపై టిటిడి ఎస్‌ఓ ఎంకెసింగ్‌ను విలేకరులు ప్రశ్నించినపుడు దీపావళీ రోజున టపాసులు తీసుకువెళ్లడానికి అనుమతి ఇచ్చామని తెలిపారు. ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చినా అలిపిరి వద్ద వున్న విజిలెన్స్ సిబ్బంది మాత్రం స్దానికులు తిరుమలకు బాణాసంచా తీసుకువెళ్లకుండా నిరోదించడంతో ఈ యేడాది స్దానికులు దీపావళికి దూరం కావలసిన పరిస్దితి ఏర్పడింది. అయితే కొంత మంది సాహాసించి దొంగచాటుగా తిరుమలకు టపాసులు తీసుకువెళ్లారు. దీంతో దొంగచాటుగా తిరుమలకు తరలివెళ్లే నిషేదిత వస్తువులను నియంత్రించడంలో అలిపిరి భద్రతా సిబ్బంది ఎప్పటికీ కొరగారని మరోమారు నిరూపితమైంది. కాగా తిరుమల ఒక హైందవ ధార్మిక సంస్ధ అయినప్పటికి హిందు పండుగలను కూడా జరుపుకోనివ్వకుండా భద్రత పేరుతో టిటిడి అధికారులు నియంత్రణ చేయడం సబబుకాదని స్దానికులు అంటున్నారు

1 comment:

  1. స్తానికుల వేదన సరైనదే కానీ, ఈ రోజులలో వున్న పరిస్తితి దృష్ట్య టీటీడీ తీసుకున్న నిర్ణయం కూడా సరైనదే. ఒకప్పుడు నాగార్జున సాగర్ డాం మరియు పవర్ హౌస్‌ని దగ్గరికి వెళ్ళి చూసాము. ఆరోజున ఎట్టి కాపలా లేదు, ఆపిన వారూ లేరు. కానీ ఈ రోజున వున్న పరిస్తితులు ఎలా వున్నయంటే మన గుడిలొనికి మనం వెళ్ళాలంటే ఒళ్ళంతా తనికీ చేస్తే కానీ వెళ్ళ లేని పరిస్తితి. ఇది కాశీ నుండి తిరుమల వరకూ వున్నదే. దీనికి కారణం మన దేశం టెర్రరిస్టులపై కఠిన వైఖరి ప్రదర్శించకపోవటమే.

    ReplyDelete