Friday, 9 March 2012

కర్నూలు జిల్లా నదీతీరాన కెసిఆర్ విగ్రహం...టీజీ వెంకటేశ్

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ మీద కూల్చివేతకు గురైన మహనీయుల విగ్రహాలను కర్నూలు సమీపంలో తుంగ భద్ర నదీతీరాన ఏర్పాటు చేస్తామని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంక టేశ్ తెలిపారు. వాటికి ఎదురుగా వాటిని చూస్తూ సిగ్గుపడుతున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు విగ్రహాన్ని కూడా పెడతామని ఆయన చెప్పారు. వాటిని కూల్చివేసినందుకు కెసిఆర్ విగ్రహం అలా పెడతామని ఆయన అన్నారు. కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహ ఏర్పాటుకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- తెలంగాణ ఉద్యమం పేరుతో రాజధానిలోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న సాహితీ, సాంస్కృతిక రంగాల మహనీయులు, స్వాతంత్య్రోద్యమ నాయకుల విగ్రహాలను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధ్వంసం చేయడం విచార కరమన్నారు. అందుకే ఆ విగ్రహాలను తుంగభద్ర నదీతీరాన నిర్మించే వరద రక్షణ గోడలపై నెలకొల్పుతున్నట్టు చెప్పారు.

No comments:

Post a Comment