నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రవి చావలి దర్శకత్వంలో ఓ సినిమాకు ప్లాన్
చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు
‘శ్రీమన్నారాయణ’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని
రమేష్ పుప్పాల నిర్మిస్తున్నారు. ఇప్పటికే పార్వతి మెల్టన్, ఇషా చావ్లాలను
మీరోయిన్లుగా ఎంపిక చేశారు. మాస్ మసాలా ఎలిమెంట్స్ తో రూపొందుతున్న
ఈ సినిమాలో బాలయ్య ‘సింహా’ సినిమాలో మాదిరిగా లెక్చరర్ పాత్ర
పోషిస్తున్నారని, అభిమానులు మెచ్చే పూర్తి వినోదాత్మక యాక్షన్ ఎంటర్
టైనర్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు
హీరోయిన్లుతో గ్లామర్ డోస్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందట. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా. ఆయన నన్ను ఓ తండ్రిలా ప్రోత్సహించారు
అంటున్నారు దర్శకులు పరుచూరి మురళి. ఆయన తాజా చిత్రం 'అధినాయకుడు'టైటిల్
ప్రకటన సందర్భంగా ఆయన ఇలా స్పందించారు. అలాగే ..కథ వినగానే బాలకృష్ణ ఈ
సినిమా చేయడానికి ఒకే అన్నారు.ఈ సినిమాలోని మూడు క్యారెక్టర్స్‌ని ఎంతో
కష్టపడి డీల్ చేశాం. బాలయ్య చాలా అద్భుతంగా నటించారు. నిర్మాత ఎక్కడా
కాంప్రమైజ్ కాకుండా సినిమా నిర్మాణానికి సహాయం అందించారు అన్నారు.
బాలకృష్ణ, లక్ష్మీరాయ్ జంటగా శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై
ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న 'అధినాయకుడు' చిత్రం పోస్ట్
ప్రొడక్షన్ వర్క్ శరవేగంతో జరుగుతోంది.

No comments:
Post a Comment