లీగల్ ఓపీనియన్ తీసుకుని అవసరమైతే ఆయా శాఖల మంత్రులను కూడా సీబీఐ
విచారించవచ్చునని మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం
జిల్లా తాడిపత్రిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీబీఐ కేవలం
ఐఏఎస్‌లను టార్గెట్ చేస్తూ విచారణ జరుపుతోందే తప్ప సంబంధిత మంత్రుల గురించి
పట్టించుకోలేదన్న ఆరోపణలపై జేసీ పై విధంగా స్పందించారు.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపైన, కాంగ్రెస్
ప్రభుత్వంపైన మంత్రి డీఎల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు జేసీ
తిరస్కరించారు. తనను అడిగేకంటే ఆయన్నే అడిగితే సరైన సమాధానం వస్తుందని
చతమ్కరించారు. డీఎల్ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు
భగ్గుమన్నాయన్న దానిపై జేసీ స్పందిస్తూ అలాంటిదేమీ ఉండదని కొట్టిపారేశారు.వైఎస్
హయాంలోని భూకేటాయింపులకే పరిమితయ్యేలా సభాసంఘం వేయడంపై జేసీ మాట్లాడుతూ
గతంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్
రాజశేఖర్‌రెడ్డి పలు సభాసంఘాలు వేశారన్నారు. అనేక విచారణలు జరిగాయని
చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణలు, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకునే
సభాసంఘం వేశారన్నారు. అంతమాత్రాన టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కయ్యాయనడంలో
అర్థం లేదన్నారు.
Thursday, 9 February 2012
సీబీఐ అవసరమైతే మంత్రులనూ విచారించవచ్చు...జేసీ దివాకర్‌రెడ్డి

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment