Thursday, 9 February 2012

కాంగ్రెస్‌లో విభేదాలు వాస్తవమే...ఎమ్మెల్యే చిరంజీవి

కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి అన్నారు. తిరుపతి పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి గులాం నబీ ఆజాద్ దృష్టి సారిస్తున్నారని ఆయన అన్నారు. తిరుపతి నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు శాసనసభ్యుడు చిరంజీవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు తిరుపతి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నగర సమగ్రాభివృద్ధికి రూ. 405 కోట్లు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేశారని ఆయన అన్నారు. సీఎంతో బుధవారం జరిగిన సమావేశంలో అభివృద్ధిపైనే చర్చించినట్లు చిరంజీవి పేర్కొన్నారు.కాగా రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ముడుపులు తీసుకున్నారంటూ వస్తున్న ఆరోపణలను చిరంజీవి ఖండించారు. ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేశారు. మంత్రుల మధ్య సమన్వయానికి కృషి చేస్తానని, శాఖల కేటాయింపుల్లో కూడా సమన్వయం చేస్తామని చిరంజీవి పేర్కొన్నారు.

No comments:

Post a Comment