విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాల ఆం దోళనల నేపథ్యంలో.. ఇంటర్ ప్రాక్టికల్
పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు ప్రకటించింది. ఈ శుక్రవారం నుంచి ఈనెల 25వ తేదీ
వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తం గా 6,33,571 మంది
విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరుకానున్నారు. అందులో 4,85, 356 మంది
జనరల్, 1,48,215 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. వివరాలను ఇంటర్ బోర్డు
సెక్రెటరీ ఒక ప్రకటనలో విడుదల చేశా రు. పరీక్షలకు
ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు.
రోల్ నెంబర్లు, బ్యాచ్ లు, టైమ్-టేబుల్ సహా హాల్ టికెట్ల ముద్రణ,
అభ్యర్థులకు పంపిణీ పూర్తయ్యాయి. అభ్యర్థులు తమ బ్యాచ్‌ని మార్చుకునేందుకు
అవకాశం లేదు. జాతీయ క్రీడలకు హాజరయ్యే అభ్యర్థులకు మాత్రం ఇందుకు
మినహాయింపు ఉంటుంది. 'సమ్మక్క-సారల మ్మ' జాతర రూట్లలో ఉన్న కాలేజీల్లో
ప్రాక్టికల్ పరీక్షలను జాతర అనంతరం నిర్వహిస్తారు. సెంటర్ల వద్ద
ర్యాండమ్‌గా వీడియోగ్రఫీ ఏర్పాటు చేస్తారు. జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా..
ఎస్పీ వైస్ ఛైర్మన్‌గా.. ఆర్జేడీ, డీవీఈవో ఎక్స్అఫీషియో మెంబర్లుగా ఒక
సీనియర్ ప్రిన్సిపాల్ మెంబర్‌గా హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు.
మాల్ ప్రాక్టీస్ జరిగిన సెంటర్లలో రీఎగ్జామ్ నిర్వహణకు ఆదేశించే అధికారం ఈ
కమిటీకి ఉంటుంది. పనిచేసే కాలేజీల్లో/అదే యాజమాన్య కాలేజీలో ప్రాక్టికల్
పరీక్షల విధులు నిర్వహించకుండా ఎగ్జామినర్లను జంబ్లింగ్ చేస్తున్నారు.
ప్రతి 20 సెంటర్లకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా
కాలేజీలో 25 శాతం మందికిపైగా విద్యార్థులకు 100శాతం మార్కులు వస్తే.. ఆయా
విద్యార్థుల ఆన్సర్ స్క్రిప్టును రీవెరిఫికేషన్ చేస్తారు. మూల్యాంకనం
అనంతరం 27 నుంచి 30 మార్కుల మధ్య స్కోర్ సాధిస్తే మిగతా వారి ఆన్సర్
స్క్రిప్టులను కూడా రీవెరిఫికేషన్ చేస్తారు.నాలుగు విడతల్లో నిర్వహించనున్న ఈ పరీక్షల కోసం 2,708 సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 11,456 మంది ఎగ్జామినర్లను నియమించారు. మొదటి విడత 3వ తేదీ నుంచి నుంచి 8వరకు, రెండో విడత 9 నుంచి 13 వరకు, మూడో విడత 14 నుంచి 18 వరకు, నాలుగో విడత ప్రాక్టికల్స్ 21 నుంచి 25 వరకు జరుగుతాయి. మిలాద్ నబీ కారణంగా ఈ నెల 5న, వీఆర్వో పరీ క్ష కారణంగా 19న, శివరాత్రి కారణంగా 20న పరీక్ష ఉండదు.
No comments:
Post a Comment