రాయలసీమ జిల్లాలో వణికిస్తున్న చలిపులి

ఎన్నడూ లేనంతగా చలి ప్రజలను గజ గజ వణికిస్తోంది. దీనితో ప్రజలు
విలవిల్లాడుతున్నారు. ఉదయం 7గంటలైనా సూర్యుని కిరణాలు బయటకు పడని పరిస్థితి
ఉంది. ఉదయం పూట మంచు కప్పేసి ఉండడంతో చలితో జనం వణికిపోతున్నారు.
నాలుగురోజుల్లోనే వాతావరణంలో వచ్చిన మార్పులతో చలి పెరిగింది. ఉదయం
ఏడుగంటలైనప్పటికీ ఇళ్లలో నుంచి జనం బయటకురాని పరిస్థితి ఉంది. ఇలాంటి చలిని
గత 60 సంవత్సరాల కాలంలో ఎప్పుడు చూడలేదని ప్రజలు స్పష్టం
చేశారు. సాయంత్రం 5గంటల ప్రాంతంలో చలి పెరిగిపోతోంది. రాత్రి 9గంటల తరువాత
వరకూ లావాదేవీలు సాగించే వాణిజ్య వ్యాపార సంస్థలు 8 గంటలకే మూతపడుతున్నాయి.
వృద్ధులు చలివలన అనారోగ్యం పాలవుతున్నారు. చిన్నపిల్లలు కూడ చలి వలన
ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆస్మాతో బాధపడే ప్రజలు పడుతున్న
అవస్థలు వర్ణనాతీతం. ఉదయం పూట మంచు కురుస్తుండడంతో దైనందిన కార్యక్రమాలు
ఆలస్యంగా మొదలవుతున్నాయి. దుకాణాల వద్ద, రైల్వేస్టేషన్లలో, బస్టాండులలో
నిద్రించే భిక్షగాళ్ల పరిస్థితి దారుణంగా మారిపోయింది. భిక్షగాళ్లు
నిర్మాణంలో ఉన్న భవనాల్లో పడుకొనే పరిస్థితి ఏర్పడింది. చలి దెబ్బకు ఉదయం,
సాయంత్రం కూడా బయట జనం సంచారం తగ్గిపోయింది. ఉదయం, సాయంత్రం వాకింగులు,
జాగింగ్‌లు బందయ్యాయి.
No comments:
Post a Comment