బాడీగార్డ్ రివ్యూ
బాడీగార్డ్.. మళయాళంలో పుట్టి.. తమిళంలో అడుగుపెట్టి..
బాలీవుడ్లో
పెరిగి.. ఇప్పుడు టాలీవుడ్ కి వచ్చింది. ఇంకా కన్నడ, బెంగాళీ బాబుల్నీ
పలకరించనుంది. ఇన్ని భాషల్లోకి వెళ్లేంత విషయం ఏముంది ఇందులో అని చూస్తే..
ప్చ్! నిరాశే! ఒక సాధారణ సినిమా ఇది. మనకి కొత్త కూడా కాదు. క్లైమాక్స్ లో
వచ్చే మలుపును మినహాయిస్తే ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు
తక్కువే.చిన్నతనంలో తన ప్రాణాలు కాపాడిన వరదరాజులు నాయుడు (ప్రకాష్ రాజ్)
అంటే
వెంకటాద్రికి అపారమైన గౌరవం. ఆయన కూతురు కీర్తి (త్రిష)ను ప్రత్యర్థులు
చంపాలని చూస్తుండటంతో.. వెంకటాద్రిని ఆమెకు బాడీగార్డ్ గా పెడతాడు
వరదరాజులు. కీర్తి చదివే కాలేజిలోనే వెంకటాద్రి కూడా అడ్మిషన్ తీసుకుని
ఆమె.. వెంట తిరుగుతుంటాడు. ఐతే వెంకటాద్రి ఎంతసేపూ తన వెంటే తిరగడం
కీర్తికి ఇష్టముండదు. దీంతో అతని దృష్టి మళ్లించేందుకు.. ఫోన్ చేసి వేరే
అమ్మాయిలా మాట్లాడుతూ ఉంటుంది. మొదట పట్టించుకోకపోయినా.. తర్వాత ఆమెనే
ఆరాధిస్తాడు వెంకటాద్రి. కొన్ని సంఘటనల తర్వాత కీర్తి కూడా అతని ప్రేమలో
పడుతుంది. ఐతే కీర్తికి అప్పటికే తన బావతో పెళ్లి కుదిరి ఉంటుంది. ఈ
స్థితిలో తానే ఫోన్లో మాట్లాడే అమ్మాయినని వెంకటాద్రికి చెప్పేయడానికి
సిద్ధమవుతుంది కీర్తి. కానీ ఓ అనూహ్యం సంఘటనతో కథ మలుపు తిరుగుతుంది. ఏంటా
మలుపన్నదే క్లైమాక్స్.వెంకటాద్రి (వెంకటేష్).. తను దేముడులా భావించే
వరదరాజులు నాయుడు
(ప్రకాష్‌రాజ్)కి బాడీగార్డ్ గా పనికి కుదురుతాడు. అతని ధైర్యం, తెగువ
నచ్చిన వరదరాజులు.. తన కూతురు కీర్తి (త్రిష)కి తన శత్రువల వల్ల ప్రమాదం
ఉందని బావించి వెంకటాద్రిని ఆమెకు బాడీగార్డ్‌గా నియమిస్తాడు. అక్కడనుంచి
ఆమెకు తోడుగా కాలేజికి వెళ్తూ తన అతి జాగ్రత్తల వల్ల ఆమెను ఇబ్బందులకి గురి
చేస్తూంటాడు. విసిగిన కీర్తి వెంకటాద్రి మనస్సుని డైవర్ట్ చేసి స్వేచ్చ
పొందాలనుకుని, అతనితో ఫోన్ ప్రేమ డ్రామా మొదలెడుతుంది. ఈ విషయం తెలియని
వెంకటాద్రి.. ఫోన్ లో ఆమెతో ప్రేమలో పీకలోతు మునిగిపోతాడు. అప్పుడు కీర్తి
అతనికి అస్సలు విషయం చెప్పిందా... ఇద్దరూ ఎలా కలిసారు... అన్నది
తెలుసుకోవాల్సింటే తెరపై చూడాల్సిందే.ఈ చిత్రం వెంకటేష్ కు సంతోషం
(నాగార్జున)లాంటి సినిమా అని చెప్పాలి. నిజానికి ఈ కథ తెలుగువారికి
కొత్తేమీ కాదు.. అయితే ఈ కథకు కూర్చిన కథనమే సినిమా చివరి వరకూ ఎక్కడా బోర్
కొట్టకుండా కూర్చోబెట్టగలిగింది. ముఖ్యంగా క్లైమాక్స్... కుచ్ కుచ్ హోతా
హై ని గుర్తు చేస్తుంది. అన్నిటికన్నా ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఈ
చిత్రానికి వెంకటేష్ ని ఎన్నుకోవటం.. మరో హీరో అయితే నప్పడు అనిపించేలా
సినిమాను తను ఒక్కడే అయ్యి లాక్కెళ్లిపోయాడు. సెకండాఫ్ లో కాస్త స్లో
అయ్యినా, త్రిష పై పెట్టిన ఎమోషన్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ ట్విస్టు
సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక డాన్ శీను చిత్రాన్ని కామెడితో ఒప్పించిన
దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రంతో కామిడీ, సెంటిమెంట్ రెండూ కలిపి
మెప్పించగలనని నిరూపించుకున్నాడు. కోన వెంకట్ మాటలు పెద్దగా పేలకున్నా
కథనానికి ఇబ్బంది కలగకుండా నడిచిపోయాయి. టెక్నికల్ గా కెమెరా యావరేజ్ గా
ఉంది. పాటల్లో టైటిల్ సాంగ్ బాగుంది. ఎడిటింగ్, ఆర్.ఆర్ సోసోగా ఉన్నాయి.
మిగిలిన నటీనటుల్లో వేణు మాధవ్, అలీ కథకు పెద్దగా ఉపయోగపడకపోయినా నవ్వులు
పండించటంలో తమ వంతు సాయం చేసారు. ఇక ప్రకాష్ రాజ్, తణికెళ్ల, ధర్మవరపు
ఎప్పటిలాగే చేసేసారు. సెకండాఫ్ లో పాటలు ప్లేస్ మెంట్స్ మారిస్తే
బావుండును అనిపిస్తుంది. అయితే ఇప్పటికే హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని
చాలామంది చూసేయటమే ఈ సినిమాకున్న ఏకైక మైనస్.రజనీకాంత్ హీరోగా వచ్చిన
కథానాయకుడు సినిమా గుర్తుందా? క్లైమాక్సే ఆ
సినిమాకు ప్రధాన ఆకర్షణ. గొప్పగా అనిపించే ఆ ఒక్క సన్నివేశాన్ని నమ్ముకుని
మిగతా కథనాన్నంతా ఒకే రకమైన బోరింగ్ సన్నివేశాలతో నింపేశారు. చివర్లో
సన్నివేశం మనసును హత్తుకున్నా.. అప్పటిదాకా సినిమా బోరింగ్ సాగుతుంది.
అందుకే ఆ సినిమాను ప్రేక్షకులు తిప్పికొట్టారు. ఇప్పుడా కోవలోనే ఇంకో
మళయాళం రీమేక్.. తెలుగు తెరపైకి వచ్చింది. అదే.. బాడీగార్డ్. ఇందులోనూ
క్లైమాక్సే సినిమాకు ఆయువుపట్టు. కానీ అంతకుముందు వరకు ఒకే తరహా విసుగు
తెప్పించే సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. అసలు కథలోనే
చాలా పరిమితులున్నాయి. హీరో దృష్టిని మళ్లించడానికి ఫోన్లో నాటకమాడాలన్న
ఎత్తుగడను హీరోయిన్ ఎంచుకోవడంతో.. సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు బ్రేక్
పడిపోయింది. గజినిలో ఇలాగే హీరో తన ఐడెంటిటీ తెలియకుండా హీరోయిన్ తో
ప్రేమాయణం సాగిస్తాడు. ఐతే అక్కడ వారిద్దరూ కలుస్తారు కాబట్టి.. సరదా
సన్నివేశాలకు అవకాశం కలిగింది. కానీ ఇందులో ఫోన్లో మాట్లాడటమే కాబట్టి
అందుకు అవకాశం లేకపోయింది. ఎంతసేపూ తెరపై ఫోన్ లో మాట్లాడే సన్నివేశాలే
దర్శనమిస్తుండటం ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తుంది. ద్వితీయార్ధంలో చివరి
అరగంట ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఐతే అంతకుముందు వరుసగా వచ్చే పాటలు
ఇబ్బందిపెడతాయి.
No comments:
Post a Comment