సత్యసాయి సూపర్ స్పె షాలిటీ హాస్పిటల్‌కు విద్యుత్ సబ్సిడీ రద్దు
లక్షలాది మంది రోగులకు ఉచిత వైద్య సేవలందించే సత్యసాయి సూపర్ స్పె షాలిటీ
హాస్పిటల్‌కు ప్రభుత్వం భరించే విద్యుత్ సబ్సిడీని రద్దు చేస్తూ ప్రభుత్వం
శనివారం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది. జిఓఆర్‌సి నెం.9 మేరకు
ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ
హాస్పిటల్‌ను 1992లో ప్రారంభించారు. రోగుల నుండి ఒక నయాపైసా వసూలు చేయకుండా
సేవలందిస్తున్న దృష్ట్యా విద్యు త్ సబ్సిడీని ప్రభుత్వం జీఓ ఎంఎస్ నెం 98
1993 ఏప్రిల్ 26 నుంచి ప్రభుత్వమే చెల్లించేది. ఇది సుమా రు రెండు
దశాబ్దాలుగా ఈ ప్రక్రియ అమలవుతోం ది. ఇప్పటి దాకా సత్యసాయి సూపర్
స్పెషాలిటీ విద్యు త్ వినియోగానికి అనుగుణంగా ట్రాన్స్‌కోకు రూ. 4.2 కోట్లు
ప్రభుత్వపరంగా సబ్సిడీ మొత్తం చెల్లించాల్సి వుంది. గత కొంతకాలంగా ఈ
వ్యవహారంపై ట్రాన్స్‌కో సబ్సిడీ మొత్తాన్ని చెల్లించాలని సత్యసాయి సెంట్రల్
ట్రస్టుపై వత్తిడి తెస్తూ నోటీసులు సె తం జారీ చేసిన విషయం విదితమే. ఈ
నేపథ్యంలో ట్రస్టు కూడా ప్రభుత్వపరంగా విద్యుత్ సబ్సిడీ మొత్తాన్ని విడుదల
చేయాలని కూడా తమ లేఖలో పలుమార్లు కోరింది. అయితే అనూహ్యంగా ప్రభు త్వం
విద్యుత్ సబ్సిడీని రద్దు చేస్తూ శనివారం అధికారికంగా విడుదల చేసిన
ఉత్తర్వుల్లో విద్యుత్‌ను వివిధ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్న దృష్ట్యా
కొనుగోలు వ్యయం 86% చేరిందని, ఈ క్రమంలో సబ్సిడీని వినియోగదారుడే భరించాలి
తప్పా ట్రాన్స్ కో భరించే స్థితిలో లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రభుత్వం ఈ అంశంపై ఎంతో కూలంకషంగా పరిశీలించిన పిమ్మట, ట్రాన్స్‌కో పంపిన
ప్రతిపాదన మేరకు శ్రీ సత్యసాయి వైద్య విజ్ఞాన సంస్థకు భరించే విద్యుత్
సబ్సిడీని 2009 సంవత్సరం నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ట్రాన్స్‌కో ఎండి తన
ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. జిఓ ఆర్‌సి నెం 9 మేరకు ఈ విద్యు త్ సబ్సిడీ
రద్దు ప్రక్రియ అమలులోకి వస్తుందని వెలువరించిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ
నేపథ్యంలో ప్రభుత్వపరంగా సబ్సిడీ రద్దయితే ప్రతి నెల సూపర్‌స్పెషాలిటి
హాస్పిటల్ వర్గాలు రూ. 16 లక్షల వంతు న విద్యుత్ చార్జీలు చెల్లించాల్సి
వుంటుంది. హాస్పిటల్‌లో వినియోగించే విద్యుత్‌లో యూనిట్‌కు రూ.4 వంతున
వసూలు చేసే మొత్తంలో రూ.3.70 పైసల వంతున ప్రభుత్వం సబ్సిడీని భరిస్తుండగా
30పైసల వంతున హాస్పిటల్ వర్గాలు విద్యుత్ బిల్లులు చెల్లించే ప్రక్రియ నేటి
దాకా కొనసాగుతోంది. ప్రతి నెల సుమారు రూ. 16 లక్షల మేర బిల్లులు రానుండగా
ఇందులో రూ. 3 లక్షల వంతున సత్యసాయి సూపర్ స్పెషాలిటీ వర్గాలు క్రమం
తప్పకుండా చెల్లిస్తున్నాయి. అయితే ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం
విద్యుత్ బిల్లుల మొత్తాన్ని హాస్పిటల్ వర్గాలే భరించాల్సి వుంటుంది.
సత్యసాయి శివైక్యం పొందిన తదుపరి ఈ పరిణామం చోటుచేసుకోవ డం పుట్టపర్తి
ప్రజలను ద్రిగ్భాంతికి గురిచేసింది. లక్షలాది మంది నిరుపేదలకు ఉచితంగా
వైద్య సేవలందిస్తున్న హాస్పిటల్‌కు విద్యుత్ సబ్సిడీని రద్దు చేస్తూ
ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించడం అన్యాయమంటూ స్థానికులు ఆక్రోశిస్తున్నారు
No comments:
Post a Comment