రాయలసీమ జిల్లాల్లో ఫ్యాక్షనిజం నివురుగప్పిన నిప్పులా దాగి ఉంటుందని
రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ఆయా జిల్లాల
ఎస్పీలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించినట్లు ఆమె తెలి పారు. రాయలసీమ
జిల్లాల్లో శాంతిభద్రతలు, నేరాలపై ఆయా జిల్లాల ఎస్పీలతో ఆమె
తిరుపతిలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె
మాట్లాడారు. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో ఫ్యాక్షన్ సమస్యలున్న మాట
వాస్తవమేనని, అందుకే ఫ్యాక్షనిజం తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలని
ఎస్పీలను కోరినట్లు తెలిపారు. ఈ కేసు వెనుక ఎంతటి పెద్దలున్నా శిక్షకు
గురికాక తప్పదని, చట్టం ఎవరికీ చుట్టం కాదని వ్యాఖ్యానించారు. పరిశోధనపై
ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కనుకే కేసును సీఐడీకి అప్పగించామని, భాను
తప్పించుకోలేడని చెప్పారు. ఈ కేసు విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు
చేస్తున్న విమర్శలపై ఆమె స్పందిస్తూ, తొమ్మిదేళ్లు సీఎంగా వ్యవహరించిన
బాబుకు తెలియదా? పోలీసు పరిశోధనల గురించి, భాను గురించి ఆయన వద్ద ఏమైనా
సమాచారం ఉంటే పోలీసులకు అందజేసి సహకరించవచ్చు కదా? అని అన్నారు.ఫ్యాక్షనిజంతో సంబంధం ఉన్న నేతలకు
కౌన్సెలింగ్ ఇవ్వడం, దుస్సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అది
అదుపులో ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా సమస్య
ఉన్నందున పోలీసులు, అటవీ శాఖతో కలిసి పనిచేసి మంచి ఫలితాలు సాధించారని
అభినందించారు. రెండు శాఖల సమన్వయంతో సుమారు రూ.27 కోట్ల విలువైన ఎర్రచందనం
దుంగలను స్వాధీనం చేసుకోగలిగారన్నారు. దాడులకు పాల్పడుతున్న స్మగ్లర్లను
ఎదిరించేందుకు అటవీశాఖకు ఆయుధాలు ఇవ్వచ్చుకదా అని మీడియా ప్రశ్నించగా,
అందరికీ ఆయుధాలు ఇస్తూపోతే పోలీసులు ఎందుకు ?, వారికి ఇచ్చేది లేదని
స్పష్టం చేశారు. మద్దెలచెరువు సూరి హత్య కేసును ఛేదించడంలో, ప్రధాన
నిందితుడైన భానుకిరణ్ అరెస్టు, కేసు పురోగతిపై కొందరు చేస్తున్న విమర్శలను
ఆమె తీవ్రంగా ఖండించారు

No comments:
Post a Comment