ప్రపంచ వికలాంగుల దినోత్సవ సమావేశానికి హాజరు కావాల్సిన కలెక్టర్ సాల్మన్
ఆరోగ్యరాజ్ ఉన్నతాధికారుల వైఖరితో గేటు వరకూ వచ్చి అలిగి వెళ్లిపోయారు.
వివరాలిలా ఉన్నాయి.
సరిగ్గా ఉదయం 9.55 నిమిషాలకు కలెక్టర్ వాహనం వేలూరు రోడ్డు మీదుగా వస్తూ జిల్లా పరిషత్ మీటింగ్ హాలుకు రావడానికి టర్న్ అయ్యింది. ఇదే సమయంలో విద్యార్థులు ర్యాలీగా వస్తున్నారు. సరిగ్గా జడ్పీ మీటింగ్ హాలు వద్దకు కలెక్టర్ వాహనం వస్తుండగా విద్యార్థులు ఆయనకు అడ్డుగా ఉన్న డివైడర్‌ను దాటుతూ వచ్చారు. ఇంతలో ఓ విద్యార్థి ఆటో కింద పడడం కలెక్టర్ కంటపడింది. ఈ దృశ్యాలను చూసిన కలెక్టర్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.వికలాంగుల దినోత్సవం రోజున విద్యార్థులతో ఎలాంటి ర్యాలీలు నిర్వహించవద్దన్నప్పటికీ ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. అదీగాక ర్యాలీగా వస్తున్న పిల్లలతో ఏ ఒక్క ఉపాధ్యాయుడూ లేకపోవడం, వాహనాల మధ్య పిల్లలు చిక్కుకోవడం.. ఏమైనా ప్రమాదం జరిగి ఉంటే ఎవరు బాధ్యులు అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేసి సమావేశానికి హాజరుకాకుండానే గేటు నుంచి అటే అలిగి వెళ్లిపోయారు. ఈ సంఘటనతో నివ్వెరపోయిన ఉన్నతాధికారులందరూ కలెక్టర్ మళ్లీ వస్తారేమోనని అరగంటసేపు వేచి ఉన్నారు. చివరకు కలెక్టర్ ఇక రారని తెలుసుకుని సమావేశాన్ని పూర్తిచేశారు.

No comments:
Post a Comment