Sunday, 25 December 2011

బ్రహ్మణికి అనుమతులు రద్దయ్యే అవకాశం?

ఫ్యాక్షన్ గడ్డపై పారిశ్రామికాభివృద్ధి పేరుతో అడుగుపెట్టిన బ్రహ్మణి ఉక్కు పరిశ్రమకు అనుమతులు ఒక్కో క్కటిగా రద్దు చేసే యోచనలో ప్రభు త్వం వుంది. ప్రభుత్వం చూపు మరోవైపు వుండడం, బ్రహ్మణి అధినేత గాలి జైళ్లో వుండడం, యాజమాన్యం పనులు నిలిపివేత వెరసి బ్రహ్మణి పరిస్థితి కనుమరుగయ్యే దుస్థితికి చేరకుంది.ఫ్యాక్షన్ ప్రాంతంగా పేరుపడ్డ జమ్మలమడుగు ప్రాంతంలో పారిశ్రామిక ప్రగతి పేరుతో బ్రహ్మణి అధినేత గాలిజనార్ధన్ రెడ్డి బ్రహ్మణి స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. సుమారు రూ.20వేల కోట్లతో 10మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జిల్లాలో ఉపాధి, ఉద్యోగ అవసరాల దృష్ట్యా కంపెనీకి సుమారు 14వేల ఎకరాల భూమి, 68 హెక్టార్ల గనులు, 2టియంసిల గండికోట ప్రాజెక్టు నీరు మైలవరం జలాశయం నుండి తీసుకొనేలా వెసులుబాటు వంటి సౌకర్యాలు కల్పించారు. దీంతో నీటి సౌకర్యం కోసం ఇచ్చిన 84జివోలోని అస్పష్టతను అలుసుగా తీసుకొని ఏకంగా మైలవరం జలాశయం డెడ్ స్టోరేజి వాటర్‌ను తీసుకెళ్లే లక్ష్యంగా పనులు చేపట్టింది. పనులు కాస్తా వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం సీరియస్‌తో పనుల ను విరమించుకుంది. తరువాత ఇచ్చిన జివోను సవరించి ప్రభుత్వం 15 అక్టోబర్ 2009లో తాజాగా నీటి కేటాయింపుల ఆదేశాలను ఇచ్చింది. ఇంతవరకు బాగానే వున్నా వైయస్‌ఆర్ అకాలమర ణం తరువాత మైనింగ్ అక్రమాలపై చోటుచేసుకున్న పరిణామాలతో బ్రహ్మణీలో ఏకంగా గత ఏడాది నుండే పను లు పూర్తిగా నిలిపివేసింది. దీంతో బ్రహ్మణి స్థానంలో ఇతరులు ఫ్యాక్టరీకి ప్రభుత్వంతో సంప్రదింపులకు రావడంతో బ్రహ్మణి పరిస్థితిపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనికి తోడు బ్రహ్మణి ఎండి గాలిజనార్ధన్‌రెడ్డి జైలులో వుం డడం, మైనింగ్ లీజులపై సిబిఐ దర్యా ప్తు, కంపెనీలో పనులు పూర్తిగా నిలిపివేయడం వంటి కారణాలతో ప్రభు త్వం బ్రహ్మణీపై ఆరా తీసింది. గత కొంతకాలంగా అనుమతుల రద్దు విషయంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే ఒప్పందం ప్రకారం పనులు చేయనందున పరిశ్రమల శాఖ బ్రహ్మణీకి ఇచ్చిన వెసలుబాటులు, ఒప్పందాలు రద్దుకు ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కేటాయించిన నీటి పనులకు సంబంధించి, బ్రహ్మణీలో పనుల పరిస్థితులపై పది రోజుల కిందట కలెక్టర్ ద్వా రా నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గండికోట నుండి కేటాయించిన 2 టియంసిల నీటి కేటాయింపులు కూడా రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా బ్రహ్మణి అక్కడే ఆగిపోవడంతో మొత్తంగా ప్రభుత్వం కల్పించిన అన్ని అనుమతుల రద్దుకు ముఖ్యమంత్రికి ఆయాశాఖల నుండి సిఫారసులు వెళ్లినట్లు తెలుస్తోంది. బ్రహ్మణి అనుమతుల రద్దుకు ముఖ్యమంత్రి నిర్ణయమే తరువాయిగా తెలుస్తోంది. ఫ్యాక్షన్ గడ్డలో పారిశ్రామిక వెలుగులను నిలపాల్సిన బ్రహ్మణినే కనుమరుగయ్యే పరిస్థితికి రావడం దారుణం.

No comments:

Post a Comment