Thursday, 10 November 2011

అనంతపురంలో ఉద్యోగాలు

అనంతపురం: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని కలెక్టర్ వి.దుర్గాదాస్ చెప్పారు. 2016లో దోహాలో జరిగే ఒలింపిక్స్‌కు అవసరమైన భవనాలు, స్టేడియాల నిర్మాణం కోసం 25 వేల మంది కార్మికుల అవసరం ఉందని, జిల్లా నుంచి అత్యధిక శాతం మందిని పంపించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.


రాయదుర్గం, హిందూపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న గార్మెంట్స్ పరిశ్రమల్లో పనిచేయడానికి నైపుణ్యం కలిగిన టైలర్లు అవసరమన్నారు. పారిశ్రామిక శిక్షణ సంస్థలతో పాటు పాలిటెక్నిక్, ఒకేషనల్ కాలేజీల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉండే కోర్సులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. 

1 comment:

  1. ఉద్యోగ అవకాశాలంటే ఎమో అనుకున్నా..., కూలిపనులా. రాయల సీమలోకల్లా వెనుక బడిన జిల్లా అనంతపురమే. ఇక్కడ చక్కటి వ్యవసాయ భూములున్నప్పటికీ సరైన నీటిపారుదల సౌకర్యం లేక పోవడం వలన అనేక మంది నిరుద్యోగులుగా తయరైనారు.

    అనేక కాలువలు, ఏరులు, నదీ అన్నీ కూడా పక్కనున్న కర్నాటక రాష్ట్రం నుండీ రావలిసినదే... కానీ అక్కడ బరాజులు, అనేక చిన్న తరహా నీటి ప్రజెక్టులు నిర్మించటం వలన మనకు అక్కడి నుండి నీటి సరఫరా సరైన పద్ధతిలో జరగటం లేదు. మన ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటం వలన అనంతపురానికి వచ్చే అనేక నీటి వనరులు కర్నాటక పరమైనాయి మరియు, అనేక చెరువులు ఉన్నప్పటికీ నీటి నిల్వలమీద సరైన శ్రద్ధ లేకపోవటం జరిగింది.

    కర్నాటక అంటే వేరే దేశం కాదు. నీటి ఒప్పందాలు ప్రక్కనున్న పాకిస్తాన్‌తో కూడా మన దేశం చేసుకుంటునప్పుడు, మనం ప్రక్క రాష్ట్రంతో చేసుకొవటం పెద్ద విషయమేం కాదు. ఇదేకాక, ఇక్కడ ఖనిజ నిక్షేపాలకు సంభంధించి ఆఫీసులు కూడా హైదరాబాదులో వున్నయి. అవన్నీ జిల్లాలోనే వుంటే, వాటిలోని వుద్యొగాలు జిల్లా ప్రజలకే చెందుతాయి. కావల్సిందల్లా మన ప్రజా ప్రతినిధులు హైదరాబాదు మీద చూపించే ప్రేమలో కొంత జిల్లా మీద చూపితే చాలు. జిల్ల ప్రజలు కూలీలుగా వెళ్ళవలసిన ఖర్మ ఎప్పటికీ వుండదు.

    ReplyDelete