పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించేందుకు వస్తున్న తెలంగాణ విద్యార్థి జెఎసిని స్వాగతిస్తున్నామని సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి కన్వీనర్ ఆడారి కిషోర్ కుమార్ తెలియచేశారు. శనివారం ఎయు లా కాలేజీలో సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి జెఎసి సభ్యులు వస్తున్న బస్సును పోలీసులు అడ్డుకోనవసరం లేదని అన్నారు. తెలంగాణ విద్యార్థులు పోలవరంతోపాటు శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఇచ్చిన విధంగా వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, పల్నాడు, ఉత్తరాంధ్రల్లో కూడా పర్యటించాలని కిషోర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాంత వెనుకబాటుతనంపై కూడా సమైక్యాంధ్ర జెఎసి యాత్రను చేపడుతుందని ఆయన అన్నారు. దీనివలన ఇరు ప్రాంతాల వారికి ఉన్న అపోహలు తొలగిపోతాయని కిషోర్ అన్నారు. రాజకీయ నాయకుల ఉచ్చులో విద్యార్థులు పడకుండా వచ్చే నెలలో విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఒక వేదికను ఏర్పాటు చేసుకుని పరస్పరం చర్చించుకుని, వెనుకబాటుతనాన్ని పారదోలేందుకు ప్రభుత్వాలపై వత్తిడి తెద్దామని హితవు పలికారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ హైదరాబాద్‌తో పాటు విశాఖ, విజయవాడల్లో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్‌పై వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణ జరపాలని కిషోర్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా జాబ్ మేళాకు హాజరైన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజుకు సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి వినతి పత్రం ఇచ్చింది
No comments:
Post a Comment