ఖరీఫ్ సీజన్‌లో తగినంత వర్షాలు లేక జిల్లాలో అత్యధిక మండలాలు కరవు కోరల్లో చిక్కుకుని సతమతమవుతుండగా, ప్రభుత్వం మాత్రం 13 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించింది. ఖరీఫ్ సీజన్‌లో మైనస్ 17 శాతం నుంచి- మైనస్ 43 శాతం తక్కువ వర్షపాతం నమోదైన మండలాలను మాత్రమే ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా గుర్తించింది. జిల్లా యంత్రాంగం 14 మండలాలలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వాని కి నివేదిక పంపించింది.
చౌడేపల్లె, వాల్మీకిపురం, కేవీపల్లె, గుడుపల్లె, పుంగనూరు, శాంతిపురం, బైరెడ్డిపల్లె, గుర్రంకొండ, సోమల, కలకడ, కురబలకోట, తిరుపతి రూరల్, ఎర్రావారి పాళెం, రామసముద్రం మండలాలను అధికారులు ప్రతిపాదించగా, శనివారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ప్రభుత్వం రామసముద్రం మండలాన్ని మాత్రం మినహాయించి మిగిలిన 13 మండలా లను కరువు ప్రాంతంగా ప్రకటించింది.
వాస్తవానికి వర్షపాతం, పంటల విస్తీర్ణం, తెగుళ్ళు, పంటల దిగుబడి తదితర అంశాల ప్రాతిపదికన చూస్తే జిల్లాలో 49 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమాచారాన్ని కూడా జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. పొరుగునే వున్న అనంతపురం జిల్లాలో అన్ని మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటించగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఇంచుమించు 50 మండలాల్లో కరువు పరిస్థితులు తలెత్తినప్పటికీ కేవలం వర్షాభావాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని 13 మండలాలకే ప్రకటనను పరిమితం చేశారు

No comments:
Post a Comment