చంద్రబాబు నన్ను సన్యాసిగా మార్చాడు ....మాజీ మేయర్
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును నమ్మి తాను మోసపోయానంటూ
కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య మరోసారి వినూత్న నిరసన తెలిపారు. ఆదివారం
బంగి అనంతయ్య సన్యాసి వేషంతో అడుక్కుంటూ తన నిరసన తెలిపారు. చంద్రబాబును
నమ్మి తాను మోసపోయానని అన్నారు. ఆయనను నేను పూర్తిగా నమ్మానని, ఆయన మాటలు
నమ్మి ఇళ్లు, ప్లాటు అన్ని అమ్ముకున్నానని, అయితే ఆయన మాత్రం నన్ను
సన్యాసిగా మార్చారని ఆరోపించారు. ఆయన ఉబ్బిచ్చి ఉబ్బిచ్చి తర్వాత మోసం
చేస్తాడని ఆరోపించారు. ఉన్నదంతా అమ్ముకొని సన్యాసిని అయ్యానన్నారు. బాబు
వల్లే తాను దివాళా తీశానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన చేతిలో డబ్బులు పోయెనే
జేబులు ఖాళీ ఆయెనే అంటూ పాట పాడుతూ రోడ్డెక్కారు. కాగా గతంలో కూడా
ఆయన పలుమార్లు బాబు తీరుపై వినూత్నంగా నిరసన తెలిపారు. కొద్ది రోజుల క్రితం
బిక్షమెత్తుతూ బాబు వైఖరిని తూర్పార బట్టారు. చంద్రబాబును నమ్ముకుంటే
తెలుగు తమ్ముళ్లకు చిప్పే గతి అని ఆయన అన్నారు. ఎన్నో ఏళ్ల నుండి తాను
తెలుగుదేశం పార్టీని నమ్ముకొని పని చేస్తున్నానని కానీ తనకు చిప్ప తప్ప ఏమీ
మిగలలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం
సాక్షిగా బంగి అనంతయ్య భిక్షాటన చేశారు. తనకు కలిసిన తెలుగుదేశం పార్టీ
కార్యకర్తలతో జాగ్రత్త బ్రదర్ అంటూ హెచ్చరించారు.
No comments:
Post a Comment