Sunday, 4 March 2012

జగన్‌ అరెస్ట్ పై పుకార్లు

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆయనను అరెస్ట్ చేయడానికి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. వారికేమీ లభ్యం కాలేదు. ఎందుకంటే, దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జగన్ ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. అందుకే వారు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇంకా అలాంటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అయినా కాంగ్రెస్, టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు ‘ఆధారాలు లేకపోయినా జగన్‌మోహన్ రెడ్డిని సీబీఐ తాకితే... ఆయనపై ఒక్క చేయి పడినా రాష్ట్రంలోని లక్షల, కోట్ల చేతులు సమాధానం చెబుతాయి...’ అని గట్టిగా హెచ్చరించారు. జగన్‌ను అరెస్టు చేస్తారంటూ శనివారం అర్థరాత్రి నుంచీ ఓ వర్గం మీడియా, టీడీపీ, కాంగ్రెస్ వర్గాలు చేసిన దుష్ర్పచారంపై రాంబాబు తీవ్రంగా స్పందించారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ కోవూరు ఎన్నికల ప్రచారం ఒక రోజు మాత్రమే కుటుంబ కారణాల వల్ల వాయిదా పడిందనీ సోమవారం నుంచి మూడు రోజుల పాటు యథావిధిగా ఆయన నెల్లూరు జిల్లాకు వెళ్లి ప్రచార సభల్లో పాల్గొంటారనీ స్పష్టం చేశారు. ‘జగన్ దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వై.ఎస్.విజయమ్మల ఏకైక పుత్రుడే కాదు...ఈ రాష్ట్రంలోని ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఆయనను తమ కుమారుడుగా భావిస్తున్నారు...ప్రతి చెల్లి, ప్రతి అక్క జగన్‌ను ఒక సోదరుడుగా భావిస్తోంది...ప్రతి అవ్వ, ప్రతి తాత జగన్‌ను తమ మనవడిగా చూసుకుంటున్నారు...సీబీఐకి ఇదే హెచ్చరిక చేస్తున్నాను....సీబీఐ...! జగన్‌పై ఒక్క చెయ్యి వేస్తే కోట్లాది చేతులు లేస్తాయి...’ అని ఆయన తీవ్ర స్వరంతో అన్నారు. ఏ ఆధారాలు లేక పోయినా కాంగ్రెస్, టీడీపీ నాయకులు చెబుతున్నట్లుగా ఆయనను అరెస్టు చేస్తే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో...చూస్తారు’ అని అంబటి అల్టిమేటమ్ జారీ చేశారు. జగన్‌నూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బహిరంగంగా ఎదుర్కోలేక అరెస్టు చేస్తారనే ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్‌పై చేయి పడితే అది ఆయనపై కాదు, తెలుగు గడ్డపై పడిన చేయిగా ప్రజలు భావిస్తారని ఆయన అన్నారు. 

  

No comments:

Post a Comment