Wednesday, 7 March 2012

చిరు రాజ్యసభకు వెళ్తే తిరుపతి నుంచి పోటీ....మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్

మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు వెళ్తే తాను తిరుపతి నుంచి శానససభకు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ చెప్పారు. తిరుపతి శాసనసభా సీటుకు చిరంజీవి రాజీనామా చేసి రాజ్యసభకు నామినేట్ అయితే, జరిగే ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఆయన చెప్పారు. ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను ఇప్పటి వరకు వ్యాపారవేత్తగా ఉన్నానని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే విషయంపై కాంగ్రెసు పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెబుతూనే తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు జయదేవ్ తెలిపారు. చిరంజీవి రాజ్యసభకు వెళ్లకుండా తిరుపతి నుంచి శాసనసభ్యుడిగా కొనసాగితే తాను 2014లో శాసనసభకు పోటీ చేస్తానని ఆయన చెప్పారు. తన తనయుడు గల్లా జయదేవ్ రాజకీయ రంగ ప్రవేశాన్ని మంత్రి గల్లా అరుణ కుమారి ఇది వరకే ధ్రువీకరించారు.

No comments:

Post a Comment