Wednesday, 7 March 2012

రేపు నెట్ సేవలు బంద్

ఇంటర్నెట్‌ ప్రియులకు బ్యాడ్ న్యూస్. రేపు నెట్ సేవలు బంద్. నెట్‌వర్క్ కంప్యూటర్లకు వైరస్‌ ముప్పు తలెత్తుతుండడంతో దీన్ని అధిగమించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను 24 గంటలపాటు నిలిపేస్తున్నారు. 2007 నుంచి డొమైన్ నేమ్ సిస్టమ్ (డిఎన్ఎస్) చేంజర్ పేరుతో వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇంటర్నెట్‌లోకి క్రిమినల్స్ అప్‌లోడ్ చేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా వైరస్ సమస్యలు తలెత్తుతున్నాయని సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. 2007 నుంచి ఎస్తోనియాకు చెందిన క్రిమినల్స్ ఈ వైరస్‌ను విస్తరించే పనిలో ఉన్నారని యుఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 2011 నవంబర్‌లో గుర్తించిందని క్విక్ హీల్ టెక్నాలజీస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సంజయ్ కట్కర్ చెప్పారు. ఈ వైరస్‌ను నియంత్రించే ఉద్దేశంతో క్విక్ హీల్ ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పేజీని ఏర్పాటు చేసింది. కంప్యూటర్లు వైరస్ బారినపడితే సలహాలు, సహాయం కోసం http://www.quickheal.com/chkdnsను సందర్శించవచ్చని సూచించింది.

No comments:

Post a Comment