Monday, 27 February 2012

రాయలసీమ నదీ జలాల సమష్టి కృషి....వివేకానందరెడ్డి

రాయలసీమ నదీ జలాల సమగ్ర అభివృద్ధికి పార్టీలకు అతీతంగా సమష్టి కృషి చేస్తామని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. స్థానిక ఒక ప్రయివేట్ స్కూల్‌లో ఆదివారం రాయలసీమ జలాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చా వేదిక నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ వెనుకబాటుతనానికి శాశ్వత పరిష్కారం కనుగొనాలంటే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌ల ద్వారా కృష్ణా నది జలాలను తరలించడం ఒక్కటే మార్గమన్నారు. దీనికి ఈ ప్రాంత నాయకుల సమన్వయంతో సాధ్యమవుతుందన్నారు. కర్ణాటక రాష్ట్రం అల్మట్టి డ్యాం ఎత్తు పెంచడాన్ని ట్రిబ్యునల్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సవాల్ చేస్తూ పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పై రాష్ట్రాల వాటా పెరిగి తీవ్ర నష్టం సంభవిస్తోందని, దీంతో మిగులు జలాలను ప్రస్తుతం వినియోగించుకొనే స్వేచ్చను కోల్పోతున్నామన్నారు.

No comments:

Post a Comment