Monday, 27 February 2012

కెసిఆర్ తాడిపత్రి వస్తే స్వాగతం...జెసి దివాకర్ రెడ్డి

అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సోమవారం జోస్యం చెప్పారు. దీనిపై జెసి స్పందించారు. టిఆర్ఎస్ పోటీ పెట్టదని చెప్పారు. ఒకవేళ అభ్యర్థిని పెట్టినా తాము స్వాగతిస్తామని చెప్పారు. అసెంబ్లీ తీరు చూస్తుంటే సమావేశాలకు వెళ్లాలని అనిపించడం లేదని అన్నారు. కెసిఆర్ సీమాంధ్రలో ఎక్కడైనా పర్యటించవచ్చునని ఆయన అన్నారు. స్వతంత్ర భారతావనిలో ఎవరు ఎక్కడైనా తిరగవచ్చునని చెప్పారు. కెసిఆర్ సీమాంధ్రలో సభ పెట్టి మాట్లాడినా తమకు అభ్యంతరం లేదన్నారు. తాడిపత్రిలో సభ పెడతానంటే తాను అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. మైకు, స్టేజ్ అన్ని అరెంజ్ చేస్తానన్నారు. కెసిఆర్‌ను అక్కడకు ఆహ్వానిస్తానని చెప్పారు.
 

No comments:

Post a Comment