
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) విడుదల చేసిన తాజా టెస్ట్ ర్యాంకింగ్‌లలో బ్యాటింగ్ జాబితాలో సచిన్ టెండూల్కర్ తొమ్మిదవ స్థానంలో కొనసాగుతుండగా బౌల ర్లలో జహీర్ ఖాన్ ఒక స్థానం పతనమై తొమ్మిదవ స్థానంలో నిలి చాడు. బ్యాటింగ్, బౌలింగ్ జాబితాలలో టాప్ టెస్‌లో ఉన్న భారతీయులు వారిద్దరే. నంబర్ వన్ ఇంగ్లండ్‌పై మొదటి టెస్ట్ లో పాకిస్తాన్‌కు పది వికెట్లతో విజయాన్ని దక్కించిన తరు వాత ఆఫ్ స్పిన్నర్ సరుూద్ అజ్మల్ ప్రపంచంలో అత్యున్నత ర్యాంకులో ఉన్న స్పిన్నర్ అయ్యాడు. ఈ టెస్ట్ దుబాయిలో మూడు రోజులలో ముగిసింది. 34 ఏళ్ల ఫైసలాబాద్ వాసి అజ్మల్ 55 పరుగులకు 7 వికెట్లు, 42 పరుగులకు 3 వికెట్ల తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకోవడమే కాకుం డా నంబర్ 3 ర్యాంకును కూడా సాధించాడు. పాకిస్తాన్ తరఫున తన 18వ టెస్ట్‌లో రెండవ సారి పది వికెట్లు తీసుకు న్న సరుూద్ అజ్మల్ ఏకంగా తొమ్మిది స్థానాలు పురోగమించా డని, అతను ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్‌ను మూడు నుంచి నాలుగవ స్థానానికి నెట్టాడని ఐసిసి ఒక ప్రకటనలో తెలియజేసింది. దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టీన్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్స న్ రెండవ స్థానంలో ఉన్నాడు. దుబాయిలో ఇంగ్లండ్‌తో మొదటి టెస్ట్‌లో 89 పరుగులకు నాలుగు వికెట్లు తీసుకున్న మరొక పాక్ స్పిన్నర్ అబ్దుర్ రెహ్మాన్ ఐదు స్థానాలు పురోగ మించి 14వ స్థానంలో నిలిచాడు. టెస్ట్ బ్యాట్స్‌మన్‌ల ర్యాం కింగ్‌లలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌లకు శుభవార్త ఏమీ లేదు. ఇంతకు ముందు వరుసగా 3,4 స్థానాలలో ఉన్న అలస్టెయిర్ కుక్, ఇయాన్ బెల్ వరుసగా రెండు, మూడు స్థానాలు పతన మయ్యారు. కెవిన్ పీటర్సన్ టాప్ 10లో స్థానం కోల్పోయాడు. అతను ఆరు స్థానాలు పతనమై 16వ స్థానంలో నిలిచాడు. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ కూడా ఆరు స్థానాలు పతనమై 34వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌లలో వికెట్‌కీపర్ మాట్ ప్రయర్, స్వాన్ మాత్రమే పురోగమించారు. ప్రయర్ ఒక స్థానం ముందుకు జరిగి 18వ స్థానంలోను, స్వాన్ 11 స్థానాలు పురోగమించి 64వ స్థానంలోను నిలిచారు. పాక్ బ్యాట్స్‌మ న్‌లలో యూనిస్ ఖాన్ నాలుగవ స్థానానికి, కెప్టెన్ మిస్బా ఉల్ హక్ 14వ స్థానానికి, మహమ్మద్ హఫీజ 30వ స్థానానికి పురోగ మించారు. బ్యాట్స్‌మన్‌ల జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కార మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన జాక్విస్ కలిస్ రెండవ స్థానంలోను, ఎబి డివిలీర్స్ మూడవ స్థానంలోను ఉన్నారు.

No comments:
Post a Comment