బిజినెస్ మ్యాన్ సినిమా రివ్యూ
మహేష్ తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రికార్డు
స్థాయిలో రెండువేల థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ చిత్రం ఇనీషియల్ గా అందిన
టాక్ ప్రకారం...హిట్ అని తెలుస్తోంది. అయితే దూకుడు రేంజా,పోకిరీ రేంజా
అనేది తేలాలి అంటున్నారు. పస్టాఫ్ ఫన్ తో గడిచిపోయినా,సెకండాఫ్ మొత్తం
గన్స్ ,పోలీసులు,ప్రేమతో నడుస్తుంది. దాంతో కొద్దిగా స్లో అయ్యినా
క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకు హైలెట్ అని చెప్తున్నారు.సూర్య(మహేష్ బాబు) తల్లిదండ్రులు అమెరికాలో సెటిల్ అవుతారు. అక్కడ
సంపాదించిన డబ్బుతో ఇండియాలో ఏదైనా వ్యాపారం చేద్దామని వస్తారు. అప్పటికి
మహేష్ ది చిన్న వయసు. జయదేవ్(ప్రకాష్ రాజ్) వీరిని మోసం చేసి డబ్బు
గుంజుకుని సూర్య తల్లిదండ్రులను చంపేస్తాడు. సూర్య ఈ చిన్న వయసులో
తల్లిదండ్రులను చంపిన వారిపై హత్యాయత్నం చేయబోయి బోస్టన్ స్కూల్ లో
చేరుతాడు. ఈ క్రమంలో ఇక్కడి మనుషుల మీద, ఈ దేశం మీద కసి పెంచుకుంటాడు.
అప్పటికి ముంబైలో డాన్ ఎవరూ ఉండరు. తనే డాన్ గా ఎదగాలనుకుంటాడు. తన
స్నేహితుడు బ్రహ్మాజీతో కలిసి లోకల్ గా చిన్న గ్యాంగ్ ను ఏర్పాటు
చేసుకుంటాడు. మంచి చెడు తేడా లేకుండా సెటిల్ మెంట్లు చేస్తూ భాయ్ గా
ఎదుగుతుంటాడు. ఈక్రమంలోనే ప్రతిపక్ష పార్టీ లాలూ(షయాజీ షిండే)కి పొలిటికల్
సపోర్టు ఇచ్చి మేయర్ గా గెలిపిస్తాడు. రూలింగ్ పార్టీలో ఉన్న జయదేవ్(ప్రకష్
రాజ్)కి కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు. పోలీస్ కమీషనర్ కూతురు
చిత్ర(కాజల్)ను ట్రాప్ చేసి ప్రేమిస్తున్నట్లు నటిస్తాడు. తనకు ఉపయోగ
పడుతుందనే ఉద్దేశ్యంతోనే మొదలు పెట్టి నిజంగానే ప్రేమిస్తాడు. దేశం మొత్తం
సూర్య భాయ్ నెట్కవర్క్ విస్తరిస్తుంది. ప్రధాన మంత్రిని శాసించే స్థాయికి
ఎదుగుతాడు. మరి సినిమా క్లైమాక్స్ ఏమిటి అనేది తెరపై చూడాల్సిందే. ఇక ఈ
చిత్రం కథ ముంబై కి డాన్ అవుదామనే సూర్య అనే కుర్రాడి కథ. అతనికో సాడ్
ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. పక్కా రివేంజ్ తో నడిచే స్టైలిష్ ఎంటర్టైనర్ అని
చెప్తున్నారు.అలాగే ఈ కథ గొప్పగా లేక పోయినా హీరో క్యారెక్టైరేజన్ హైలెట్
గా తీర్చిదిద్దటం ప్లస్ అయ్యిందని,అదే టాక్ పాజిటివ్ గా రావటానికి
కారణమంటున్నారు. ఇక కాజల్ కూడా ఇంతకుముందు లేని విధంగా ఈ సినిమాలో
గ్లామర్ తో కుర్రకారుకి వెర్రిక్కించిందని అంటున్నారు. ఇక మహేష్ చెప్పే
పంచ్ డైలాగ్స్ కు ధియోటర్స్ లో విజిల్స్ మ్రోగుతున్నాయి. అయితే పూరీ
టేకింగ్ కొత్తగా ఏమి లేదని,మహేష్ గ్లామర్ సినిమాని నిలబెడుతుందని,సంక్రాతి
విజేతగా చిత్రం నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.సినిమాలో
సీన్ టు సీన్ మహేష్ బాబే కనిపిస్తాడు. డైలాగ్స్ అదిరి పోయాయి. సినిమా విజయ
సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. కాజల్ పెర్ఫార్మెన్స్ ఫర్వాలేదు. ప్రకాష్
రాజ్, షయాజీ షిండే, నాజర్ తదితరులు తమ తమ పాత్రల మేరకు బాగా నటించారు
No comments:
Post a Comment