Monday, 26 December 2011

అనంతపురం జిల్లా గ్రామీణులకు మరింత చేరువగా .. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు

అనంతపురం గ్రామీణ ప్రజలకు మరింత చేరువగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకును తీసుకెళ్తున్నామని ఎపిజిబి బ్యాంకు రీజనల్ మేనేజర్ మహమ్మద్ ఖాన్ నేడొక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా అంతటా తమకు 93 బ్రాంచీలుండగా తమ రీజియన్ పరిధిలోనే 56 శాఖలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఎపిజిబి సేవలను గ్రామీణ ప్రజల చెంతకు విస్తరింపచేయడానికి వీలుగా సోమవారం కుందుర్పి మండలం ఎనుముల దొడ్డి, ధర్మవరం మండలం చిగిచెర్లలలో నేడు ఎపిజిబి నూతన శాఖలను ప్రారంభిస్తున్నామన్నారు. వీటితో పాటు తమ బ్యాంకు ద్వారా 89 మంది బిజినెస్ కరస్పాండెంట్లను నియమించామన్నారు. వీరికి ఆరు రోజుల్లో శిక్షణ ఇచ్చి రెండు వేల జనాభా పైబడి ఉన్న గ్రామాలలో నియమించామన్నారు. రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు శ్రమ, ఖర్చు లేకుండా బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారానే ఇళ్ల వద్దకు బ్యాంకు సేవలను పొందవచ్చని ఆర్‌ఎం తెలిపారు. ఇప్పటివరకూ తమ రీజియన్ పరిధిలోని 56 బ్యాంకు బ్రాంచ్‌ల ద్వారా రూ. 780 కోట్ల డిపాజిట్లు సేకరించామన్నారు. వచ్చే మార్చి నెలాఖరుకు ఎటిఎంలను కూడా ప్రారంభిస్తామని ఎపిజిబి ఆర్‌ఎం మహమ్మద్ ఖాన్ వివరించారు.

No comments:

Post a Comment