సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న!
క్రికెట్ అభిమానులూ ఆనందంతో ఊగిపోండి! భారత్ క్రికెట్ ముద్దుబిడ్డ సచిన్
టెండూల్కర్‌కు భారతరత్న సాకారమయ్యే రోజు మరెంతో దూరం లేదు! దేశ అత్యున్నత
పౌర పురస్కారం పరిధిని విస్తరిస్తూ ఇక క్రీడాకారులకూ ఈ అవార్డును
అందించాలని కేంద్రం నిర ్ణయించింది. అందుకోసం అర్హత నిబంధనలనూ సవరించింది.
ఇకనుంచి 'మానవ ప్రమేయం ఉన్న ఏ రంగం'లోనైనా అత్యున్నత ప్రతిభను గుర్తిస్తూ
భారతరత్న ఇవ్వనున్నట్టు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అజయ్ మాకెన్
వెల్లడించారు. మాకెన్ తాజా ప్రకటనతో రికార్డుల రారాజు సచిన్‌తో పాటు హాకీ
మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇచ్చేందుకూ మార్గం సుగమం అయినటే
్ట. మాస్టర్ 2008లో దేశంలోనే ద్వితీయ అత్యుత్తమ పురస్కారం అయిన పద్మ
విభూషణ్ అందుకున్నాడు.కాగా, 1955లో రూపొందించిన నియమ నిబంధనల
ప్రకారం, కొన్ని ప్రత్యేక రంగాలకు చెందిన వ్యక్తులకు మాత్రమే 'భారతరత్న'
ఇచ్చేవారు. అంటే కళలు, సాహిత్యం, సైన్స్, ప్రజా సేవకు సంబంధించి అత్యున్నత
నైపుణ్యశీలురకు ఈ అరుదైన గౌరవం దక్కేది. తాజా సవరణలతో ఇక నుంచి అన్ని
రంగాలూ అవార్డు పరిధిలోకి వస్తాయి. కాగా, క్రీడారంగాన్ని ఈ ప్రతిష్టాత్మక
అవార్డుకు పరిగణనలోకి తెచ్చేందుకు మంత్రి మాకెన్ తీవ్రంగా కృషి చేశారు.
మాకెన్ ఇదే విషయమై హోం మంత్రిత్వ శాఖకు ఓ లేఖ రాయడంతో, ప్రధానమంత్రి
కార్యాలయం నోటిఫికేషన్ ద్వారా నిబంధనల సవరణకు గత నెలలో శ్రీకారం చుట్టింది.
ఇక ఈసారి భారతరత్న ఎవర్ని వరించనుందని మాకెన్‌ను ప్రశ్నించగా, 'హాకీ
దిగ్గజం ధ్యాన్‌చంద్, రన్ మెషీన్ సచిన్‌లు ప్రధాన పోటీదారుల'ని
పేర్కొన్నారు. అంతకుముందు ఓసారి మాకెన్, 'ఏ క్రీడాకారుడికైనా భారతరత్న
లభిస్తే ఆ రోజు భారత క్రీడారంగానికి సుదినమ'ని ట్విట్టర్‌లో పేర్కొనడం
విశేషం.
No comments:
Post a Comment