జిల్లాలో కొత్తగా మరో మూడు మునిసిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ పంచాయతీలను మునిసిపాలిటీలుగా మార్చేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. ప్రసుత్తం కర్నూలు నగరపాలక సంస్థతో పాటు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్ మునిసిపాలిటీలు ఉన్నాయి.
మునిసిపాలిటీలుగా మారిస్తే ప్రభుత్వం విధించే పన్నులు భరించలేమని.. పంచాయతీలుగానే కొనసాగించాలని ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ పంచాయతీల నుంచి తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపారు. ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం మునిసిపాలిటీలుగా మారుస్తూ నిర్ణయించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే సామాన్య ప్రజలు పట్టణాల్లో నివసించే పరిస్థితి లేదు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వం నగరపాలక, మునిసిపాలిటీల్లో 300 నుంచి 500 శాతం ఇంటి, ఆస్తి పన్ను పెంచిన విషయం తెలిసిందే

No comments:
Post a Comment