Tuesday, 8 November 2011

రేపు పులివెందులకు జగన్ రాక


                                               
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,  కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పులివెందులకు రానున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి వైఎస్ భాస్కర్‌రెడ్డి తెలిపారు. 
వైఎస్ జగన్ మూడు రోజులపాటు జిల్లాలో పర్యటిస్తారన్నారు. 9, 11వ తేదీలలో పులివెందులలో ఉంటారన్నారు. 10వ తేదీన కడపలో పర్యటిస్తారన్నారు. ప్రజలు కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించడమే కాక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. అయితే వైఎస్ జగన్ పాల్గొనే కార్యక్రమాలలో మార్పులు, చేర్పులు ఉండవచ్చన్నారు

No comments:

Post a Comment