Friday, 17 February 2012

గోవిందుని ఆంతర్యాలు పై టిటిడి ఉద్యోగులకు శిక్షణ

టిటిడి ఉద్యోగులకు ‘గోవిందుని ఆంతర్యాలు’ అనే అంశంపై శే్వతలో ఆ సంస్థ సంచాలకులు డాక్టర్ కెవి రామకృష్ణ  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్నకాలంలో భక్తుల మనోభావాలకు అనుగుణంగా టిటిడి ఉద్యోగులు వారి విధుల్లో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ ‘గోవిందుని ఆంతర్యాలు ’అనే కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గత యేడాది కాలంలో ఎన్నో కోర్సులను శే్వతాలో ప్రవేశపెట్టామన్నారు. ప్రత్యేక వృత్తికోర్సులనే కాకుండా జనరల్ ప్రోగ్రామ్స్, ఆలయ యాజమాన్యం, శాస్ర్తియ పరివర్తన, ఆరోగ్యం, యోగాథెరపి, పాలనా యాజమాన్యం, వక్తిత్వ వికాసం, క్రమశిక్షణ తదితర అనేక అంశాలపై తాము ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల ప్రవర్తనపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో ఈ కొత్త కోర్సు ప్రవేశపెట్టామన్నారు. ఇందులో ఉద్యోగుల ప్రవర్తనా లోపంపై మరింత స్పష్టమైన విధానాలతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఈకోర్సు ద్వారా సప్తగిరి విశిష్టత, శ్రీవారి గర్భాలయంలోని మూల మూర్తి, పరివారదేవతలు, వెంకటేశ్వరుని మహాత్మ్యం, శ్రీవారి ఆలయ ఆచార వ్యవహారాలు, స్థానిక ఆలయాలు, ఆలయ చరిత్ర, ఆలయ ఆచార సాంప్రదాయాలు, శిల్పశోభ, కల్యాణోత్సవం, ఆలయ నియమాలు, శ్రీవారి సేవలో కళాకారులు, సాంప్రదాయాలు కట్టుబాట్లు, నిత్యార్చన, ఆగమ సాంప్రదాయం లాంటి అనేక అంశాలంటాయన్నారు. త్వరలో వ్యవహారికంగా తిరుమలలో వాడుకభాష అయిన తెలుగు, తమిళం, కన్నడ, ఆంగ్లం, హిందీ భాషల్లో మాట్లాడే విధంగా ఉద్యోగులకు తర్ఫీదు ఇచ్చే విధానాన్ని త్వరలో పునఃప్రారంభించనున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment