Tuesday, 20 December 2011

దురంతో రైళ్లకూ తత్కాల్ టికెట్ల

రెండు స్టేషన్ల మధ్య ఆగకుండా నడిచే 'దురంతో' ఎక్స్‌ప్రెస్ రైళ్లకూ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 'తత్కాల్' టికెట్ల సదుపాయాన్ని వర్తింపచేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అలాగే ప్రయాణ తేదీకి ఒకరోజు ముందు ఇంటర్నెట్‌ద్వారా తత్కాల్ టికెట్లు పొందేవారు రైల్లో తనిఖీ సందర్భంగా ఆధార్ గుర్తింపు కార్డు చూ పితే సరిపోతుందని ప్రకటించింది. ఈ మేరకు అన్ని జోన్లకూ సమాచారం పంపినట్లు ఓ సీనియర్ అధికారి సోమవారం వెల్లడించారు. ఈ-టికెట్ తో ప్రయాణించేవారు ఓటరు కార్డు, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యార్థి గుర్తింపు కార్డు, జాతీయ బ్యాంకు పాస్‌బుక్ , క్రెడిట్ కార్డు వంటివి చూపేందుకు ఇప్పటివరకూ అనుమతిస్తున్నారు.

1 comment:

  1. ఇంటర్నెట్‌ద్వారా తత్కాల్ టికెట్లు పొందేవారు రైల్లో తనిఖీ సందర్భంగా ఆధార్ గుర్తింపు కార్డు kooda చూ పితే సరిపోతుందని ప్రకటించింది. kooda

    ReplyDelete