
తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత దెబ్బతీస్తున్నారంటూ చిన జీయర్ స్వామికి
సంజీవ రెడ్డి సోమవారం లీగల్ నోటీసులు పంపించారు. హిందువుల మనోభావాలు
దెబ్బతీసినందుకు ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ ప్రముఖ
స్థానంలో ఉండి రెచ్చగొట్టే విధంగా, హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా
మాట్లాడటం శోచనీయమన్నారు. సంజీవరెడ్డి ఆసరా సంస్థ వ్యవస్థాపకులు. క్షమాపణలు
చెప్పకపోతే ఆయనను తిరుమల మెట్లు ఎక్కనివ్వమని హెచ్చరించారు.ఆయనపై
చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. దేనికీ పనికి రానివాడు ఇలా
మాట్లాడితే ఓ అర్థముంటుంది, సకల వేదాలు చదివిన ఓ స్వామీజీ ఇలా మాట్లాడటం
ఏమిటన్నారు. వేదాలు చదివి క్లబ్బుతో పోలుస్తారా అని ప్రశ్నించారు. ఆయనకు
జ్ఞానముందా అన్నారు. ఈ అంశంపై డిజిపికి కూడా తాను లేఖ రాశానని చెప్పారు.
ఆయనకు ఇష్టం లేకుంటే వెళ్లకుండా ఉండవచ్చు కానీ మానసికంగా దెబ్బతీయడం
సరికాదన్నారు. కాగా ఇటీవల తిరుపతి వెళుతుంటే క్లబ్బుకు వెళ్లినట్లుగా
ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment