తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను నవంబర్ 21 నుంచి 29వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని అధికారులను టీటీడీ ఈవో ఎల్‌వి.సుబ్రమణ్యం ఆదేశిం చా రు. ఆయన సోమవారం దేవస్థానం పరిపాలన భవనంలో టీటీడీ, పంచాయ తీ, పోలీసు, ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు వివిధ విభాగాధిపతులు చేయాల్సిన విధులను, సూచనల ను చేశారు. తిరుమలలో విద్యుద్దీపాలంకరణలు ఏవిధంగానైతే భక్తులను ఆకట్టుకున్నాయో అదే రీతిలో ఏర్పాట్లు ఉండాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని టీటీడీ పారిశుద్ధ్య విభాగం, తిరుచానూరు పంచాయతీ అధికారులకు సూచించారు.
బ్రహ్మోత్సవాల సందర్బంగా అమ్మవారి ఆలయం లో నవంబర్ 15వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించాలని అధికారులను ఆదేశిం చారు. భక్తులను అలరించేలా వివిధ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ కళాకారులచే వివిధ కళారూపాలను హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య, ఆళ్వారు దివ్యప్రంబంధ ప్రాజెక్టు ఏర్పాట్లు చేస్తాయని ఈవో ఎల్‌వి. సుబ్రమణ్యం తెలిపారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల నుంచి తిరుచానూరుకు రోజుకు 60 ట్రిప్పులు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇందుకు ఆర్టీసీ అధికారులు అంగీకరించారు. ఈ సమీక్ష సమావేశం లో జేఈవో కెఎస్.శ్రీనివాసరాజు, వెంకటరామిరెడ్డి, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు
No comments:
Post a Comment