Thursday, 8 December 2011
డర్టి పిక్చర్ పై రామ్ గోపాల్ వర్మ కామెంట్
ఐదు సినిమాలు ఓకే చేసిన అనూష్క
మల్లన్న హుండీల ఆదాయం రూ.కోటి
శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉభయ దేవాలయాల్లోని
హుండీల ద్వారా నగదు రూపేణా రూ.1,00,21,480 వచ్చినట్లు ఇన్‌చార్జి ఈఓ
ధనలక్ష్మి తెలిపారు. స్వామి, అమ్మవార్ల కల్యాణ మండపంలో రెండు రోజుల
పాటు హుండీలను లెక్కించామన్నారు. నగదుతో పాటు 84 గ్రాముల బంగారం, ఒక కేజీ
230 గ్రాముల వెండితో పాటు యూఎస్ డాలర్లు 124.. ఐదు యూరోల విదేశీ కరెన్సీ
వచ్చాయన్నారు. ఈ మొత్తం 21 రోజుల్లో మల్లన్నకు వచ్చిన ఆదాయమని ఆమె
పేర్కొన్నారు. భక్తుల కానుకలు, వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంతో
కోటీశ్వరుడయ్యాడు. మంగళ,బుధవారాలలో రెండు రోజుల పాటు జరిగిన హుండీల
లెక్కింపులో రూ. 1,06,28,555లు ఆదాయం చేకూరింది.
కడప జిల్లాకు త్వరలో కేంద్ర కరవు బృందం ...కలెక్టర్
కరవు బృందం జిల్లాలో పర్యటించే ఆస్కారం ఉన్నందున అధికారులు సంబంధిత
నివేదికలను రూపొం దించుకుని సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వి.అనిల్‌కుమార్
అధికారులకు సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ తన కార్యాలయంలోని
చాంబర్‌లో కేంద్ర కరవు బృందం జిల్లా పర్యటనపై అధికారులతో సమావేశం
నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నిర్మల, డీఆర్వో
హేమసాగర్, సీపీవో గురప్ప, వ్యవసాయశాఖ జేడీ రామస్వామిరెడ్డి, పశు సంవర్ధకశాఖ
జేడీ డాక్టర్ మోహన్‌రావు, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ మోహన్ తదితరులు
పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర కరవు బృందం
పర్యటనకై సీపీవో, జేడీ, అగ్రికల్చర్ జేడీ, అనిమల్ అజ్బెండరీ, డ్వామా పీడీ
బృందంగా ఏర్పడి క్షేత్ర పర్యటన జరిపి రూటు మ్యాపును రూపొందించాలన్నారు.
మండలాల్లో సాగుభూమి విస్తీర్ణం, పంట నష్టం, భూగర్భ జలాల తగ్గుదల, తాగునీటి ఎ
ద్దడి, సాగునీటి ఎద్దడి తదితర వివరాలతో పా టు పంటల వారీగా నష్టాలను
విశదీకరిస్తూ నివేదికలు రూపొందించి సిద్ధంగా ఉండాలన్నారు. కరవు బృందం
జిల్లాలో ఏ ప్రాంతలో పర్యటిం చినా అక్కడి వివరాలు తెలపాలన్నారు
ఫేస్‌బుక్‌లో పుట్టిన ప్రేమ
ఫేస్‌బుక్‌లో పుట్టిన ప్రేమ సెల్‌ఫోన్లో చిగు రించింది. చివరికి
పోలీస్‌స్టేషన్ చేర్చింది. ఇంతా చేస్తే అమ్మాయి వయసు 14. అబ్బాయి మొహం
ఒక్కసారి కూడా చూసిందిలేదు. అయినా ఇల్లు వదిలి వెళ్లిపోయింది. టెక్నాలజీ
కొంపముంచు తుందనడానికి ఇదో ఉదాహరణ.చిత్తూరు పట్టణానికి చెందిన
తొమ్మిదో తరగతి విద్యార్థిని ఇంటర్నెట్‌లో ఫేస్‌బుక్ మెంబర్. ఆమెకు కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన ఒక యువకుడు నెట్‌లో మూడు నెలల
క్రితం పరిచయమయ్యాడు. చాటింగ్ మొదలయ్యింది. ఇద్దరూ నెట్‌లోనూ,
సెల్‌ఫోన్లలోనూ గంటల తరబడి మాట్లాడారు. ఈనెల 4వ తేదీ రాత్రి 9 గంటల నుంచి
తెల్లవారి 7 వరకు మాట్లాడుతూనే ఉండిపోయారు. మధ్యలో వందలకొద్దీ ప్రేమ
సందేశాలు పంపుకున్నారు (ఎస్‌ఎంఎస్). మరుసటి రోజు అమ్మాయి స్కూలుకు
వెళ్లలేదు. ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు కంగారుపడి పోలీసులకు
ఫిర్యాదు చేశారు. అమ్మాయి సెల్ కాల్స్ పరిశీలించిన పోలీసులకు రాజంపేట
సమీపంలోని తాళ్లపాక గ్రామానికి చెందిన యువకుడితో ఆమె తరచూ మాట్లాడుతోందని
అర్థమైంది. అక్కడికెళ్లి డిగ్రీ చదువుతున్న అబ్బాయిని అదుపులోకి తీసుకుని
చిత్తూరు తీసుకువచ్చారు. అమ్మాయిని కూడా కడపలో బుధవారం అదుపులోకి
తీసుకున్నారు. ఈ వ్యవహారంలో కడపకు చెందిన మరో అబ్బాయి కూడా ఉన్నట్టు
అనుమానిస్తున్నారు. గురువారానికి పూర్తి వివరాలు వెల్లడవుతాయి
మహేంద్ర సింగ్ ధోనీకి మావోయిస్టులు, ఉగ్రవాదుల నుంచి ముప్పు
219 పరుగులతో వీరూ ప్రపంచ రికార్డు
Subscribe to:
Posts (Atom)