Showing posts with label చిత్తూరు జిల్లా. Show all posts
Showing posts with label చిత్తూరు జిల్లా. Show all posts

Saturday, 18 February 2012

శ్రీకాళహస్తిలో మహా శివరాత్రికి ఏర్పాట్లు పూర్తి

మహా శివరాత్రి పర్వదినం సందర్భం గా శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆల యానికి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పా ట్లు చేసినట్లు దేవస్థానం ఈవో విజయకుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ భక్తులందరికీ శీఘ్ర ద ర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు.
ఆలయంలో ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేశామని చెప్పారు. గతంలో రెండుసార్లు శివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన అనుభవం ఉండడంతో అందరి సహకారంతో పనులను త్వరితగతిన పూర్తి చేశామని తెలిపా రు. స్వర్ణముఖినదిలో భక్తులు స్నానాలు చేసేం దుకు ఏర్పాట్లు చేశామని, మహిళలు బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక గదులను ని ర్మించామన్నారు. మరుగుదొడ్లను రెండుచోట్ల నిర్మించామని, శివరాత్రి రోజున మొబైల్ మ రుగుదొడ్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. ‘లక్షకు పైగా భక్తులు వచ్చినా ఇబ్బందులు లేకుండా దర్శనం చేయిస్తాం. ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటుచేస్తున్నాం. సాధారణ భక్తులు, స్పెషల్ టికెట్లు కొనుగోలు చేసినవారు, వీఐపీలు ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. ఆలయంలోని క్యూలో ఉండే భక్తులకు మంచినీటిని అందిస్తాం. భక్తులు ఉక్కపోతకు గురికాకుండా అదనంగా ఫ్యాన్లు ఏర్పాటు చేశాం. అలంకరణకు బెంగళూరునుంచి పుష్పాలను తెప్పిస్తున్నాం. లక్షకు పైగా వడలను తయారు చేస్తున్నాం. పులిహోర, పొంగలి, జిలేబీ ప్రసాదాను అదేరోజు తయారు చేయిస్తాం. రథోత్సవం, కల్యాణోత్సవానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ఆలయ పరిసరాల్లో విద్యుత్ దీపాలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశాం. ఉత్సవాల నిర్వహణకు భారీ బందోబస్తు కల్పిస్తాం. టీటీడీ సహకారంతో విద్యుత్ ఆర్చీలు, గుర్రాలు, ఏనుగులు, తదితరాలను ఉత్సవాలకు తీసుకొచ్చాం’ అని ఈవో విజయకుమార్ వివరించారు.మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం తేజోమయుడైన శివుడు సూర్యప్రభ వాహనంపై కొలువుదీరి పురవీధులలో విహరించారు. జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు రథంపై వెంటరాగా సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఉదయం భక్తులకు కన్నులపండువగా సాక్షాత్కరించారు.ఆకాశంలో వెలిగే సూర్యబింబాన్ని ధిక్కరించేవిధంగా ప్రమ«థ గణాధిపతి అలరారారు. రంగురం గుల కొత్తగొడుగులు, ఛత్రచామరాలు మెరయుచుండగా స్వామివారి ఊరేగింపు భక్తజనరంజకంగా సాగింది. ఆది దంపతుల ఊరేగింపులో వేదమంత్రోచ్ఛరణలు మార్మోగగా పరిసరాలు పవిత్రమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామి, అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు

Saturday, 11 February 2012

పుత్తూరులో ధర్నా చేపట్టిన రోజా

చిత్తూరు జిల్లా పుత్తూరులో రోడ్డు నిర్వాసితుల పోరుబాటకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మద్ధతు పలికింది. నివాస ప్రాంతాలను బలవంతంగా ఖాళీ చేయించిన ప్రభుత్వం, వారికి పరిహారం చెల్లించడంలో జాప్యం చేస్తోందంటూ ఆందోళన చేపట్టింది.  ఈ ఆందోళన కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడారు.రైతులను పట్టించుకోనందుకు గతంలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారని ఇప్పుడు కాంగ్రెసుకు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులను పట్టించుకోకుంటే టిడిపికి పట్టిన గతే కాంగ్రెసుకు పడుతుందన్నారు. అధికార పార్టీని రైతులు తరిమి తరమి కొడతారని హెచ్చరించారు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి తర్వాత రాష్ట్రంలో రైతులను పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి జగన్ రైతాంగ సమస్యలను పరిష్కరిస్తారని అన్నారు. పక్క రాష్ట్రంలో రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తున్నారని కానీ రాష్ట్రంలో మాత్రం మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు రోజా బాధితులతో కలిసి శనివారం పుత్తూరు వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో చెన్నై, రేణిగుంట జాతీయ రహదారిలో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వాహన రాకపోకలు స్తంభించాయి. బాధితులకు న్యాయం జరిగే వరకూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని రోజా అన్నారు.

Friday, 10 February 2012

పేద విద్యార్థుల ఉజ్వల భవితకే ఉపకార వేతనాలు

పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకే ఉపకార వేతనాలు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. సాయంత్రం చిత్తూరు కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో వివిధ జూనియర్, డిగ్రీ, ఎంబిఎ, యూనివర్శిటీ ప్రిన్స్‌పాల్స్, కరస్పాండెంట్‌లతో మంత్రి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకునేందుకు, ఆర్థికంగా చేయూతను అందించేందుకే పీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్‌లను మంజూరు చేస్తున్నదని తెలిపారు. దేశ భవిష్యత్తుకు అవసరమైన యువతకు విద్యను అందించి దేశానికి ఉపయోగపడే విధంగా వారిని ప్రయోజకులుగా చేసే మంచి ఆశయంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమంలో కళాశాల ప్రిన్స్‌పాల్స్ సమన్వయంతో కలసి పనిచేయాలని కోరారు. స్కాలర్‌షిప్‌లను, రీయింబర్స్‌మెంట్‌ను శాశ్వతంగా కొనసాగించేందుకు కళాశాల ప్రిన్స్‌పాల్ వారి సలహాలను, సూచనలను అందించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి యాజమాన్యాలు ఎటువంటి అవకతవలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, సాంఘిక సంక్షేమశాఖ రేమాండ్ పీటర్ మాట్లాడుతూ విద్యార్థుల దరఖాస్తు లు వెంటనే పరిశీలించి ఆన్‌లైన్‌లో ఉంచాలన్నారు. ఈసంవత్సరం 1,259కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, విచారణ ప్రక్రియ కళాశాల యాజమాన్యాల వారు మరింత వేగవంతం చేయాలన్నారు. కళాశాల యాజమాన్యాల వారు కళాశాలకు ఏప్రాంతంలో అనుమతి తీసుకుని వుంటే ఆప్రాంతంలోనే కళాశాలను నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో వుంచుకొని అమలుచేస్తున్న కార్యక్రమానికి కళాశాలల ప్రిన్స్‌పాల్స్ సహకారం అందించాలన్నారు.

Wednesday, 8 February 2012

దుకాణాలకు వ్యాపారానికి లెసైన్సు తప్పనిసరి

చిత్తూరు మున్సిపాలిటీలో చేసే ప్రతి వ్యాపారానికి అధికారుల నుంచి పొందిన లెసైన్సు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. లెసైన్సు లేకుండా ఎలాంటి వ్యాపారమైనా నిర్వహించడానికి వీల్లేదన్నారు. వ్యాపారాలకు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. పురపాలక చట్టం-1965 ప్రకారం పట్టణాల్లో వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరూ మున్సిలిటీ నుంచి లెసైన్సు తీసుకోవాలని తెలిపారు.
మున్సిపల్ గెజిట్‌లో దాదాపు 400 రకాల వ్యాపారాలున్నాయని చెప్పారు. టీ దుకాణం నుంచి బార్బర్ షాపు, హోటళ్లు, ఫ్యాక్టరీలు, సినిమా థియేటర్లు ఇలా అన్నీ డీ అండ్‌వో (డేంజరస్ అండ్ అఫెన్స్) ట్రేడ్స్ కిందకు వస్తాయన్నారు. వీటి నిర్వాహకులు ప్రతి ఏటా మున్సిపాలిటీ నుంచి లెసైన్సు తీసుకోవడానికి కనిష్టంగా రూ.115 నుంచి రూ.24,735 వరకు చెల్లించాలని తెలిపారు. పట్టణంలో ప్రస్తుతం ప్రతి ఏటా 2433 దుకాణాల నుంచి రూ.17 లక్షలు లెసైన్సు రుసుం కింద వసూలు చేస్తున్నామని చెప్పారు.  మొత్తం 3500 దుకాణాల నుంచి రూ.22 లక్షలు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దీనికి కార్యరూపం దాల్చడానికి ప్రణాళికయుతంగా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారాలు చేసే ప్రతి దుకాణదారుడికీ  నోటీసులు జారీ చేస్తామని ప్రజారోగ్యశాఖ అధికారి తెలిపారు. చేసే వ్యాపారం ఆధారంగా ఎంత చెల్లించాలనే విషయం శానిటరీ ఇన్‌స్పెక్టర్లు చెబుతారన్నారు. ఆ మొత్తాన్ని ఈ నెలాఖరులోపు చెల్లించాలని చెప్పారు. ఇది ఒక సంవత్సరం చెల్లుబాటవుతుందని తెలిపారు. రెండో ఏడాది కూడా ఇంతే మొత్తాన్ని చెల్లించి రెన్యువల్ చేసుకోవాలని చెప్పారు. ప్రతి రెండేళ్ల తరువాత 15 శాతం రుసుం పెంచుతుంటామన్నారు. ఈ నెలాఖరులోపు రుసుం చెల్లించని వాళ్లు మార్చి 15వ తేదీ లోపు మొత్తం రుసుం మీద 25 శాతం అపరాధం చెల్లించాలని తెలిపారు. లేని పక్షంలో మార్చి 16 నుంచి దుకాణాలను తనిఖీ చేసి లెసైన్సు లేని వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. వ్యాపారులు సహకరించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.

Monday, 30 January 2012

కాణిపాకం ఆలయ హుండీలో వాచ్ కలకలం

చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ఆవరణలోని హుండీలో బాంబు ఉందని సోమవారం కలకలం రేగింది. నాలుగు గంటల ఉత్కంఠ అనంతరం ఎలక్ట్రానిక్ రిస్ట్‌వాచ్ అని తేలడంతో గ్రామస్థులు, అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.కాణిపాక వరసిద్ధి ఆలయ ఆవరణలో సోమవారం వేకువజామున ఉన్నట్లుండి టైమ్ బాంబుకు సంబంధించిన బీప్ శబ్దం నెమ్మదిగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని గమనించిన ఆలయ హోంగార్డులు క్షుణ్ణంగా పరిశీలించగా ప్రధాన ఆలయ గర్భగుడి పక్కనే ఉన్న అద్దాల మండపం వద్ద ఏర్పాటు చేసిన హుండీ నుంచి ఈ శబ్దం వస్తున్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై ఉలిక్కిపడ్డ అధికారులందరూ హుటాహుటిన ఆలయం వద్దకు చేరుకుని హుండీని పరిశీలించి, బాంబు స్క్వాడ్‌కు సమాచారమిచ్చారు. శబ్దం వస్తున్న హుండీ స్వామివారి దర్శనానికి వెళ్లే క్యూలైన్లకు ఆనుకుని ఉండటంతో భక్తులను దర్శనానికి అనుమతించలేదు. నిబంధనల మేరకు తాళాలు చిత్తూరు ఏసీ కార్యాలయంలో ఉండటంతో హుండీ తెరవడానికి మూడు గంటలకుపైగా సమయం పట్టింది.తాళాలు వచ్చిన తర్వాత బాంబుస్క్వాడ్ సిబ్బంది సురేష్ ద్వారా హుండీని నెమ్మదిగా తెరిపించారు. అందులో ఎలక్ట్రానిక్ రిస్ట్ వాచ్ కనపడటంతో ఆలయాధికారులు, భక్తులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో నాలుగు గంటల ఉత్కంఠకు తెరపడింది.

Thursday, 26 January 2012

ర్యాగింగ్ చేయొద్దన్నందుకు దాడి

ఓ విద్యార్థిపై దాడి చేసిన కేసులో ఏడుగురు విద్యార్థులను చంద్రగిరి పోలీసులు అరెస్టు చేశారు. శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతున్న జ్ఞానేంద్రనాయుడు, సాయికృష్ణ, శరత్‌కుమార్, నిరంజన్, వినోద్, భరత్, దిలీప్‌లు స్నేహితులు. వీరందరూ నెల క్రితం మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే వీరిలో జ్ఞానేంద్రనాయుడు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో వీరి మధ్యన భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కాలేజీ విడిచిపెట్టిన తరువాత జ్ఞానేంద్రనాయుడు మోటార్ సైకిల్‌పై తిరుపతి వెళుతుండగా, మిగిలిన ఆరుగురు దాడి కి పాల్పడ్డారు. ఇందుకు కేఎంఎం కాలేజీకి చెందిన భరత్ సహాయం తీసుకున్నారు. దీనిపై బాధితుడు చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడిన ఆ ఏడుగురిని అరెస్టు చేశారు. ర్యాగింగ్ చేయడం తగదని చెప్పినందుకు కక్షకట్టి దాడుల వరకు వెళ్లిన ఆ విద్యార్థులను చంద్రగిరి సీఐ నాగభూషణం తీవ్రంగా మందలించారు. వారిని కోర్టులో హాజరుపరిచారు. అంతేకాక దాడికి పాల్పడ్డ విద్యార్థుల గురించి ఆయా కాలేజీల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ర్యాగింగ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Tuesday, 24 January 2012

జన గణ మన కు వందేళ్ళు పూర్తి

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జన్మదిన వేడుకలు, ఆయన విరచిత జాతీయ గీతం 'జనగణమన' వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గీతానికి స్వరకల్పన జరిగిన మదనపల్లి బిటి కళాశాలలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఠాగూర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, 10 వేలమంది విద్యార్ధులతో కలిసి 'జనగణమన' గీతం ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీటీ కాలేజీ ప్రహరీ గోడకై రూ.2 కోట్లు జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన రచించిన జాతీయ గీతం భారతీయులకు స్ఫూర్తిగా నిలిచిందని సీఎం కొనియాడారు. చిత్తూరు జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్నారు.ఏ గీతం వింటే దేశవిదేశాల్లోని భారతీయుల హృదయాలు పులకరిస్తాయో. దేశంలోని 120 కోట్ల మంది లేచి నిల్చుని గౌరవిస్తారో అలాంటి జాతీయగీతాన్ని మంగళవారం మదనపల్లెలోని బిసెంట్ దివ్యజ్ఞాన కళాశాలలో పదివేల మంది విద్యార్థులు ముక్తకంఠంతో 20సార్లు జాతీయగీతాన్ని ఆలపించి రెండు లక్షల గళార్చన పూర్తిచేశారు.తొలుత బెంగాలీలో రచించిన ఈ గీతాన్ని మదనపల్లె బీటీ కళాశాల సందర్శనార్థం ఇక్కడికి వచ్చిన ఠాగూర్ ఆంగ్లంలోకి తర్జుమా చేయడం ద్వారా మదనపల్లెకు ఖ్యాతిని తెచ్చిపెట్టారు. జనగణమన గీతానికి ఎంతటి గౌరవం, ప్రాధాన్యత ఇస్తున్నామో, అంతటికంటే మించిన విశ్వవ్యాప్త గౌరవం కూడా దక్కింది. 1911లో మొదటిసారిగా పాడిన ఈ గీతాన్ని 1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ ఉత్సవాల్లో బీజేపీ జాతీయనేత, రాజ్యసభసభ్యుడు వెంకయ్యనాయుడు, చిరంజీవి, మంత్రులు రఘువీరారెడ్డి, గల్లా అరుణకుమారి, తదితరులు పాల్గొన్నారు.

Sunday, 22 January 2012

24న జాతీయగీతం జనగణమన వందేళ్ల ఉత్సవం

జాతీయగీతం జనగణమనకు వందేళ్లు, విశ్వకవి రవీంద్రనాథ్‌ఠాగూర్ 150వ జయంతిని పురస్కరించుకుని మదనపల్లె బిటి కళాశాల ప్రిన్సిపల్ తులసీరామ్‌నాయుడు ఆధ్వర్యంలో ఈనెల 24న జనగణమన జాతీయగీత వందేళ్ల ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్, డిప్యూటి సిఎం దామోదర్ తో పాటు 10మందికి పైగా కేంద్ర, రాష్టమ్రంత్రులు, చిరంజీవి, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఉత్సవానికి హాజరవుతున్నట్లు మదనపల్లె ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌బాష వెల్లడించారు.  విశ్వకవి రవీంద్రుడు ఆరురోజుల పాటు మదనపల్లె బిటి కళాశాలలో బసచేసిన ప్రదేశాలు, నాడు జనగణమన గేయానికి బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి ట్యూన్‌చేసి గీతాన్ని మొదటిసారిగా అప్పటి విద్యార్థులచే ఆలపించిన ప్రదేశాలను సిఎం, గవర్నర్‌లు పరిశీలించనున్న దృష్ట్యా వాటిని అధికారులు పరిశీలించారు. అనంతరం హెలీప్యాడ్ ల్యాండ్ స్థలం కోసం బెంగళూరురోడ్డులోని బిటి కళాశాల ఆవరణాన్ని పరిశీలించారు. అనంతరం జరిగే సిఎం బహిరంగ సభ కోసం పుంగనూరురోడ్డులోని మిషన్‌కాంపౌండు ఆవరణాన్ని పరిశీలించారు. అనంతరం ఆర్‌అండ్‌బి అతిథిగృహం, ఎమ్మెల్యే స్వగృహాన్ని కూడా అధికారులు పరిశీలించారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు సిఎం మదనపల్లె పట్టణంలో ఉంటున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాష స్థానిక విలేఖరులతో మాట్లాడారు. జనగణమనకు వందేళ్ళు, విశ్వకవి రవీంద్రునికి 150 జయంతి ఉత్సవాలను ఈనెల 24న ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా 24న మధ్యాహ్నం 2గంటలకు ప్రజలందరూ ఒకేసారి జనగణమన జాతీయగీతం ఆలపించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Thursday, 19 January 2012

సుస్థిర పాలన అందివ్వగలిగింది తెలుగుదేశమే...చంద్రబాబు నాయుడు


రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా మారేవరకు రైతు సమస్యలపై రాజీలేని పోరాటం సాగిస్తానని, రైతులు, పేదల కోసం తమ ప్రాణాలైనా ఇస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ప్రధాన పంటలు సాగుచేస్తున్న రైతులు పెట్టుబడులు కూడా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలో ఆయన గురువారం 'రైతు పోరుబాట' నిర్వహించారు. మధ్యాహ్నం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో వరసిద్ధి వినాయకుని దర్శించుకున్న అనంతరం రెండు గంటలకు అగరంపల్లె నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అగరంపల్లె కూడలిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఎరువులు, క్రిమిసంహారక మందులు, డీజిల్, కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ప్రభుత్వం పదేపదే ఎరువుల ధరలు పెంచుతూ పోవడంతో డీఏపీ బస్తా ధర రూ.400 నుంచి రూ. 1200కు పెరిగిపోయిందని, బ్లాక్ మార్కెట్‌లో వీటిని మరింత అధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శించారు. ఈ పరిస్థితిని చక్కదిద్ది రైతులకు గిట్టుబాటు ధరలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. చంద్రబాబు కాణిపాకం నుండి తన రైతు పోరు బాట యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బొత్స రాష్ట్రంలో లిక్కర్ డాన్‌గా మారారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ద్వారా ముఖ్యమంత్రి డబ్బు దండుకుంటున్నారని విమర్శించారు. పాలన పక్కన పెట్టి కాంగ్రెసు నేతలు పదవుల కోసం ఢిల్లీ చుట్టూతిరుగుతున్నారన్నారు. చిరంజీవిది కూడా అదే పరిస్థితి అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. మద్యం మాఫియా విచ్చలవిడిగా రాజ్యమేలుతోందన్నారు. చెత్త నేతలు అధికారం కోసం పాట్లు పడటం శోచనీయమన్నారు. రైతు పోరు బాట ప్రభుత్వానికి చెంప పెట్టు అన్నారు.తెలుగుదేశం పార్టీయే రాష్ట్రంలో సుస్థిర పాలన ఇస్తుందన్నారు. పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం పాలనను, రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం చేస్తామన్నారు. కాగా ఈ నెల 20వ తేది నుండి చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. భారీ వర్షాల వల్ల జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి ఆయన కందుకూరు నియోజకవర్గానికి వెళ్లనున్నారు

Wednesday, 4 January 2012

మంత్రులు, ఎమ్మెల్యేలకు మద్యం మాఫియాతో సంబంధాలు..చంద్రబాబు

నిబంధనలకు విరుద్ధంగా 31 మద్యం దుకాణాలను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఎలా కేటాయించారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. డిస్టిల్లరీ పర్మిట్లు ఇష్టాను సారంగా ప్రభుత్వం ఇస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ ముడుపు తీసుకుని మద్యం తయారీకి అనుమతులు ఇస్తున్నారని బాబు ఆరోపించారు.చిత్తూరు జిల్లా, కుప్పం నియోజక వర్గంలో రెండో రోజైన బుధవారం పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం ఎమ్మార్పీ ధరలకే అమ్మాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కులేదని అన్నారు. మద్యం నియంత్రణకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న మద్యం మాఫియాపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీయే సమాధానం చెప్పాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడి మద్యం విక్రయాలతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు మద్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా జరిగిన మోటారు సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.

Monday, 2 January 2012

ద్విచక్ర వాహనాలతో కాలేజీలకు వచ్చేవిద్యార్థులకు హెల్మెట్ తప్పనిసరి

మోటార్ సైకిల్ వేగంగా నడిపి ప్రాణాలు పోగొట్టుకుంటున్న విద్యార్థులకు ప్రాణరక్షణ కల్పించేందుకు అర్బన్ ఎస్పీ ప్రభాకర్‌రావు నడుం బిగించారు. ఇందులో భాగంగానే సోమవారం నుండి తిరుపతిలోని ఏ కాలేజీకి మోటార్ సైకిల్‌పై వెళ్లే విద్యార్థి అయినా హెల్మెట్ లేకుండా వెళితే వారిని అనుమతించరాదని కళాశాల యాజమాన్యాలకు పోలీసు శాఖ గట్టి హెచ్చరికలు చేసింది. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా విధిగా పిల్లలకు హెల్మెట్లు తీసివ్వాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించింది. ఈ నేపధ్యంలో అన్ని ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లకు, కరస్పాండెంట్లకు అర్బన్ ఎస్పీ ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ప్రభుత్వ కళాశాలలకు కూడా వీటిని వర్తింపజేసేందుకు రంగం సిద్ధం చేశారు. సంపన్నులు అయిన తల్లిదండ్రులు సొమ్ములున్నాయి కదా అని నగర రోడ్లకు ఉపయోగపడని అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మోటార్ సైకిళ్లను కొనిస్తున్నారు. పిల్లలను సంతృప్తి పరచడానికి తల్లిదండ్రులు చేస్తున్న ఈ తీరు చివరకు వారికి కడుపుకోత మిగుల్చుతున్నా అప్రమత్తమవుతున్న తల్లిదండ్రుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉందని మేధావులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో పోలీసులు చొరవ తీసుకుని హెల్మెట్ వాడకాన్ని నిబంధనగా విధించడం సంతోషదాయకమని వారంటున్నారు. ఇది కేవలం రెండురోజులకు పరిమితం కాకుండా శాశ్వతంగా అమలు చేయాల్సిన బాద్యత పోలీసులపై ఉందని అంటున్నారు. ఇందుకు తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు పోలీసులకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారంటున్నారు. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే వారి తల్లిదండ్రులు అయినా పాఠశాల యజమానులు అయినా ముందుగా వారిపై కేసులు నమోదు చేయించాలని సూచిస్తున్నారు

Thursday, 29 December 2011

కాణిపాకం విచ్చేసే భక్తులకు జనవరి ఫస్ట్‌కు విస్తృత ఏర్పాట్లు

జనవరి ఒకటవ తేదీ కాణిపాకం విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు డీఆర్వో శేషయ్య తెలిపారు.  సాయంత్రం ఈవో కార్యాలయంలో జనవరి ఫస్ట్ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి ఫస్టున లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారుల ను ఆదేశించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. వీఐపీ భక్తుల వల్ల సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులందరికీ శీఘ్రదర్శనం కల్పించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రత కల్పించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఆలయ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా ఎప్పటి కప్పుడు శానిటేషన్ పనులను పరిశీలించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశిం చారు. రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు ఆయన సూచించారు. ఈ సమావేశానికి ఎంపీడీవో పార్వతమ్మ, డీపీఆర్వో గైర్హాజర్ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌కో ఏడీ మోహన్‌రాజ్ మాట్లాడు తూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా 160 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను అందుబాటులో ఉంచుతామని తెలిపా రు. అనంతరం మండల వైద్యాధికారిణి షర్మిష్టారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌డీవో సుబ్రమణ్యేశ్వరరెడ్డి, డీఎస్పీ శిల్పవల్లి, సీఐ శ్రీకాంత్, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ గురుప్రసాద్, తహసీల్దార్ రంగస్వామి తదితరు లు పాల్గొన్నారు.

Sunday, 25 December 2011

మదనపల్లె వందేళ్ల జనగణమన ప్రభాత గీతమే

వందేళ్ల జనగణమనకు మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లెతో 92 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉంది. ఎలాగంటారా... మదనపల్లెలో హోమ్‌రూల్ ఉద్యమ స్థాపకురాలు అనిబిసెంట్ స్థాపించిన బిసెంట్ థియోసాఫికల్ కళాశాల (బీటీ కాలేజ్) విద్యార్థులు జాతీయోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. దీనిపై ఆగ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం కళాశాల గుర్తింపును రద్దు చేసింది. 1919 ఫిబ్రవరిలో బెంగళూరుకు వచ్చిన రవీంద్రుడిని ఈ కాలేజీ ప్రిన్సిపాల్ కజిన్స్ తమ కళాశాలకు ఆహ్వానించారు. 1919 ఫిబ్రవరి 25న మదనపల్లెకు వచ్చిన ఠాగూర్ వారం రోజులపాటు ఈ కళాశాలలోనే గడిపారు. అదే సమయంలో తాను తత్సమ బెంగాలీలో రచించిన జనగణమన గీతాన్ని 'ది మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా' (భారత సుప్రభాత గీతం) పేరిట ఆంగ్లంలోకి అనువదించారు. ఈ గీతానికి ప్రిన్సిపల్ కజిన్స్ సతీమణి మార్గరెట్ కజిన్స్ బాణీ కట్టి విద్యార్థులతో కలసి ఆలపించారు. ఠాగూర్ గౌరవార్థం దాన్నే తమ కళాశాల ప్రార్థనాగీతంగా ప్రకటించారు. ఆనాటి నుంచీ 1950 వరకూ బీటీ కళాశాల ప్రార్థనా గీతంగా కొనసాగిన జనగణమనకు 1950లో జాతీయ గీతం హోదా లభించింది.

Friday, 16 December 2011

తిరుపతి ప్రజాసమస్యలు గాలికొదిలేసిన... చిరంజీవి

పదవులు తప్ప ప్రజా ప్రయోజనాలు తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవికి పట్టవని  ఈసందర్భంగా ప్రజలనుద్దేసించి కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి ప్రజాసమస్యలను గాలికి వదిలేసి మంత్రి పదవి దక్కించుకునే పనిలో బిజిగా వున్నారన్నారు. ఎమ్మెల్యేగా చిరంజీవి పనికిరాడన్న విషయాన్ని ప్రజలు ఎప్పుడో తేల్చేశారన్నారు. అందుకే ఆయన ఎక్కడ తిరిగినా మహిళలు తిరగబడుతున్నారన్నారు. ఇటీవల చింతలచేనుకు వచ్చి కనీసం ప్రజలతో మాట్లాడకుండా అక్కడ నుండి పారిపోయిన సంఘటనలున్నాయన్నారు. నగరంలో కనీసం దోమల నియంత్రణకు కూడా చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో చిరంజీవి వున్నారన్నారు. ప్రజలు కూడా నేడు చిరుకు ఎందుకు ఓట్లు వేశామా? అని బాధపడుతున్నారన్నారు. తాము గత మూడు రోజులుగా వార్డులలో తిరుగుతుంటే కుప్పలు తెప్పలుగా వినతులు వస్తున్నాయన్నారు. వైఎస్ పాలనలో రాష్ట్రం ఎంతో సుభిక్షంగా వుండేదన్నారు. అయితే నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. అభివృద్ది, సంక్షేమం రెండుకళ్లుగా ప్రజారంజకంగా పాలన చేశారన్నారు. అయితే నేడు రచ్చబండ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహించి ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నారన్నారు.

Wednesday, 14 December 2011

చిత్తూరు జిల్లాను విడదీస్తే ఊరుకోం...ఎమ్మెల్యే అమరనాధ రెడ్డి

జిల్లాను విభజించే ప్రయత్నాన్ని ప్రభుత్వం వెంటనే మానుకోవాలని పలమనేరు ఎమ్మెల్యే అమరనాధ రెడ్డి డిమాండు చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి మాణిక్య వరప్రసాద్ జిల్లా విభజనపై లేనిపోని ప్రకటనలు చేసి ప్రజలను ఉద్వేగానికి గురి చేయడం తగదన్నారు. వనరులు, నీటి సదుపాయాలు లేక కరువు కాటకాలతో అల్లాడుతున్న చిత్తూరు జిల్లాలో అంతర్భాగమైన తిరుపతిని వేరు చేయడమంటే ప్రజలను రెచ్చగొట్టడమేనన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమలపై కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన ప్రముఖుల కళ్ళు పడినట్లనిపిస్తోందని, వ్యాపార నిమిత్తం వలస వచ్చి తిరుపతిలో స్థిరపడిన బడా వ్యాపారస్తులు, కొందరు రాజకీ య నేతలు తిరుపతిని చిత్తూరు జిల్లానుంచి వేరు చేయాలనే కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోందన్నా రు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త డివిజన్ల ఏర్పాటుకు అందరూ అంగీకరిస్తారని, జిల్లా ను ముక్కలు చేయాలనుకుంటే మాత్రం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ సహచర మంత్రి ప్రకటనపై తనకేమీ పట్టనట్టు వ్యవహరించడం విడ్డూరంగా వుందన్నారు. రాజకీయాలకతీతంగా జిల్లా లోని ప్రజాప్రతినిధులందరూ ఈ విషయంపై స్పందించాలని కోరారు. జిల్లాకు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార, విద్యాకేం ద్రంగా విలసిల్లుతున్న తిరుప తిని జిల్లా నుంచి వేరు చేస్తామని ప్రభుత్వం ఆలో చిస్తుంటే విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘా లు స్పందించకపోతే భవిష్య త్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Friday, 9 December 2011

ఒక అమ్మాయి కోసం ఇద్దరు విద్యార్థులు ఘర్షణ

ఒక అమ్మాయి కోసం ఇద్దరు విద్యార్థులు ఘర్షణ పడ్డారు. అంతటితో ఆగకుండా గురువారం బయటి వ్యక్తులను కళాశాల ఆవరణలోకి తీసుకొచ్చారు. విద్యార్థులందరూ ఏకమై వారిని చితకబాది పంపారు. చంద్రగిరి పాలిటెక్నిక్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐరాల మండలం కాణిపాకంకు చెందిన సంతోష్ చంద్రగిరి రెడ్డివీధిలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. పాకాలకు చెందిన కేశవులు కూడా ఇక్కడే చదువుతున్నాడు. ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు అదే కళాశాలలోని ఒక అమ్మాయిపై ప్రేమ పెంచుకున్నారు. ఆ అమ్మాయి మాత్రం ఇద్దర్నీ పట్టించుకునేది కాదు. మూడు రోజుల క్రితం ‘ఆ అమ్మాయి నీ వల్ల నాతో మాట్లాడడం లేదంటే కాదు నీ వల్లే అంటూ’ సంతోష్, కేశవులు చిన్నపాటి ఘర్షణ పడ్డారు. సంతోష్‌ను ఎలాగైనా కొట్టాలని నిర్ణయించుకున్న కేశవులు స్నేహితులు లీలాకృష్ణ, ఫరీన్‌లను వెంటబెట్టుకుని పాకాల మండలం సామిరెడ్డిపల్లికి వెళ్లి నానిరెడ్డి, రెడ్డిప్రసాద్, హరీష్, మహేష్‌లను కలుసుకున్నారు. విషయం చెప్పి తమకు సహాయం కోరారు. గురువారం ఉదయం 11 గంటలకు సంతోష్‌పై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. లీలాకృష్ణ, ఫరీన్, కేశవులు యథావిధిగా కళాశాలకు వచ్చారు. సామిరెడ్డిపల్లికి చెందిన నలుగురు యువకులు సంతోష్‌పై కర్రలతో దాడికి దిగారు. విషయం గమనించిన కళాశాల విద్యార్థులు సంతోష్‌కు అండగా నిలి చారు. ఆ నలుగురు యువకులను పట్టుకుని చితకబాదారు. కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. కానిస్టేబుళ్లు  వెంటనే అక్కడకు చేరుకుని ఆ నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనను కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రమ తీవ్రంగా పరిగణించారు.

Thursday, 8 December 2011

ఫేస్‌బుక్‌లో పుట్టిన ప్రేమ

ఫేస్‌బుక్‌లో పుట్టిన ప్రేమ సెల్‌ఫోన్లో చిగు రించింది. చివరికి పోలీస్‌స్టేషన్ చేర్చింది. ఇంతా చేస్తే అమ్మాయి వయసు 14. అబ్బాయి మొహం ఒక్కసారి కూడా చూసిందిలేదు. అయినా ఇల్లు వదిలి వెళ్లిపోయింది. టెక్నాలజీ కొంపముంచు తుందనడానికి ఇదో ఉదాహరణ.చిత్తూరు పట్టణానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఇంటర్నెట్‌లో ఫేస్‌బుక్ మెంబర్. ఆమెకు కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన ఒక యువకుడు నెట్‌లో మూడు నెలల క్రితం పరిచయమయ్యాడు. చాటింగ్ మొదలయ్యింది. ఇద్దరూ నెట్‌లోనూ, సెల్‌ఫోన్లలోనూ గంటల తరబడి మాట్లాడారు. ఈనెల 4వ తేదీ రాత్రి 9 గంటల నుంచి తెల్లవారి 7 వరకు మాట్లాడుతూనే ఉండిపోయారు. మధ్యలో వందలకొద్దీ ప్రేమ సందేశాలు పంపుకున్నారు (ఎస్‌ఎంఎస్). మరుసటి రోజు అమ్మాయి స్కూలుకు వెళ్లలేదు. ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు కంగారుపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయి సెల్ కాల్స్ పరిశీలించిన పోలీసులకు రాజంపేట సమీపంలోని తాళ్లపాక గ్రామానికి చెందిన యువకుడితో ఆమె తరచూ మాట్లాడుతోందని అర్థమైంది. అక్కడికెళ్లి డిగ్రీ చదువుతున్న అబ్బాయిని అదుపులోకి తీసుకుని చిత్తూరు తీసుకువచ్చారు. అమ్మాయిని కూడా కడపలో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో కడపకు చెందిన మరో అబ్బాయి కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. గురువారానికి పూర్తి వివరాలు వెల్లడవుతాయి

Sunday, 4 December 2011

అలిగిన చిత్తూరు జిల్లా కలెక్టర్

ప్రపంచ వికలాంగుల దినోత్సవ సమావేశానికి హాజరు కావాల్సిన కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఉన్నతాధికారుల వైఖరితో గేటు వరకూ వచ్చి అలిగి వెళ్లిపోయారు. వివరాలిలా ఉన్నాయి.
సరిగ్గా ఉదయం 9.55 నిమిషాలకు కలెక్టర్ వాహనం వేలూరు రోడ్డు మీదుగా వస్తూ జిల్లా పరిషత్ మీటింగ్ హాలుకు రావడానికి టర్న్ అయ్యింది. ఇదే సమయంలో విద్యార్థులు ర్యాలీగా వస్తున్నారు. సరిగ్గా జడ్పీ మీటింగ్ హాలు వద్దకు కలెక్టర్ వాహనం వస్తుండగా విద్యార్థులు ఆయనకు అడ్డుగా ఉన్న డివైడర్‌ను దాటుతూ వచ్చారు. ఇంతలో ఓ విద్యార్థి ఆటో కింద పడడం కలెక్టర్ కంటపడింది. ఈ దృశ్యాలను చూసిన కలెక్టర్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.వికలాంగుల దినోత్సవం రోజున విద్యార్థులతో ఎలాంటి ర్యాలీలు నిర్వహించవద్దన్నప్పటికీ ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. అదీగాక ర్యాలీగా వస్తున్న పిల్లలతో ఏ ఒక్క ఉపాధ్యాయుడూ లేకపోవడం, వాహనాల మధ్య పిల్లలు చిక్కుకోవడం.. ఏమైనా ప్రమాదం జరిగి ఉంటే ఎవరు బాధ్యులు అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేసి సమావేశానికి హాజరుకాకుండానే గేటు నుంచి అటే అలిగి వెళ్లిపోయారు. ఈ సంఘటనతో నివ్వెరపోయిన ఉన్నతాధికారులందరూ కలెక్టర్ మళ్లీ వస్తారేమోనని అరగంటసేపు వేచి ఉన్నారు. చివరకు కలెక్టర్ ఇక రారని తెలుసుకుని సమావేశాన్ని పూర్తిచేశారు.

Wednesday, 23 November 2011

నిరుద్యోగులకు తప్పని తిప్పలు

 పోలీస్ కానిస్టేబుల్ సెలెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు క్రిమీలేయర్ సర్టిఫికెట్ల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. సాధారణంగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకు నేవారు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జత చేస్తే సరిపోతుంది. కానీ ఈ పర్యాయం ప్రభుత్వం నోటిఫి కేషన్ జారీ చేసిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు అభ్యర్థులు క్రిమిలేయర్ సర్టిఫికేట్లు జత చేయాలని ఆదేశించింది. దీంతో అ భ్యర్థులు తహసీల్దార్ కార్యాలయానికు క్యూ కట్టారు. మీ సేవ ద్వారా ఆ దాయం,కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారే కానీ క్రిమిలేయర్ అంశం లేదు. సర్టిఫికేట్ మంజూరు చేయాలం టే రెవెన్యూ అధికారులు పెద్ద తతంగమే పూర్తి చేయాల్సి వుంది. దీని కోసం ఓ ఫైలును తయారు చేసి వీ ఆర్వోలు, ఆర్ఐలు స్టేట్‌మెంట్ రికార్డు చేయాల్సి వుంది. దీనితో పాటు అ భ్యర్థుల తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌లు రికార్డు చేయాల్సి వుంది. ఆదాయ పరిమితి సంవత్సరానికి రూ.4.5 లక్షలు లోపు వున్న వారికే ఓబీసీ సర్టిఫికేట్ మంజూరు చేయాలన్నది ప్రభుత్వ నిర్ధేశం. ఈ ప్రక్రియ పూర్తి చేసి సర్టిఫికేట్ చేతికందే సరికి వారం రోజులు పడుతోంది. స్థానిక తహసీల్దార్ అమరేం ద్రబాబుతో అభ్యర్థులు తమ సమస్యను విన్నవించారు. స్పందించిన ఆయన మాట్లాడుతూ వీఆర్వోలు, ఆర్ఐలు విచారించి సైడ్ ఇన్షియల్ వేస్తే క్రిమిలేయర్ సర్టిఫికేట్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆర్ఐలు నవీన్, శాస్త్రిలకు సూచనలిచ్చారు

Tuesday, 22 November 2011

6000 కోట్లతో రాష్ట్రంలో శ్వేత విప్లవం:ముఖ్యమంత్రి

ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్రవ్యాప్తంగా మిల్క్ మిషన్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో ఫుడ్ 360 డిగ్రీస్ పేరిట జరుగుతున్న ఆహార ఉత్పత్తుల సదస్సును సోమవారం ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో కొద్ది కాలం క్రితం ప్రయోగాత్మక ప్రాతిపదికన పాల ఉత్పత్తి పెంపునకు ఒక కార్యక్రమం ప్రారంభించామని ఆయన చెప్పారు. అదే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం ద్వారా గ్రామీణుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.చిత్తూరు జిల్లాలో ఇందిరా క్రాంతి పథం (ఐకెపి) ద్వారా గ్రామీణ మహిళలకు 3000 లీటర్ల వరకు సామర్థ్యం గల బల్క్ కూలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు సహకారం అందించడం ద్వారా లీటరు పాలకు మూడేళ్ల క్రితం లభించిన ఆరేడు రూపాయల ధర 20 నుంచి 21 రూపాయలు వచ్చేలా చేశామని ఆయన చెప్పారు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో రోజుకి 14 లక్షల లీటర్ల వరకు పాలు ఉత్పత్తి చేస్తున్నారన్నారు. దీనికి అనుబంధంగా పెరుగు, ఫ్లేవర్డ్ మిల్క్ వంటి అనుబంధ ఉత్పత్తులు తయారుచేయడం ద్వారా వారు అదనపు ఆదాయాలు కూడా పొందగలుగుతున్నారని ఆయన చెప్పారు.