Showing posts with label కర్నూలు జిల్లా. Show all posts
Showing posts with label కర్నూలు జిల్లా. Show all posts

Friday, 9 March 2012

కర్నూలు జిల్లా నదీతీరాన కెసిఆర్ విగ్రహం...టీజీ వెంకటేశ్

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ మీద కూల్చివేతకు గురైన మహనీయుల విగ్రహాలను కర్నూలు సమీపంలో తుంగ భద్ర నదీతీరాన ఏర్పాటు చేస్తామని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంక టేశ్ తెలిపారు. వాటికి ఎదురుగా వాటిని చూస్తూ సిగ్గుపడుతున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు విగ్రహాన్ని కూడా పెడతామని ఆయన చెప్పారు. వాటిని కూల్చివేసినందుకు కెసిఆర్ విగ్రహం అలా పెడతామని ఆయన అన్నారు. కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహ ఏర్పాటుకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- తెలంగాణ ఉద్యమం పేరుతో రాజధానిలోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న సాహితీ, సాంస్కృతిక రంగాల మహనీయులు, స్వాతంత్య్రోద్యమ నాయకుల విగ్రహాలను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధ్వంసం చేయడం విచార కరమన్నారు. అందుకే ఆ విగ్రహాలను తుంగభద్ర నదీతీరాన నిర్మించే వరద రక్షణ గోడలపై నెలకొల్పుతున్నట్టు చెప్పారు.

Monday, 5 March 2012

కర్నూలు జిల్లా ఉపఎన్నికకు నేతల ఆధిపత్య పోరు

ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజక వర్గంలో ఆది నుంచి గంగుల, భూమా కుంటుంబాల మధ్య ఫ్యాక్షన్, గ్రూపు రాజకీయాలు నడుస్తూన్నాయి. పార్టీల కన్నా గంగుల, భూమా గ్రూపు ఆధిపత్య రాజకీయమే ఆళ్లగడ్డలో కీలకం. అయితే స్థానిక ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి రాజీనామాను రెండురోజుల క్రితం అసెంబ్లీ స్వీకర్ ఆమోదించడంతో ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానంలో ఉపఎన్నికకు తెర లేచింది. దీంతో అందరి దృష్టి ఆళ్లగడ్డవైపు మళ్లింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలతో పాటు స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డిలు కూడా తమ గ్రూపులను ఇప్పటి నుంచే ఉపపోరుకు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా రెండు ప్రధాన గ్రూపుల ఆధిపత్య పోరు మధ్య అధికారుల నలిగిపోతున్నారు. ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధికారులతో సమావేశమై కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, ఆళ్లగడ్డ నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులతో పాటు గ్రామపంచాయితీ నిధులు కూడా తాము సూచించిన వారికే కేటాయించాలని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్న విషయాన్ని ప్రజలకు తెలుపాలన్నదే తమ ఉద్దేశ్యం అని కాంగ్రెస్‌పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి కూడా అన్ని శాఖల అధికారులతో సమావేశమై ప్రభుత్వ నిబంధనలమేరకు ఉపాధి హామీ పనులు చేయాలని సూచించారు. రాజకీయ వత్తిళ్లకు తలవంచి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పరోక్షంగా హెచ్చరిక జారీ చేశారు.

Sunday, 4 March 2012

చంద్రబాబు నన్ను సన్యాసిగా మార్చాడు ....మాజీ మేయర్

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును నమ్మి తాను మోసపోయానంటూ కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య మరోసారి వినూత్న నిరసన తెలిపారు. ఆదివారం బంగి అనంతయ్య సన్యాసి వేషంతో అడుక్కుంటూ తన నిరసన తెలిపారు. చంద్రబాబును నమ్మి తాను మోసపోయానని అన్నారు. ఆయనను నేను పూర్తిగా నమ్మానని, ఆయన మాటలు నమ్మి ఇళ్లు, ప్లాటు అన్ని అమ్ముకున్నానని, అయితే ఆయన మాత్రం నన్ను సన్యాసిగా మార్చారని ఆరోపించారు. ఆయన ఉబ్బిచ్చి ఉబ్బిచ్చి తర్వాత మోసం చేస్తాడని ఆరోపించారు. ఉన్నదంతా అమ్ముకొని సన్యాసిని అయ్యానన్నారు. బాబు వల్లే తాను దివాళా తీశానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన చేతిలో డబ్బులు పోయెనే జేబులు ఖాళీ ఆయెనే అంటూ పాట పాడుతూ రోడ్డెక్కారు. కాగా గతంలో కూడా ఆయన పలుమార్లు బాబు తీరుపై వినూత్నంగా నిరసన తెలిపారు. కొద్ది రోజుల క్రితం బిక్షమెత్తుతూ బాబు వైఖరిని తూర్పార బట్టారు. చంద్రబాబును నమ్ముకుంటే తెలుగు తమ్ముళ్లకు చిప్పే గతి అని ఆయన అన్నారు. ఎన్నో ఏళ్ల నుండి తాను తెలుగుదేశం పార్టీని నమ్ముకొని పని చేస్తున్నానని కానీ తనకు చిప్ప తప్ప ఏమీ మిగలలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం సాక్షిగా బంగి అనంతయ్య భిక్షాటన చేశారు. తనకు కలిసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో జాగ్రత్త బ్రదర్ అంటూ హెచ్చరించారు.

Saturday, 3 March 2012

రాలయసీమ ఎమ్మెల్యేలపై అనర్హత ఆమోదం

ఎట్టకేలకు సభాపతి 'అంతిమ తీర్పు' వెలువడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, దేశ చరిత్రలోనే తొలిసారిగా అధికార పార్టీకి చెందిన 6 మంది ఎమ్మెల్యేలపై మూకుమ్మడిగా అనర్హత వేటు పడింది. 'శోభా నాగిరెడ్డి రాజీనామాకు ఆమోదం... 6 మందిపై వేటు'... ఇది శుక్రవారం రాత్రి పొద్దుపోయాక స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించిన నిర్ణయం. దీంతో... 3 చోట్ల ఉప ఎన్నికల ప్రక్రియ ముగియకముందే, పది జిల్లాల పరిధిలో మరో 17 స్థానాల్లో ఉప సమర వేదిక సిద్ధమైంది. దీంతోపాటు నెల్లూరు లోక్‌సభ స్థానానికీ ఉప ఎన్నిక జరగనుంది.'సెమీ ఫైనల్స్'కు తెరలేచింది. ఖాళీ అయిన స్థానాలకు ఆరు నెలలలోపు ఉప ఎన్నికలు జరగాలి. అంటే... సెప్టెంబర్ 3లోపు ఉపసమరం ముగియాలి. అయితే జూలై 25లోపు రాష్ట్రపతి ఎన్నిక పూర్తి కావాల్సి ఉంది. అందువల్ల ఆలోపే ఉప ఎన్నికలు జరపక తప్పదు.

అనంతపురం జిల్లా

గుర్నాథరెడ్డి (అనంతపురం అర్బన్)
కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం)
కర్నూలు జిల్లా
చెన్నకేశవరెడ్డి (ఎమ్మిగనూరు)
శోభా నాగిరెడ్డి(ఆళ్లగడ్డ)
కడప జిల్లా
అమర్నాథ రెడ్డి (రాజంపేట)
శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి)

Wednesday, 29 February 2012

కెసిఆర్‌కు పోటీ సభ పెడతా... టిజి వెంకటేష్

ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొంటానని మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. అయితే పార్టీ నేతలు వద్దని చెబుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో ఆంధ్ర ప్రజా సమితి పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వస్తే తాను కాంగ్రెసు తరఫున ప్రచారం చేసేందుకు వెళతానని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ బుధవారం చెప్పారు. కెసిఆర్ కొవూరులో ప్రచారం చేస్తే అదే సమయంలో నేను అక్కడ సభను ఏర్పాటు చేస్తానని చెప్పారు. కెసిఆర్ అక్కడ ప్రత్యేక వాదం వినిపిస్తే తాను సమైక్యవాదం వినిపిస్తానని చెప్పారు. ఆయనపై ఎవరూ దాడి చేయకుండా చూస్తానని చెప్పారు. కెసిఆర్ అక్కడ ఏర్పాటు చేసే సభకు ఎక్కువ జనం వస్తే రావొచ్చునని.. అడవి మనుషులను చూసేందుకు కూడా జనం అధికంగా వస్తారని విమర్శించారు.

Saturday, 25 February 2012

కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి అనుచరులు దారుణ హత్య

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్నచింతకుంట గ్రామంలో గత రాత్రి ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి అనుచరుడైన కష్ణారెడ్డి కుటుంబం నిద్రిస్తుండగా ప్రత్యర్థులు కారంపొడి చల్లి వేటకొడవళ్లతో దాడి చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన ఫ్యాక్షన్ హత్యల్లో చనిపోయిన కుటుంబాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమా నాగిరెడి, శోభానాగిరెడ్డిలు పరామర్శించారు. ఆస్తి తగాదాల కారణంగా జరిగిన ఫ్యాక్షన్ .ఈ ఘటనలో కష్ణారెడ్డి (49), అతడి భార్య గోవిందమ్మ( 45), దుబ్బోడు (40) మతి చెందారు. కష్ణారెడ్డి కొడుకు మల్లికార్జునరెడ్డి (23), మామ రామసుబ్బారెడ్డి (60) పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కాగా ఈ ఘటనకు పాతకక్షలు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చింతకుంటలో 144 సెక్షన్‌ను విధించారు.

Friday, 24 February 2012

కర్నూలు జిల్లాలో చిరుతను బంధించిన గ్రామస్థులు

కర్నూలు జిల్లాలో ఓ చిరుత హల్‌చల్‌ చేసింది. ముప్పుతిప్పలు పెట్టి ఎట్టకేలకు గ్రామస్తుల చేతిలో బందీగా మారింది. డోన్‌ మండలం చనుగొడ్ల గ్రామంలో గొర్రెల కోసం వచ్చిన చిరుతను కుక్కలు వెంబడించటంతో భయపడిన చిరుత చెట్టు పైకెక్కింది. ఇది చూసిన గ్రామస్తులు చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు.పారిపోతున్న చిరుతను గ్రామస్తులంతా రాళ్లతో దాడిచేసి ప్రాణాలతో పట్టుకున్నారు. కొనఊపిరితో ఉన్న చిరుతను గ్రామంలో ఊరేగింపు నిర్వహించిన అటవీశాఖ అధికారులకు అప్పగించారు. నెలరోజులుగా చిరుత సంచరిస్తోందని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్తులు చెప్తున్నారు.

Sunday, 19 February 2012

రైతు కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధం....జయప్రకాష్ నారాయణ

లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ రెండో రోజు రైతు సత్యాగ్రహ పాదయాత్రను కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి ప్రారంభించారు. వచ్చేవారం ఆంక్షలు ఉల్లంఘించి ధాన్యాన్ని పొరుగు రాష్ర్టాలకు తరలిస్తామని ఈ సందర్భంగా మాట్లాడిన జయప్రకాష్ నారాయణ తెలిపారు. నిజామాబాద్ నుంచి నాందేడ్, శ్రీకాకుళం నుంచి ఒడిశా, ధర్మపురి నుంచి తమిళనాడుకు తరలిస్తామన్నారు. రైతులు తమ పంట ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోనివ్వకుండా ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 65 ఏళ్ల దుర్మార్గపు పాలనతో నగరం, పల్లెల్లోనూ రైతులు యాచకులుగా మారిపోయారని ఆయన విమర్శించారు.నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం ఆహార ధాన్యాలను ఎక్కడ నుంచి ఎక్కడికైనా తరలించవచ్చని, ఆ విధానం దేశమంతటా అమలవుతున్నా రాష్ట్రప్రభుత్వం మాత్రం రైతుకు సంకెళ్లు వేసిందని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం చేసిన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించడం నేరం కాదా అని ప్రశ్నించారు. పంటలకు లాభసాటి ధర కోసం పోరాడే తనను ధైర్యముంటే అరెస్టుచేయాలని జేపీ కోరారు. ఆంక్షల ఉల్లంఘన పర్యవసానం కూడా తనకు తెలుసునన్నారు. అరెస్టు అయి కేసు నమోదైతే శాసనసభ సభ్యత్వం పోతుందన్నారు. అయినా ప్రస్తుతం తనకు రైతు కష్టాలే ముఖ్యమన్నారు. ఇందుకోసం తాను దేనికైనా సిద్ధమన్నారు. 82 ఏళ్ల క్రితం పూజ్య బాపూజీ ఆంగ్లేయులు వేసిన ఉప్పు పన్నును వ్యతిరేకించి సత్యాగ్రహం చేశారన్నారు. జేపీ చేపట్టిన పాదయాత్రకు అన్నివర్గాల నుంచి విశేష స్పందన లభించింది. పార్టీలకతీతంగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 70ఎద్దుల బండ్లతో ర్యాలీ కూడా నిర్వహించారు.

Saturday, 18 February 2012

న్యూజిలాండ్ క్రికెట్టుకు కర్నూలు బిడ్డ అండ !

కర్నూలుకు చెందిన పాల్ వాల్తాటీ ఐపియల్‌లో సంచలనమే సృష్టించాడు. ఇప్పుడు కర్నూలు జిల్లాకే చెందిన తరుణ్ సాయి నేతుల న్యూజిలాండ్ క్రికెట్‌లో దూసుకొస్తున్నాడు. వెట్టోరీకి ప్రత్యామ్నాయం ఈ యువ క్రికెటరేననే మాట వినిపిస్తోంది. నేతుల 1983 మే 8వ తేదీన కర్నూలులో జన్మించాడు. న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్‌లో అతను సంచలనాలు చేస్తు్నాడు. లెగ్ స్పిన్నర్‌గా న్యూజిలాండ్‌కు ఉన్న స్పిన్నర్ల కొరతను తీర్చడానికి సిద్ధపడుతున్నాడు నేతుల. కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్‌ అతను. అతనికి 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు కుటుంబం న్యూజిలాండ్‌కు మారింది. అతను న్యూజిలాండ్‌లో ఇప్పుడు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. 2008 - 09లో ఫస్ట్ క్లాస్ సీజన్ క్రికెట్‌లో అతను అడుగు పెట్టాడు. అత్యధిక వికెట్లు తీసుకుని ఆక్లాండ్ స్టేట్ చాంఫియన్‌షిప్‌ను అందించాడు. అక్కడ అతనికి సరైన అవకాశాలు రాకపోవడంతో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్‌కు మారాడు. ఇక్కడ అతను అన్ని క్రికెట్ ఫార్మాట్లలో ప్రధానమైన సభ్యుడైపోయాడు. 2012 జింబాబ్వేపై పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం అతను న్యూజిలాండ్ జట్టులోకి వచ్చాడు. జింబాబ్వేతో మూడు మ్యాచుల వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయడం పట్ల తరుణ్ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు తాను ఎప్పుడూ పోటీ పడలేదని, టెస్టు మ్యాచులపైనే దృష్టి పెట్టానని, అందుకే ఆశ్చర్యం వేసిందని అతను అన్నాడు. లెగ్ స్పిన్నర్‌గా అనతు ఈ నెల 6వ తేదీన తన కెరీర్‌ను అతను ప్రారంభించాడు. తరుణ్‌కు ముందు భారత సంతతికి చెందిన దీపక్ పాటిల్, జీతన్ పాటిల్ న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించారు. వెట్టోరీ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న ప్రస్తుత స్థితిలో తరుణ్ న్యూజిలాండ్‌కు అంది వచ్చిన అవకాశంగా భావిస్తున్నారు.

కర్నూలులో జేపీ సత్యగ్రహ పాదయాత్ర ప్రారంభం

లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ శనివారం కర్నూలు జిల్లాలో రైతు సత్యగ్రహ పాదయాత్రను చేపట్టారు. ఆయన ఎమ్మిగనూరు నుంచి యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర రాయచూరు వరకూ కొనసాగనుంది. జయప్రకాష్ నారాయణ ఎమ్మిగనూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  అంతకు ముందు నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రార్థనలు చేశారు.  ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ సంకెళ్లతో బస్తాలు మోసి తన నిరనస తెలిపారు.ఎక్కడ పండిన పంటను అక్కడే అమ్ముకునే అవకాశం రైతులకు ఉండాలని ఆయన అన్నారు. పండించిన పంటను అమ్ముకోవడానికి ఆంక్షలు పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసిన పాపాల వల్ల రెండేళ్లలో ఎరువుల ధఱలు రెండింతలు పెరిగాయని ఆయన విమర్శించారు. గిట్టుబాటు ధరలు సగానికి పడిపోయాయని ఆయన అన్నారు. రైతుల కోసం జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. రైతుల కోసం ఎవరు మద్దతిచ్చినా తీసుకుంటానని ఆయన చెప్పారు. తన యాత్రను తెలుగుదేశంశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి రైతు పోరుబాటతో పోల్చుకోలేనని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎక్కడ పండిన పంటను అక్కడే అమ్ముకునే అవకాశం ఉండాలన్నారు. పండించిన పంటను అమ్ముకోవటానికి ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం చేసిన పాపాల వల్ల రెండేళ్లలో ఎరువుల ధరలు రెండింతలు పెరిగాయన్నారు. గిట్టుబాటు ధరలు సగానికి పడిపోయాయని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. జేపీ యాత్రకు కాంగ్రెస్ నేత రుద్రగౌడ్ మద్దతు తెలిపారు

Sunday, 12 February 2012

కర్నూలు ఘంటసాలకు సాటిలేరు...: టీజీ వెంకటేష్

కర్నూలు ఘంటసాలకు ఎవరూ సాటిరారని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. శనివారం రాత్రి కలెక్టర్‌లోని సునయన ఆ డిటోరియంలో ఉపాధ్యాయుడు చం ద్రకంటి మద్దయ్య ఆధ్వర్యంలో డ్రీ మ్స్ ఇండియా సంస్థ ఘంటసాల వ ర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి టీజీ వెంకటేష్ మాట్లాడుతూ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు స్వాతంత్య్ర సమరయోధుడని కొనియాడారు. ఆయన 1943 ప్రాంతం లో ఆలూరుకు వచ్చి తన దేశ భక్తిని చాటారని వివరించారు. పేద కుటుంబంలో పుట్టిన ఘంటసాల తండ్రి ఆ శయం కోసం ఎంతగానో పరితపించారన్నారు. మహానుభావుల వర్ధంతి స భలను నిర్వహించేందుకు తన వంతు సహాయం అందిస్తానన్నారు. ఉపాధ్యాయుడైన చంద్రకంటి చేస్తున్న ప్రజా జాగృతి కార్యక్రమాలను ఆ యన ప్రశంసించారు. ఘంటసాలకు సంబంధించి అయిదు వేల పాట కచేరిలు నిర్వహించిన డీఏ మిత్ర, గా యని పద్మావతి, సుధారాణి, ఇబ్ర హీం తదితరులు తమ గీతాలతో ఆ హూతులను అలరించారు. ప్రముఖ నాయకుడు లక్క సాగరం లక్ష్మీరెడ్డి కా ర్యక్రమానికి హాజరై ఘంటసాల గు రించి మాట్లాడారు. అనంతరం కళాకారులను, కళా పోషకులను జ్ఞాపికల తో సత్కరించారు. రాత్రి ఆరు గంటల నుంచి ప్రారంభమైన ఘంటసాల మధుర గీతాలాపన అర్ధరాత్రి వరకు సాగింది. ఘంటసాల విగ్రహావిష్కరణ : నగరంలోని చిల్డ్రన్స్ పార్కు దగ్గర ప్రముఖ సినీ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహాన్ని మంత్రి టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఘంటసాల భగద్గీతను పాడి ప్రజలందరికీ బహుమతిగా ఇచ్చారని తెలిపారు.

Wednesday, 8 February 2012

కర్నూలు జిల్లాలో కేడీసీసీ బ్యాంకు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

కేడీసీసీ బ్యాంకు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఈ నెల 13, 14, 15వ తేదీల్లో కర్నూలులో జర గనున్నాయి. ముంబై కేంద్రంగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఆధ్వర్యంలో ఫైనల్ ఎంపిక జాబితా వెలువడనుం ది. ఈ మే రకు జిల్లాలోని 36 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు రాతపరీక్షలు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలకు అర్హ త సాధించిన వారి జాబితా కేడీసీసీ బ్యాంకు అధికారులకు పంపించింది. మొత్తం 146 మందికి లేఖలు పంపినట్టు అధికార వర్గాల సమాచారం. ఇంటర్వ్యూలో త్రిసభ్య కమిటీ..కేడీసీసీ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ల ఉద్యోగాలకు త్రిసభ్య కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. చైర్మన్‌గా కాతా అంకిరెడ్డి, సభ్యులు గా జీఎం మరియు సీఈవో మోహన్‌రె డ్డి, నా బార్డు డీడీఎం శ్రీవత్స వ్యవహరించనున్నారు.మెరిట్‌కే పట్టం.. ఎంపికలో ఎలాంటి అవకతవకలుండవని కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కాతా అంకిరెడ్డి అన్నారు. రాత పరీక్షలో ఇంటర్వ్యూకు ఎంపికైన వారి జా బితా మాత్రమే తమకు పంపించారని, మార్కు లు పంపలేదని వివరించారు. ఇంటర్వ్యూలో త్రి సభ్య కమిటీ 5 మార్కులను నిర్ణయిస్తుందన్నా రు. అర్హత పరిశీలనలో డిగ్రీలో 75 శాతం మా ర్కులు దాటిన వారికి మెరిట్ ప్రకారం 5 మార్కు లుండగా.. కంప్యూటర్ పరిజ్ఞానానికి 5 మార్కులుంటాయని చెప్పారు. బ్యాంకింగ్, మార్కెటింగ్, వ్యవసాయ రంగ అనుభవాలకు ఏడాదికి రెండు మార్కుల చొప్పున 5 సంవత్సరాలకు 10 మార్కులు ఇస్తారన్నారు.మార్కుల విధానం ఇలా.. కేడీసీసీ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఎంపికకు మొత్తం మార్కులు 200. అందులో రాత పరీక్షకు 175 మార్కులుంటాయి. ఈ జవాబు పత్రాల మూల్యాంకనం ముంబై బ్యాంకింగ్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది.

Saturday, 28 January 2012

నందికొట్కూరు నగర పాలక సంస్థ కార్యాలయానికి విద్యుత్ కట్

ఇటీవలే నగర పాలిక సంస్థగా మారిన నందికొట్కూరు మేజర్ పంచాయతీ విద్యుత్ శాఖకు భారీగా బకాయి పడింది. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో నందికొట్కూరు పరిధిలోని వీధిలైట్లకు విద్యుత్ కట్ చేయనున్నట్లు ఆ శాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది. బకాయిలు భారీగా ఉన్నాయని ఇచ్చిన నోటీసులకు స్పందన లేకపోవడంతో మొదటి దశలో అప్పటి పంచాయతీ ఇప్పటికీ నగర పాలక సంస్థ కార్యాలయానికి విద్యుత్‌ను  తొలగించారు. నందికొట్కూరు గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో సుమారు రూ.కోటి బకాయి ఉందని ట్రాన్స్‌కో ఎడిఎ శ్రీనివాసులు తెలిపారు. బకాయిలు గత 15 నెలలుగా బకాయిలు పేరుకుపోయాయన్నారు. నీటి పథకాలు, విద్యుత్ దీపాలు వినియోగించి బకాయిలు చెల్లించకపోవడంతో నోటీసులు ఇచ్చామన్నారు. అయితే స్పందన లేకపోవడంతో కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపి వేశామన్నారు. నగర పంచాయతీగా మారిన తరువాత సైతం మునిసిపల్ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చామని ఆయన తెలిపారు. అయితే స్పందించకపోయిన కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. బకాయిలు త్వరగా చెల్లించని పక్షంలో వీధి దీపాలకు కూడా విద్యుత్ సరఫరా నిలిపి వేయాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. విద్యుత్ బకాయిలు చెల్లించడంలో అధికారులు సమన్వయంతో వ్యవహరించి బకాయిలను చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పట్టణ వీధుల్లో చీకట్లు కమ్ముకుంటాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహించడం, అవినీతికి పాల్పడటం వంటి కారణాల వల్లే బకాయిలు పేరుకుపోయాయని ప్రజలు పేర్కొంటున్నారు. ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకొని బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.

Saturday, 21 January 2012

ఎల్లప్పుడు మా కుటుంబం కార్యకర్తల కోసం..భూమా

కార్యకర్తల కోసం మా కుటుంబం ఎల్లప్పుడు పాటు పడుతుంటూనే ఉంటుందని భూమా దంపతులు అన్నారు.  పట్టణంలోని భూమా స్వగృహంలో శిరివెళ్ళ మండలం నుండి భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు భూమా దంపతులకు మద్దతు తెలిపేందుకు ఆళ్లగడ్డ పట్టణానికి వచ్చి వారిని కలిశారు. ఈ సందర్భంగా భూమా దంపతులు మాట్లాడుతూ ఈ రోజు మామీద అభిమానంతో ఇంత మంది ఎంతో సంతోషంగా ఉందన్నారు. మీరు చూపించే ఆదరాభిమానాలు చాలా గొప్పవని అన్నారు. నా పుట్టిన రోజు సందర్భంగా శిరివెళ్ళలో మీరు చూపించిన ప్రేమ నేను మరచి పోనని భూమా అన్నారు. పార్టీ అభివృద్ధిపై మీరు బాధ్యత తీసుకోవాలన్నారు. పదవి ఉన్న, లేకపోయిన ప్రజలకు అండగా ఉంటామని వారు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో వైఎస్సార్ పార్టీకి సంఘీభావంగా ఇక్కడికి రావడం ఆనందంగా ఉందన్నారు. అందుకు మీకు అండగా ఉంటామని ముస్లిం సోదరులకు భూమా దంపతులు హామీనిచ్చారు. ఓట్లు మఖ్యం కాదని ప్రజల ఆదరాభిమానాలు ముఖ్యమని వారి అండే మాకు కొండంత అండని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో శిరివెళ్ళ మండలానికి చెందిన ఖాజాహుస్సేన్, అబ్దులుఖదుర్సు, చాంద్‌భీ, సలాం, నబీరసూల్‌తో పాటు మరో 200 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో వై ఎస్సార్సీ నాయకులు బివి.రామిరెడ్డి, భూమా వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 విగ్రహాలపై చెయ్యేస్తే రాజకీయ సమాధి
 మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల మీద చేయి పెడితే రాష్ట్ర ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రాజకీయ సమాధి కడతారని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. ఈ రోజు ఇక్కడ జరిగిన వార్డుబాట కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మామను వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారని ఆరోపించారు. ఎన్‌టీఆర్ చనిపోయి 16 సంవత్సరాలు కావస్తున్నా తన సొంత ఊరు నారావారిపల్లెలో ఆయన విగ్రహం పెట్టించాలనే ఆలోచన కూడా చంద్రబాబుకు రాలేదన్నారు. అన్న తీరు నచ్చక ఆయన తమ్ముడు రామ్మూర్తినాయుడు ఎన్‌టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయించారన్నారు. ప్రజల గుండెల్లో దేవుడిలా కొలువైన వైఎస్ రాజశేఖరరెడ్డిని వారి గుండెల నుంచి చెరిపేసేందుకు చంద్రబాబు నానా రకాల పాట్లు పడుతున్నారని విమర్శించారు.

Wednesday, 18 January 2012

నా రాజీనామాను ఆమోదించండి...ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి

ఎమ్మెల్యే పదవికి తాను సమర్పించిన రాజీనామాను ఆమోదించాలని భూమా శోభా నాగిరెడ్డి స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. తన రాజీనామాను సాంకేతిక కోణంలో చూడకుండా విలువలకు కట్టుబడి ఆమోదించాలని ఆమె కోరారు. అసలు ప్రజారాజ్యం పార్టీయే మనుగడలో లేనపుడు విప్ ధిక్కారానికి సంబంధించి వారిచ్చిన అనర్హత నోటీసుకు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్వయంగా కాంగ్రెస్‌లో చేరిపోయి అక్కడ సమన్వయ కమిటీ సభ్యుడుగా నియమితులయ్యారనీ అలాంటపుడు ప్రజారాజ్యం ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. ఇంకా తాను పీఆర్పీ అధ్యక్షుడుగా ఉన్నానని చిరంజీవి చెబితే తాను తప్పకుండా ఆయన వద్దకు వెళ్లి వివరణ ఇస్తానని ఆమె ఎద్దేవా చేశారు. తనపై ఉన్న కేసులను ఎత్తివేస్తే కాంగ్రెస్‌లో చేరడానికి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించినపుడు శోభ తప్పు పట్టారు. తన అక్రమాస్తులు, అవినీతిపై విచారణ జరక్కుండా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్న చంద్రబాబుకు మరొకరి అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు, కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారనీ ఆయన అసెంబ్లీలో అవిశ్వాసతీర్మానం పెట్టింది కూడా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కానే కాదనీ కేవలం జగన్‌ను సమర్థించే ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టడానికేనని ఆమె అన్నారు. చంద్రబాబుకు రైతుల పట్ల ఏ మాత్రం ప్రేమ లేదననాడికి ఆయన తొమ్మిదేళ్ల పాలనలో చేసిన నిర్వాకమే నిదర్శనమని శోభ గుర్తు చేశారు. చంద్రబాబుకు, కాంగ్రెస్‌కు ధైర్యం ఉంటే తాజాగా అందరమూ కలిసి ఎన్నికలకు పోదాం సిద్ధం కావాలని ఆమె సవాలు విసిరారు. ఇప్పటికే రెండు సార్లు ప్రజల తిరస్కారానికి గురైన చంద్రబాబుకు మళ్లీ అదే అనుభవం ఎదురవుతుందని ఆమె జోస్యం చెప్పారు.

Sunday, 8 January 2012

సీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి

రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్యాకెజీ ఇవ్వాలని ఐఎన్‌టియుసి రాష్ట్ర అధ్యక్షులు రాఘవరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే సమగ్రాభివృద్ధి సాధ్యవౌతుందన్నారు.  కర్నూలు నగరంలోని నేతాజీ కాంప్లెక్స్ సెంటర్‌లో ఐఎన్‌టియుసి జిల్లా, నగర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాఘవరాజు మాట్లాడుతూ సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోనియాగాంధీ ఆలోచన విధానాలకు అనుగుణంగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని అన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం ఖాయిలాపడ్డ చక్కెర కార్మాగారాలు, వివిధ పరిశ్రమల పునరుద్ధరణకు 740 కోట్ల రుణ సదుపాయాన్ని కల్పించడం హర్షణీయమన్నారు. కార్మికులు, పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టాన్ని అమలులోకి తెస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. ఐఎన్‌టియుసి యూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు విశ్వశాస్ర్తీ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఐఎన్‌టియూసిని బలోపేతం చేసి కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా సభ్యులు పని చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా ఐఎన్‌టియుసి అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చేనత కార్మికులకు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఐఎన్‌టియుసి అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని మున్సిపాలిటీ ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో యూనియన్‌ను విస్తరించి కార్మిక రంగానికి, అభివృద్ధికి అండగా నిలుస్తామన్నారు. నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షులు రాఘవరాజు ప్రకటిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేశారు

నేడు శ్రీశైలం మల్లన్న వార్షిక ఆరుద్రోత్సవం

పరమశివుని జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి శ్రీమల్లికార్జున స్వామికి వార్షిక ఆరుద్రోత్సవ  నిర్వహిస్తున్నట్లు  ఈఓ హనుమంతరావు  తెలిపారు. ఈ ఉత్సవంలో భాగంగా ఆదివారం రాత్రి 10.30 గంటలకు స్వామివార్లకు లింగోద్భవకాల, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అన్నాభిషేకం, 9వ తేదీ సోమవారం స్వామివార్ల ప్రాతఃకాల పూజలనంతరం 5.30 గంటలకు ఉత్తరద్వార దర్శనం ఉంటుందన్నారు. అనంతరం 6 గంటలకు స్వామి అమ్మవార్లను నంది వాహనంపై వేంచేయించి పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారని తెలిపారు. సోమవారం వేకువజామున 3.30 గంటలకు ఆలయ ఉత్తరద్వారమైన శివాజీ గోపురాన్ని తెరచి 4 గంటలకు సుప్రభాతసేవ, 5 గంటలకు మహామంగ ళహారతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వార్షిక ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం వేకువజామున జరిగే సుప్రభాత, మహామంగళహారతి సేవా టికెట్లను నిలుపుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి ఉత్సవంలో ఆలయ మహాద్వారమైన కృష్ణదేవరాయ గోపురం (తూర్పుద్వారం) మీదుగా గ్రామోత్సవానికి తరలివేళ్లే స్వామివారు ధనుర్మాసంలో వచ్చే ముక్కొటిఏకాదశి, వార్షిక ఆరుద్రోత్సవం రోజులలో మాత్రమే ఉత్తరద్వారం గుండా తరలి వెళ్లడం విశేషమన్నారు. స్వామివార్ల ప్రాతఃకాల ఉత్తర ద్వార దర్శనానంతరం 6 గంటలకు తూర్పుద్వారమైన శ్రీకృష్ణదేవరాయ రాజగోపురద్వారాలను తెరచి భక్తులకు దర్శన, ఆర్జితసేవలకు అనుమతిస్తున్నట్లు ఈఓ పేర్కొన్నారు

Monday, 2 January 2012

కర్నూలు జిల్లా ఉప ఎన్నికల అభ్యర్థులపై పార్టీల కసరత్తు!

 జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు నేపధ్యంలో ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆయా పార్టీల నాయకులు తమ వంతు ప్రయ త్నాలు ముమ్మరం చేశారు. ఇదే సమయంలో ఆయా పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డిపై అనర్హత వేటు వేసినా, రాజీనామా ఆమోదించినా ఉప ఎన్నికలు ఖాయం కావడంతో ఆ దిశగా రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఆళ్లగడ్డ బరిలో వైఎస్సార్ కాంగ్రెస్ తరపున భూమా దంపతుల్లో ఒకరు పోటీ చేయడం ఖాయం కాగా తెలుగుదేశం తరపున ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఇరిగెల రామపుల్లారెడ్డి పేరును ఖరారు చేశారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు గంగుల సోదరులు సిద్ధపడుతున్నారు. గంగుల ప్రతాప రెడ్డి తనకు పార్లమెంటుకు పోటీ చేయడమే ఇష్టమని ఉప ఎన్నికల బరిలో తన సోదరుడు గంగుల ప్రభాకర రెడ్డి ఉంటారని తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు సమాచారం. అయితే పార్టీ రాష్ట్ర నాయకులు మాత్రం గంగుల ప్రతాప రెడ్డి బరిలోకి దిగి విజయం సాధించి వస్తే మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు అవకాశం ఉన్నట్లు సమాచారం అందించారని వార్తలు వస్తున్నాయి. ఇక ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి బరిలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టిడిపి తరపున మాజీ మంత్రి బివి మోహన రెడ్డి రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ తరపున రుద్రగౌడు పేరు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నా అభ్యర్థి పేరు ఖరారు చేసే సమయానికి మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. ఇక ఈ రెండు స్థానాలతో పాటు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై టిడిపి చేసిన ఫిర్యాదు మేరకు స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది. ఈ విషయంలో బాలపై వేటు ఖాయమని టిడిపి వర్గాలు ఆశతో ఉన్నా కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వేటు పడకపోవచ్చని పేర్కొంటున్నారు. దాంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఉప ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తున్న ఎమ్మిగనూరులో విజయం ఖాయమని టిడిపి ధీమాతో ఉండగా కాంగ్రెస్ పార్టీ ఆళ్లగడ్డ స్థానంపై విశ్వాసంతో ఉంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆళ్లగడ్డపై ధీమాగా ఉన్నప్పటికీ ఎమ్మిగనూరు విషయంలో వారికి కొంత అనుమానం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయానికి అక్కడ ఉన్న లోపాలను సరిదిద్దుకొని బరిలోకి దిగితే విజయం వరిస్తుందన్న నమ్మకం కూడా ఉంది

Friday, 30 December 2011

శ్రీశైలంలో డిజిటల్ విద్యాభ్యాసం

శ్రీశైల ప్రాజెక్ట్ కాలనీలో విద్యార్థుల కోసం అధునాతన బోధనా పద్దతిలో భాగంగా డిజిటల్ బోర్డు ద్వారా విద్యాబోధనను పాఠ్యాంశాలగా బోధించేందుకు  మధ్యాహ్నం జెన్‌కో ఛీప్ ఇంజనీరు లక్ష్మినారాయణ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. స్థానిక డిఎవి ఉన్నత పాఠశాలలో అన్ని తరగతులకు డిజిటల్ తరగతులను నిర్వహించేందుకు ప్రధానోపాధ్యాయులు సతీష్ చంద్ర కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా పోటీ ప్రపంచంలో అంచెలంచెలుగా పెరుగుతున్న బోధనాపద్దతులకు ధీటుగా మా విద్యార్థులకు కూడా మెరుగైన విద్యను అందించేందుకు ఈ డిజిటల్ బోర్డుల ద్వారా విద్యను బోధించేందుకు రంగం సిద్ధం చేశామని ఆయన అన్నారు. ఈసందర్భంగా జెన్‌కో సిఇ మాట్లాడుతూ ఈ పద్దతుల ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకుని తెలివితేటలను మెరుగుపరుచుకుని తద్వారా ఉత్తీర్ణతాశాతాన్ని పెంచుకోవచ్చని దాని ద్వారా పాఠ్యాంశాలపై మంచి పట్టును కూడా సాధించవచ్చునని ఈ కార్యక్రమంలో జెన్‌కో రైట్ బ్యాంక్ సూపరింటెండింగ్ ఇంజనీరు రాంబాబు, ఇఇలు రవీంద్ర, డిఇలు సత్యసాయిబాబా, శ్రీనివాసులు, ఎడిఇ రామకృష్ణారెడ్డి, అకౌంట్ అధికారులు ఎమ్‌ఎస్‌ఆర్‌కె శర్మ, శ్రీ్ధర్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా శ్రీశైలంలో ఆర్జిత సేవలు రద్దు

ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రం, అష్టాదశ శక్తి పీఠమైన శ్రీశైల దేవస్థానంలో కొలువున్న శ్రీ భ్రమరాంబిక, మల్లిఖార్జునస్వామి దేవస్థానంలో రానున్న నూతన సంవత్సర సందర్భంగా ఆదివారం రోజున శ్రీశైల దేవస్ధానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహణాధికారి వి హనుమంతరావు తెలిపారు. నూతన సంవత్సరంలో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారనే ముందస్తు జాగ్రత్త చర్యగా ఆరోజున అన్ని ఆర్జిత సేవలను రద్దుచేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. శాశ్వత కల్యాణాలు త ఉన్నా భక్తులు యధావిధిగా కల్యాణాలు నిర్వహించబడతాయని అంతేకాక ఆ రోజున ఆలయ వేలాలలో కూడా మార్పులు చేయనున్నారు. వేకువ జాముననే 3:30 గంటలకు ఆలయద్వారాలు తెరచి మంగళవాయిద్యాలు 4గంటలకు సుప్రభాత సేవ, 4:30గంటలకు మహామంగళహారతి నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు.