
ఇండోర్‌లో భారత క్రికెట్ అభిమానులు ఆనందపారవశ్యంలో తేలియాడారు. ప్రత్యర్థి
నుంచి వస్తున్న ఒక్కొక్క బంతిని వీరేంద్ర సేహ్వాగ్ కొడుతుంటే వారి
ఆనందానికి అవధులు లేవు. గురువారంనాడు ఇండోర్ స్టేడియంలో పరుగులు వరదలై
పారింది. ఇండియా 418 పరుగులతో తన పాత రికార్డును తిరగరాస్తే,
సేహ్వాగ్ 219 పరుగులతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. వీరూ 25 బౌండరీలు, 7
సిక్సర్‌లతో అభిమానులను అలరించాడు. వీరూ ఔట్ అయినప్పుడు ప్రత్యర్థి అయిన
వెస్ట్ ఇండీస్ క్రికెటర్లు ప్రతి ఒక్కరూ సేహ్వాగ్ దగ్గరకు వచ్చి అభినందించి
మంచి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు.
భారత బ్యాట్స్‌మెన్ చెప్పినట్టు ప్రతి బంతి బౌండరీ వైపు పరుగు తీసింది.
భారత కెప్టెన్ వీరేంద్ర సేహ్వాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వన్ డే లలో
టాప్ ఆర్డర్ ముందే కుప్ప కూలిపోతున్నదని సర్వత్రా విమర్శలు వినవస్తున్న
సమయంలో సేహ్వాగ్ కెప్టెన్ అంటే ఇలా ఆడాలి అన్నట్టు ఆడి సునాయాసంగా 219
రికార్డు పరుగులు సాధించాడు. ఒన్ డే క్రికెట్‌లో ఇప్పటివరకూ సచిన్
టెండూల్కర్ పేర అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా రికార్డు ఉంది. ఆ
రికార్డును సేహ్వాగ్ తిరగరాశాడు.
ఇండియా గతంలో సాదించిన రికార్డు 414 పరుగులు కాగా, ఈ మ్యాచ్‌లో భారత యువ
క్రికెటర్లు మరో నాలుగు పరుగులు సాధించి ఇండియాకు అత్యధిక పరుగుల రికార్డు
సాధించారు. దీంతో ఇండియా మొత్తం నాలుగు సార్లు ఒన్ డేలలో నాలుగు సార్లు 400
పైన పరుగులు సాధించినట్టయ్యింది. ఇంతకుముందు దక్షిణాఫ్రికా, శ్రీలంక
మాత్రమే ఒన్ డే లలో రెండు సార్లు 400 పరుగులు పైన సాధించాయి.