Showing posts with label రామ్ గోపాల్ వర్మ. Show all posts
Showing posts with label రామ్ గోపాల్ వర్మ. Show all posts

Friday, 9 March 2012

జూ.ఎన్టీఆర్ పై కేసు వేస్తా....రామ్ గోపాల్ వర్మ

ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండే రామ్ గోపాల్ వర్మ తాజాగా పూజారులపై కామెంట్స్ చేసి వివాదం క్రియేట్ చేసారు. ఆ వివాదాన్ని టీవి ఛానెల్స్ పెద్దది చేయటంతో వర్మ తన ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ అదుర్స్ చిత్రాన్ని కూడా లాగారు. ఆయన ట్వీట్ లో...నా పూజారుల మీద కామెంట్ల కంటే జూఎన్టీఆర్ అదుర్స్ లో చేసింది ఎక్కువ కానీ తను స్టార్ కనుక నేను ప్లాప్ డైరక్టర్ కనుక పూజారులు నన్ను టార్గెట్ చేస్తున్నారు.ఈ విషయం మీద నేను జూ.ఎన్టీఆర్ మీద,పూజారుల మీద,ఎండోమెంట్స్ డిపార్టమెంట్ మీద కంప్లైంట్ ఇస్తా పూజారుల మీద జూ.ఎన్టీఆర్ కి నాకు మధ్య సెలక్టివ్ డిస్క్రిమినేషన్ నేరం క్రింద కేసు పెడతా.నేను ట్వీట్స్ లో రాసినందుకీ జూ.ఎన్టీఆర్ అదుర్స్ లో చేసినందుకీ కంపేర్ చేస్తే ఏ మూర్కుడుకైనా నేను చెప్పింది అర్దమవుతుంది .అంటూ ట్వీట్ చేసారు. ఇక వర్మ ప్రస్తుతం చేస్తానంటున్న రెడ్డి గారు పోయారు వివాదం మరలించటానికే ఈ కొత్త వివాదాన్ని ఎత్తుకున్నాడని పరిశీలకులు అంటున్నారు. మీడియా సపోర్టుతో ఈ వివాదాన్ని పెద్దది చేసి ఆ వివాదాన్ని మర్చిపోయేలా చేయాలని ఆయన ఆలోచనగా చెప్తున్నారు. అందుకనే ఎన్టీఆర్ ని కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారని చెప్తున్నారు.

Saturday, 3 March 2012

దగ్గుబాటి రాణాతో రామ్ గోపాల్ వర్మ సినిమా

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కొత్త సినిమా ప్రకటించారు. దగ్గుబాటి రాణా-నతాలియా జంటగా సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందనుందని, అతి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం వర్మ బాలీవుడ్ లో రూపొందిస్తున్న ‘డిపార్ట్‌మెంట్’ చిత్రంలో బ్రెజిల్ భామ నతాలియా ఐటం సాంగులో నటిస్తోంది. ఇంతకు ముందు వర్మ నతాలియా అందచందాల గురించి తెగ పొగిడేసిన విషయం తెలిసిందే. నతాలియా లాంటి అందాన్ని నేను నా సినీ కెరీర్లో ఇదివరకెప్పుడూ చూడలేదని, ఆమె అందం చూసి పిచ్చిక్కిపోతోందని......హింసాత్మక ఘటన నేపథ్యంలో రక్తచరిత్ర సినిమా రూపొందించినట్లుగా, ఆమె ‘అందం’ గురించి అంతా చర్చించుకునేట్లుగా ఓ సినిమా తీయనున్నట్లు కూడా ప్రకటించారు వర్మ. మరి ఈ సినిమా...రాణా-నతాలియా జంటగా తీయబోయే సినిమా ఒకటేనా? అనేది తేలాల్సి ఉంది. వర్మ ఇప్పటి వరకు బోలెడు కొత్త సినిమాలు ప్రకటించారు. అందులో ఆచరణ వరకు వచ్చినవి చాలా తక్కవ. మరి ఈ సినిమాల సంగతేమిటో కాలమే నిర్ణయించాలి.

Friday, 2 March 2012

రామ్ గోపాల్ వర్మ వార్నింగ్..!

వివాదాస్సద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘రెడ్డి గారు పోయారు’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలతో రాజకీయ కోణాన్ని టచ్ చేస్తూ ఈ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించి సంచలనానికి తెరలేపారు ఈ దర్శకుడు. వర్మ ఈ టైటిల్ ప్రకటించిందే ఆలస్యం....‘రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్’ నుంచి వార్నింగ్ కూడా వచ్చింది. వెంటనే టైటిల్ మార్చాలని హెచ్చరించారు. వైఎస్‌ఆర్ అభిమానుల నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వర్మ దిగొచ్చినట్లే కనిపిస్తున్నాడు. ఈ చిత్రం టైటిల్ ను ‘రెడ్డి గారు పోయారు’అని కాకుండా ‘ఆయన పోయారు’గా మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా...టైటిల్ మార్చాలని వచ్చిన హెచ్చరికలపై వర్మ ట్విట్టర్లో తనదైన రీతిలో స్పందించారు. ‘రెడ్డి గారు పోయారు టైటిల్ మీద ఎందుకు ప్రాబ్లమో? అర్థం కావడం లేదు. వాళ్ల ప్రాబ్లం రెడ్డి గారు పోలేదనా? లేక రెడ్లెవరూ పోరనా?’’ అని వ్యాఖ్యానించారు. వర్మ వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరినట్లయింది. అయితే వైఎస్‌ఆర్ అభిమానులు తన బెండు తీస్తారని గ్రహించిన వర్మ టైటిల్ మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Wednesday, 14 December 2011

2008 నవంబర్ 26న ముంబై ఘటనపై వర్మ సినిమా

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసంచలన సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నాడు. 2008 నవంబర్ 26న ముంబై మహా నగరంపై జరిగిన ముష్కర దాడిని సినిమా రూపంలోకి తేవడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆ సినిమా పేరు ‘26/11’ నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఈ సినిమా గురించి వర్మ మాట్లాడుతూ...‘‘26/11 సంఘటన ఏ భారతీయుడు మరిచిపోని రోజు...అప్పుడు ఉగ్రవాదులు జరిపిన దాడిని లైవ్ టెలికాస్ట్ చూసిన వారి కళ్లలో ఆ సంఘటన ఇప్పటికీ మెదలుతూనే ఉంది. అప్పుడు జరిగిన నరమేధం ఎన్నటికీ మరిచిపోనిది. నా కెరియర్ లోనే ఒక చాలెంజ్ గా తీసుకుని ఈ సినిమా తెరకెక్కించబోతున్నాను’’ అని చెప్పారు. కసబ్ మరియు అతని టీం సభ్యులు ముంబైకి ఎలా వచ్చారు అమర్ సింగ్ సోలంకి మరియు ఇతర పోలీసు సిబ్బంది పరిస్థితిని ఎలా కంట్రోల్ చేసారు వంటి అంశాలు చూపించబోతున్నట్లు చెప్పారు. నూతన నటీ నటులతో త్వరలోనే ఈ సినిమా ప్రారంభించాబోతున్నట్లు హిందీ మరియు ఆంగ్ల భాషల్లో తీయబోతున్నట్లు చెప్పారు.ముష్కర దాడులు జరిగిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, అతని కొడుకు రితేష్ దేష్ ముఖ్ తో కలిసి దాడికి గురైన తాజ్ హోటల్‌ను వర్మ సందర్శించారు. అప్పట్లోనే వర్మ ఈ ఘటనపై సినిమా తీస్తున్నట్లు, అందులో రితేష్ దేశ్ ముఖ్ హీరోగా నటింపచేయాలనే ఉద్దేశ్యంతోనే అతన్ని వెంట తీసుకుని సంఘటన స్థలానికి వెళ్లాడని మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అప్పుడు ఆ వార్తలను ఖండించిన వర్మ...తాజాగా ఆ ఘటనపై సినిమా తీయాలని నిర్ణయించుకోవడం గమనార్హం.

Thursday, 8 December 2011

డర్టి పిక్చర్ పై రామ్ గోపాల్ వర్మ కామెంట్

విద్యాబాలన్ ప్రధాన పాత్రలో ఏక్తా కపూర్ రూపొందించిన డర్టీపిక్చర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ...డర్టీ పిక్చర్ ని ఫ్యామిలీలు కూడా చూసేలా రూపొందించినందుకు ఫ్యామిలీ క్వీన్ ఏక్తాకు కుదాస్ అంటూ మెచ్చుకున్నారు. అలాగే అన్ని కుటుంబాలకి మనస్సు లోపల అంతర్గతంగా డర్టీ అనేది ఉంటుందని చాలా కాలంగా నా మనస్సులో అనుమానం ఉండేది. అది నిజమేనని ఏక్తా ప్రూవ్ చేసింది అని ట్వీట్ చేసారు. ఇక విద్యాబాలన్,నసీరుద్దీన్ షా కాంబినేషన్ లో వచ్చిన డర్టీ పిక్చర్ మొన్న శుక్రవారం దేశమంతటా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే టైటిల్ తో విడుదల చేసారు. సిల్మ్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 21 కోట్ల బడ్జెట్ తో ఏక్తా కపూర్ నిర్మించింది. మిలింద్ లూద్రియా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఓపినింగ్స్ బాగానే తెచ్చుకోలగలిగింది. అలాగే దేశం మొత్తం మీద హిందీ వెర్షన్ కి శుక్రవారం 9.5 కోట్లు,శనివారం 10.7 కోట్లు,ఆదివారం 12.3 కోట్లు వసూలు చేసింది.