Showing posts with label కడప కలెక్టరేట్. Show all posts
Showing posts with label కడప కలెక్టరేట్. Show all posts

Thursday, 8 December 2011

కడప జిల్లాకు త్వరలో కేంద్ర కరవు బృందం ...కలెక్టర్

కరవు బృందం జిల్లాలో పర్యటించే ఆస్కారం ఉన్నందున అధికారులు సంబంధిత నివేదికలను రూపొం దించుకుని సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వి.అనిల్‌కుమార్ అధికారులకు సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ తన కార్యాలయంలోని చాంబర్‌లో కేంద్ర కరవు బృందం జిల్లా పర్యటనపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నిర్మల, డీఆర్వో హేమసాగర్, సీపీవో గురప్ప, వ్యవసాయశాఖ జేడీ రామస్వామిరెడ్డి, పశు సంవర్ధకశాఖ జేడీ డాక్టర్ మోహన్‌రావు, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర కరవు బృందం పర్యటనకై సీపీవో, జేడీ, అగ్రికల్చర్ జేడీ, అనిమల్ అజ్బెండరీ, డ్వామా పీడీ బృందంగా ఏర్పడి క్షేత్ర పర్యటన జరిపి రూటు మ్యాపును రూపొందించాలన్నారు. మండలాల్లో సాగుభూమి విస్తీర్ణం, పంట నష్టం, భూగర్భ జలాల తగ్గుదల, తాగునీటి ఎ ద్దడి, సాగునీటి ఎద్దడి తదితర వివరాలతో పా టు పంటల వారీగా నష్టాలను విశదీకరిస్తూ నివేదికలు రూపొందించి సిద్ధంగా ఉండాలన్నారు. కరవు బృందం జిల్లాలో ఏ ప్రాంతలో పర్యటిం చినా అక్కడి వివరాలు తెలపాలన్నారు

Thursday, 1 December 2011

సమ్మె విరమించిన త్రిపుల్ ఐటీ ఉద్యోగులు


కడపజిల్లా ఇడుపాయల ట్రిపుల్ ఐటీ ఉద్యోగుల నలభై ఐదు రోజుల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. డిప్యూటీ సీఎం రాజనర్సింహ ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చలు ఫలించడంతో ఉద్యోగులు సమ్మె విరమించారు.ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ నిమ్మరసం ఇచ్చి సమ్మె విరమింపజేశారు. దీంతో ఇవాళ్టి నుంచి విధులకు హాజరుకావాలని త్రిపుల్ ఐటీ ఉద్యోగులు నిర్ణయించారు.

Wednesday, 23 November 2011

నిరుద్యోగ యువతకు ప్రధాన మంత్రి ఉపాధి కల్పన

నిరుద్యోగ యువతకు ప్రధాన మంత్రి ఉపాధి కల్పన ఒక వరం లాంటిదని రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల డైరక్టర్ మోహన్‌రావు పేర్కొన్నారు. కలెక్టరేట్ సభా భవనంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పనపై బ్యాంకు అధికారుల తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఎంఆర్‌వై పథకంలో భాగంగా పరిశ్రమ స్థాపనలో దేశంలో మన రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నా రు. రూ.110 కోట్లు సబ్సిడీ వినియోగించుకోవాల్సి ఉండగా మన రాష్ట్రం 73 కోట్లు సబ్సిడీ వినియోగించుకుందన్నారు. రాష్ట్రం పరిశ్రమల ఏర్పాటులో మొద టి స్థానానికి రావాలంటే బ్యాంకు అధికారులు తమ వంతు సహకారం అందిం చాలన్నారు.నిరుద్యోగ యువతకు పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులు బ్యాంకు అధికారులు పెండింగ్ లేకుండా క్లియర్ చేయాలని సూచించారు. రిజ ర్వు బ్యాంకు 10లక్షలు చిన్న పరిశ్రమలకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బ్యాం కులు రుణాలు ఇవ్వాలని 25లక్షలు క్రెడిట్ ప్లాన్ ద్వారా రుణాలు ఇచ్చేందుకు ఆన్‌లైన్ ద్వారా బ్యాంకులు మంజూరు చేస్తారన్నారు. బ్యాంకులు మంజూరు చేసిన రుణాలను మొదటి కంతు చెల్లించిన వెంటనే సబ్సిడీ వస్తుందని తెలి పారు. 2011కి 297 కోట్లు మార్జిన్ మనీ కింద 12936 ప్రాజెక్టులు మంజూరు చేశామన్నారు.యువతకు వివిధ వృత్తుల్లో శిక్షణ అందిస్తే వారిని బ్యాంకులు రుణాలు సబ్సిడీపై అందించాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవగాహన కల్పించాలన్నారు

Monday, 7 November 2011

నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ కిరణాల శిక్షణ ఉపాధి

నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ కిరణాల ద్వారా ప్రభుత్వ ఖర్చు తో శిక్షణ ఇచ్చి ఉపాధిని కల్పించడం జరుగుతుందని కలెక్టర్ వి. అనిల్‌కు మార్ పేర్కొన్నారు.  డీఆర్ డీఏ కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ యువకిరణాలు పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు కల్గిన నిరు ద్యోగ యువత రాజీవ్ యువకిరణాలు ప«థకం ద్వారా ఉపాధిని కల్పించే అవ కాశాన్ని ప్రభుత్వం కలిగిస్తోందన్నారు. ఉద్యోగం కావాల్సిన అభ్యర్ధులు సమీ పంలోని ఎంపీడీవో కార్యాలయం లేదంటే మున్సిపల్ కార్యాలయంలో తమ పేరు, వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. ఆ మేరకు ఎంపిీ డీవో, మున్సిపల్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించడం జరిగిందన్నారు.
 ఆర్‌వైకె. సిజిజి. జివోవి. ఇన్ వెబ్‌సైట్‌లో ఇంట ర్నెట్ సెంటర్లలో కూడా నమోదు చేసు కోవచ్చన్నారు. వివరాలు నమోదు చేసేందుకు రేషన్‌కార్డు నెంబర్, పుట్టిన తేది వ్యక్తి గత సెల్ ఫోన్ నెంబర్లు కలిగి ఉండాలన్నారు. అభ్యర్ధులతో పాటు పరిశ్రమలు, వ్యాపారస్తులు, ఇతర సేవా సంస్ధ యాజమానులు కూడా వెబ్‌సైట్‌లో వారి సంస్ధ వివరాలు, వారికవసరమైన ఉద్యోగులు, అందుకు కావాల్సిన అర్హతలను నమోదు చేసుకో వాలని సూచించారు. పెద్దపెద్ద సంస్ధల కు ఉద్యోగులు ఎక్కువగా అవసరమ నుకుంటే జాబ్ మేళాలు కూడా నిర్వ హిస్తామన్నారు. స్ధానిక పరిశ్రమలు, ఇతర వ్యాపారస్ధులు ఉద్యోగులు అవసరమైతే డీఆర్‌డీఏ కార్యాలయా న్ని సంప్రదించి నేరుగా అభ్యర్ధులను తీసుకోవచ్చన్నారు

Sunday, 6 November 2011

త్రిపుల్ ఐటిల్లో రిలే దీక్షలను ప్రారంభించారు

రాష్ట్ర ప్రభుత్వం త్రిపుల్ ఐటిల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది సమస్యల పట్ల స్పందించి పరిష్కారం చేయకపోవడం దర్మార్గమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. రాంమోహన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట ఆర్‌జెయు - ఐఐఐటి ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర పిలుపుమేరకు చేపట్టిన రిలే దీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంమోహన్ మాట్లాడుతూ ఇడుపులపాయ త్రిపుల్ ఐటిలో 300 మంది దాకా బోధన, బోధనేతర సిబ్బంది గత 3 సంవత్సరాలుగా పని చేస్తున్నారని ఆయన తెలియజేశారు. వీరిలో మెంటర్స్, హెచ్‌ఆర్‌టిలు, ఇతర సిబ్బంది వివిధ రకాల పనులు నిర్వహించుచున్నారని ఆయన తెలిపారు. ఇతర సిబ్బందికి జివో నెం.3 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సిలర్‌కు, డైరెక్టర్‌గా అనేక సార్లు విజ్ఞప్తి చేసినా స్పందించి సమస్యను పరిష్కారం చేయలేదన్నారు. దీనికి నిరసనగా నవంబర్ 9 నుండి ట్రిపుల్ ఐటి సిబ్బంది సమ్మె చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి ఎన్. శివరాం, జిల్లా కమిటీ సభ్యులు కామనూరు శ్రీనివాసులరెడ్డి, ఐఐటి ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు మల్లికార్జున, సాగర్ తదితరులు పాల్గొన్నారు