
అనూష్క రీసెంట్ గా ఐదు సినిమాలు ఓకే చేసింది. అయితే ట్విస్ట్ ఏమిటంటే
అవన్నీ తమిళ చిత్రాలు. అరుంధతి తర్వాత ఆ రేంజి హిట్ ని సాధించలేకపోయిన
అనూష్క తమిళంలోనూ సింగం వంటి చిత్రాల ద్వారా తనకంటూ ఓ స్ధానం ఏర్పాటు
చేసుకుంది. ఆ మధ్య విడుదలైన వేదం రీమేక్ కూడా అక్కడ వర్కవుట్ కాకపోయినా
ఆమెకు మంచి పేరే తెచ్చి పెట్టింది. దాంతో హీరోలంతా ఆమెను తమ ప్రక్కన
నటించాలంటూ కోరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆమె వరసగా సినిమాలు సైన్
చేసేసింది. ఇప్పటికే కార్తీ సరసన ఆమె సినిమా చేస్తోంది.ఆ తర్వాత
సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఆర్య హీరోగా ఒప్పుకున్న చిత్రం పిభ్రవరి నుంచి
మొదలు కానుంది. అలాగే విక్రమ్ సరసన మరోసారి తాండవం చిత్రం కమిటైంది. మరో
ప్రక్క సూర్య,అజిత్ చిత్రాలుకు ఓకే చేసింది. అవి ఆగస్టులో మొదలవుతాయి.
ప్రస్తుతం తెలుగులో ఆమె నాగార్జున సరసన ఢమురకం చిత్రం మాత్రమే చేస్తోంది. ఆ
తర్వాత వెంకటేష్ సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చిత్రం ఓకే చేసింది.
అయితే ఇంకా ఆ ప్రాజెక్టు కన్ఫర్మ్ కాలేదు. అలాగే ప్రభాస్ సరసన ఆమె వారిధి
చిత్రం చేసే అవకాసం ఉంది. 2012 లో ఆమె అస్సలు ఖాళీ లేకుండా తన డైరీని ఫిల్
చేసుకుని మిగతా హీరోయిన్స్ కి షాక్ ఇచ్చింది.