తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డెరైక్షన్‌లో సీబీఐ నడుస్తోందని
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా శోభానాగిరెడ్డి ఆరోపించారు. ఏదో
విధంగా ఎమ్మార్ కేసులో జగన్‌ను ఇరికించాలని చూస్తోందని ఆమె అన్నారు. ఎమ్మార్‌పై
అప్పటి కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలనే వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేశారని..
ఆ సబ్ కమిటీని సీబీఐ విచారించిందా అని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు.
చంద్రబాబు, కోనేరు ప్రసాద్‌ల మధ్య ఉన్న సంబంధం రాష్ట్ర ప్రజలందరికి
తెలుసున్నారు. జగన్‌కున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక రామోజీరావు
నీచమైన కథనాలను రాస్తున్నారని ఆమె మండిపడ్డారు. విజయసాయిరెడ్డి కంటే
ముందుగా సీబీఐ జేడీ లక్ష్మినారాయణకు నార్కో టెస్ట్‌లు నిర్వహించాలని
శోభానాగిరెడ్డి డిమాండ్ చేశార.సిబిఐ దర్యాఫ్తు చూసి రాష్ట్ర ప్రజలు
నవ్వుకుంటున్నారని మరో నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అంతకుముందు వేరుగా
అన్నారు. స్టైలిష్ హోం రంగారావును వదిలేసి సిబిఐ అమాయకుడైన సునీల్ రెడ్డిని
అరెస్టు ఎందుకు చేసిందన్నారు. బాబు, కాంగ్రెసు ఫిక్సింగ్ చేసుకొని రైతులను
అవమానిస్తున్నారని మండిపడ్డారు. బాబు తమ పార్టీని లక్ష్యంగా
చేసుకున్నారన్నారు. రాష్ట్రపతి ప్రసంగం కంటే సునీల్ రెడ్డి అరెస్టే
ప్రధానంగా ఎల్లో మీడియా వార్తలు ప్రచురించడమేమిటన్నారు
Showing posts with label ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి. Show all posts
Showing posts with label ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి. Show all posts
Thursday, 26 January 2012
Wednesday, 18 January 2012
నా రాజీనామాను ఆమోదించండి...ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి
Monday, 12 December 2011
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం...ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి
Subscribe to:
Posts (Atom)
