ఆంధ్రలో చిచ్చు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.
చంద్రశేఖర రావు ప్రయత్నిస్తున్నారని మంత్రి టిజి వెంకటేష్ విమర్శించారు.
ఆంధ్రలో చిచ్చు పెట్టేందుకే ఉప ఎన్నిక జరుగుతున్న కోవూరు శానససభా
నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తానని కెసిఆర్ చెబుతున్నారని ఆయన శనివారం
మీడియా ప్రతినిధులతో అన్నారు. కోవూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ
అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ప్రజలు ఓటేస్తే రాష్ట్ర
విభజనకు ఓటేసినట్లేనని ఆయన అన్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన 17 మంది
శానససభ్యులపై స్పీకర్ వేటు వేస్తూ సరైన నిర్ణయమే తీసుకున్నారని, వేటు
బాధాకరమే అయినప్పటికీ అది సరైన నిర్ణయమని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు
వైపు వెళ్లిన నాయకులు తిరిగి కాంగ్రెసులోకి వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ త్వరలో కాంగ్రెసులో విలీనమవుతుందని ఆయన
అన్నారు.
Showing posts with label మంత్రి టీజీ వెంకటేష్. Show all posts
Showing posts with label మంత్రి టీజీ వెంకటేష్. Show all posts
Saturday, 3 March 2012
Wednesday, 29 February 2012
కెసిఆర్‌కు పోటీ సభ పెడతా... టిజి వెంకటేష్
ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొంటానని
మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. అయితే పార్టీ నేతలు వద్దని చెబుతున్నారని
అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు
కల్వకుంట్ల చంద్రశేఖర రావు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని
కొవ్వూరు నియోజకవర్గంలో ఆంధ్ర ప్రజా సమితి పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు
వస్తే తాను కాంగ్రెసు తరఫున ప్రచారం చేసేందుకు వెళతానని చిన్న నీటి పారుదల
శాఖ మంత్రి టిజి వెంకటేష్ బుధవారం చెప్పారు. కెసిఆర్ కొవూరులో ప్రచారం
చేస్తే అదే సమయంలో నేను అక్కడ సభను ఏర్పాటు చేస్తానని చెప్పారు. కెసిఆర్
అక్కడ ప్రత్యేక వాదం వినిపిస్తే తాను సమైక్యవాదం వినిపిస్తానని చెప్పారు.
ఆయనపై ఎవరూ దాడి చేయకుండా చూస్తానని చెప్పారు. కెసిఆర్ అక్కడ ఏర్పాటు చేసే
సభకు ఎక్కువ జనం వస్తే రావొచ్చునని.. అడవి మనుషులను చూసేందుకు కూడా జనం
అధికంగా వస్తారని విమర్శించారు.
Thursday, 5 January 2012
ఒక్కసారే వైకుంఠ దర్శనం : మంత్రి టీ జీ వెంకటేష్
ముస్లింలు మక్కా మసీదుకు ఎలా వెళతారో.. ఆ విధంగా తిరుమల స్వామివారిని కూడా
ఏడాదికోసారి మాత్రమే దర్శించుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్
సూచించారు. తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో
మాట్లాడారు.తాను మొదటిసారిగా వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల
వచ్చానన్నారు. తాను క్యూలైన్లో వెళ్లేటప్పుడు చాలామంది భక్తులు పలుసార్లు
వచ్చామని చెప్పారన్నారు. అందుకని భక్తులు తమ జీవితంలో ఒకసారి మాత్రమే
వైకుంఠ ఏకాదశికి రోజున స్వామివారిని దర్శించుకోవాలని ఆయన విజ్ఞప్తి
చేశారు. ఇక భక్తులు త్వరితగతిన ఆలయం వెలుపలకు వచ్చేలా గర్భగుడి
తప్ప మిగిలిన ప్రాంతాల్లోని క్యూలైన్లను తాజా సాంకేతిక పరిజ్ఞానంతో
ఏర్పాటు చేయాలన్నారు. మఠ, పీఠాధిపతుల సలహాలు భక్తులకు ఇబ్బందులు తలెత్తెలా
ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందరికీ ఆమోదయోగ్యమైన క్యూలైను
ప్రవేశపెట్టాలని టీటీడీ అధికారులను మంత్రి కోరారు.
Subscribe to:
Posts (Atom)
